Dragon: జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్, ఐ ఫీస్ట్.. ‘డ్రాగన్’ గ్లింప్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,220FansLike
57,764FollowersFollow

Dragon: జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలను మోసుకుంటూ వచ్చిన ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ వారి ఎదురుచూపులకు తెర దించింది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేసింది. మంగళవారం రాత్రి విడుదలైన టీజర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని పూర్తిగా సంతృప్తిపరచిందని చెప్పాలి. సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అయితే.. సినిమా విడుదలకు మాత్రం ఫ్యాన్స్ ఇంకా ఏడాదిపాటు ఎదురుచూడాల్సిందే. 11 జూన్ 2027న సినిమా విడుదల కానుంది.

దర్శకుడు ప్రశాంత్ నీల్ తన పూర్వ సినిమాల మాదిరే చీకటి సామ్రాజ్యం కథనే ఎంచుకున్నాడు. టీజర్ మొత్తం నాలుగు నిముషాలు ఉంది. ఇందులో గ్యాంగ్ స్టర్, హెరాయిన్ డ్రగ్స్ కథాంశం, విలన్లు, హీరో క్యారెక్టరైజేషన్ ను పరిచయం చేసిన విధానం బాగుంది. ఎవరెవరు ఏంటనేది ఒక్కొక్కరినే బ్యాటిల్ ఆఫ్ వార్ కు సిద్ధమైనట్టుగా పరిచయం చేస్తూ హీరో ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేశారు. ‘దేవుడు నాకో గొప్ప వరం ఇచ్చాడు. ట్రిగ్గర్ నొక్కగానే మరచిపోవడం. నిద్రపోయినప్పుడు నా కలలలోకి నేను చంపిన వారి ముఖాలు రావు. మిగిలున్న శత్రువుల ముఖాలే కనపడతాయి. పొరపాటున కూడా నా కలలలోకి రావొద్ద’ని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ హీరో శక్తి సామర్ధ్యాలు ఏంటో తెలిసేలా చేశాడు.

పూర్తి రగ్గడ్ లుక్ లో ఎన్టీఆర్ చాలా పవర్ ఫుల్ గా, మాసివ్ అవతార్ లో కనిపించాడు. తన మేకోవర్ తో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేశాడు. రవి బస్రూర్ బీజీఎమ్ టీజర్ కు ప్లస్ లా నిలిచింది. విజువల్స్ కూడా బాగున్నాయి. బ్రిటిషర్లు ఎలా ఇండియాలోకి వచ్చారు.. ఎందుకు వచ్చారు.. ఆఫ్గనిస్థాన్ కు ఈ మాఫియాకు లింకేంటనేది సినిమా కథగా టీజర్ ద్వారా తెలుస్తుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. హీరో పరిచయం, డార్క్ బ్యాటిల్, స్లో మోషన్ నెరేషన్ మాత్రం ప్రశాంత్ నీల్ గత సినిమాల మాదిరే ఉన్నాయి. మొత్తంగా ఎన్టీఆర్ తన బర్త్ డేకి ఫ్యాన్స్ కు ఫుల్ ఫీస్ట్ ఇచ్చేశారు.

సినిమా

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

జూలై 9నే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఐ, నోబడీ’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు...

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఈ నెల 9న మలయాళంలో విడుదల కానుండగా, జూలై 10న తెలుగు ప్రేక్షకుల...

రాజకీయం

విశ్వనాథ ఆలయ మహోత్సవంలో ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌లోని వసంతనగర్ కాలనీలో ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన శివాలయం పునః ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి...

ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేనలోకి కూకట్‌పల్లి యువత చేరిక

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి యువత నుంచి మద్దతు పెరుగుతున్నట్లు మరోసారి కనిపించింది. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కూకట్‌పల్లి డివిజన్‌కు చెందిన పలువురు...

కుప్పం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు.. ‘జన నాయకుడు’ పోర్టల్‌పై ప్రత్యేక సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన జన నాయకుడు పోర్టల్ పనితీరును ఆయన పరిశీలించారు. పోర్టల్...

వంగవీటి రంగా జయంతి.. ఘన నివాళులు అర్పించిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్

కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. బాలాజీ నగర్, ప్రగతి నగర్, ఎల్లమ్మ బండ, కేపీహెచ్‌బీ కాలనీ హౌసింగ్ బోర్డ్...

యూట్యూబర్ ప్రశ్న రావణ్ వరుస అరెస్టులు.. మూడు రోజుల్లో నాలుగు సార్లు అదుపులోకి

యూట్యూబర్ బాచలకూరి జోసెఫ్ అలియాస్ "ప్రశ్న" రావణ్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు జూన్ 30 నుంచి జూలై 4 మధ్య మూడు రోజుల వ్యవధిలో నాలుగు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేశారు. ప్రతి కేసులో...

ఎక్కువ చదివినవి

తన వెంట నడిచిన వారిని మరిచిపోని లోకేష్.. యువగళం బృందంతో ఆప్యాయ కలయిక

తిరుపతిలో మంత్రి నారా లోకేష్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. యువగళం పాదయాత్రలో తనతో కలిసి నడిచిన కార్యకర్తలను గుర్తుపట్టడమే కాకుండా, వారిని పేరుపేరునా పలకరించి, ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. దీంతో యువగళం...

శ్రీసిటీలో లోకేష్ కీలక ప్రకటనలు.. ఏపీకి 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌ను దేశ ఆర్థికాభివృద్ధిలో అగ్రస్థానంలో నిలపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రస్తుతం సుమారు 220 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా...

జులై 15 నుంచి ఇంటింటికీ కూటమి విజయాలు.. టీడీపీ కేడర్‌కు లోకేష్ దిశానిర్దేశం

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కీలకమని, ఈ రోజు తాము పదవుల్లో ఉండటానికి పార్టీ కేడర్ చెమట, త్యాగాలే కారణమని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్నారు. శ్రీకాళహస్తి...

హైదరాబాద్‌లో బీఫ్‌ను మటన్‌గా విక్రయం..? ఇద్దరు అరెస్ట్.. 50 కిలోల మాంసం స్వాధీనం

హైదరాబాద్‌లో ఆహార భద్రతపై ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. బీఫ్‌ను మటన్‌గా కలిపి నగరంలోని పలు హోటళ్లకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై తెలంగాణ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో...

‘రావు బహదూర్’ నా కెరీర్‌ను మార్చే సినిమా: సత్యదేవ్

జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన సైకాలజికల్ డ్రామా **'రావు బహదూర్'**పై హీరో సత్యదేవ్ పూర్తి నమ్మకంతో ఉన్నారు. విడుదలకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను...