Switch to English

ట్రంపు.. భారత్‌కి రాకముందే ఏంటీ కంపు.!

‘ట్రంపు.. కంపు..’ ఈ చర్చ చాలకాలం నుంచీ జరుగుతున్నదే. అసలు అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్‌ ట్రంప్‌ ఎలా గెలిచాడు.? అన్నది ఇప్పటికీ చాలామందికి అనుమానమే. ఎలాగైతేనేం, అందరి అంచనాలూ తల్లకిందులు చేసి ట్రంప్‌, అమెరికా అధ్యక్షుడిగా సంచలన విజయం సాధించాడు. ఇది ఇప్పటి వ్యవహారం కాదు.. కొన్నేళ్ళ క్రితం నాటి మాట. ట్రంప్‌ బొమ్మల్ని నగ్నంగా అమెరికా నడి వీధుల్లో నిలబెట్టిన సందర్భాలున్నాయి. మనోడికి అక్కడ వున్న క్రేజ్‌ అలాంటిది మరి.! ఈ ఫాలోయింగ్‌కి అర్థం వేరే వుంది లెండి..!

ఇక, అసలు విషయానికొస్తే, ట్రంప్‌.. భారతదేశానికి వస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడు, భారత్‌కి రావడమంటే ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ప్రపంచంలోనే అత్యాధునికమైన.. ఓ భారీ లోహ విహంగం.. దాంతోపాటుగా, ఎన్నో ప్రత్యేకమైన వాహనాలు ఇండియాకి వస్తాయి.. కొన్ని ఇప్పటికే వచ్చేశాయి. ఇంతకీ, ట్రంప్‌.. ఇండియాకి వస్తూ ఏం తెస్తున్నాడట.? ఏమీ తీసుకురాడు.. తీసుకెళ్దామని మాత్రం చూస్తాడు. అదే, అతని ప్రత్యేకత.

వాణిజ్య ఒప్పందాల విషయమై ట్రంప్‌ పూటకో మాట మాట్లాడుతున్నాడు. ఆయన లెక్కలు ఆయనకున్నాయి. ‘అమెరికా ఫస్ట్‌’ అనే నైజం ఆయనది. ఏ దేశాధ్యక్షుడికైనా అది వుండాల్సిందే. కానీ, ట్రంప్‌ తీరు ఈ విషయంలో మరీ దారుణం. భారత్‌ నెత్తిన ట్రంప్‌ ఎలాంటి ‘పిడుగు’ పడేస్తాడన్నదానిపై చాలా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వం మాత్రం, అమెరికా అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. మురికి కాల్వలు కన్పించకుండా, అడ్డుగోడలు ఇప్పటికే కట్టేశారు. యమునా నదిలో కంపు పోగొట్టేందుకు నానా తంటాలూ పడుతున్నారు. కానీ, ట్రంపు నోటి కంపు మాత్రం పోవడంలేదు.

భారతదేశం మీద చాలా వెటకారాలేస్తున్నాడాయన. ‘మోడీ అంటే ఇష్టం.. కానీ, భారత్‌ విషయంలో మాకు కొన్ని ప్రత్యేక ఆలోచనలున్నాయి..’ అంటున్నాడాయన. ఇప్పుడే ఇలా వుంటే, ఇండియాకి వచ్చాక ట్రంప్‌ ఇంకెలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తాడో ఏమో.! అమెరికా నుంచి అత్యాధునిక యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లు కొనుగోలు చేయాలన్న ఆలోచన భారతదేశానికి వుంది. అయితే, ఆ ఒప్పందాల విషయంలో ట్రంప్‌ పెట్టబోయే మెలిక ఏంటి.? అన్నది చాలామందిని కలవరపెడుతోంది.

‘చికెన్‌ లెగ్స్‌’ విషయంలో ట్రంప్‌, భారత్‌పై ఒత్తిడి తీసుకురానున్నాడన్నది నిర్వివాదాంశం. అమెరికన్లు చికెన్‌ లెగ్స్‌ని ఇష్టపడరు.. వాటిని భారత మార్కెట్‌లోకి డంప్‌ చేయాలన్నది ట్రంప్‌ ఆలోచన. ఇలాంటి వైపరీత్యాలు చాలానే వున్నాయి. నిజానికి, అవసరం పూర్తిగా ట్రంప్‌దే. కానీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం మామూలే. మరి, భారత ప్రధాని.. అమెరికా అధ్యక్షుడికి ఇవ్వబోయే ఆతిథ్యమేంటి.? ఈ ఇద్దరి భేటీ.. దేశ ప్రయోజనాలకు ఎంతవరకు ప్రయోజనకారి.? అన్నది వేచి చూడాల్సిందే.

సినిమా

కేజీఎఫ్‌ 2 గురించి రెండు బ్యాడ్‌ న్యూస్‌

కన్నడ సూపర్‌ హిట్‌ మూవీ కేజీఎఫ్‌ కు ప్రస్తుతం సీక్వెల్‌గా కేజీఎఫ్‌ 2ను చిత్రీకరిస్తున్న విషయం తెల్సిందే. మొదటి పార్ట్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న...

ఆచార్యలో చరణ్‌.. ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన చిరు

చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో ఒక కీలక పాత్ర ఉంటుందని ఆ పాత్రను మహేష్‌ బాబు లేదా రామ్‌ చరణ్‌ చేయబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా ఏదో...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీంకు 5 కోట్ల ఫైన్‌ వేసిన ఆలియా?

 టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్లాన్‌ వేస్తే దాన్ని అచ్చు గుద్దినట్లుగా పొల్లు పోకుంటా మొదటి నుండి చివరి వరకు ఎగ్జిక్యూట్‌ చేస్తాడనే విషయం అందరికి తెల్సిందే....

ఫ్యాన్స్‌లో గందరగోళం క్రియేట్‌ చేస్తున్న చరణ్‌

మెగా హీరో రామ్‌ చరణ్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో చిరంజీవి ఆచార్య చిత్రంలోనూ ఒక కీలకమైన గెస్ట్‌ పాత్రలో...

‘ఒరేయ్‌ బుజ్జిగా’ ఓటీటీ ప్రచారంపై నిర్మాత స్పందన

రాజ్‌ తరుణ్‌ హీరోగా మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా విజయ్‌ కుమార్‌ కొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యి...

రాజకీయం

జనసేనాని హుందాతనం.. వైఎస్సార్సీపీ వెకిలితనం.!

కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమల్లో వుంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి. అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది నిస్సిగ్గుగా....

కరోనాని చంపే జెల్ ని కనుగొన్న బాంబే ఐఐటి.!

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొంతమంది వాక్సిన్లు తయారీలో నిమగ్నమై ఉండగా.. మరికొంత మంది దీనిని నిరోధించే ఔషధం కనుగొనే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు. వాక్సిన్...

కరోనా ఎఫెక్ట్‌: ప్రపంచం చాలా చాలా మారిపోవాల్సిందే.!

‘ఇకపై ఏదీ ఇంతకు ముందులా వుండదు..’ ఇదీ నిపుణులు చెబుతున్న మాట కరోనా వైరస్‌ గురించి. ప్రపంచం చాలా మారాలి. చాలా చాలా మార్పులు చోటు చేసుకోవాలి. అయితే, అవన్నీ మనుషుల అలవాట్ల...

శానిటైజర్‌ డబ్బా మీదకెక్కిన పబ్లిసిటీ పైత్యం.!

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ పైత్యం రోజు రోజుకీ పెరిగిపోతోంది. కాదేదీ పబ్లిసిటీకి అనర్హం అన్నట్లు.. స్మశానాలకీ, మరుగుదొడ్లకీ అధికార పార్టీ రంగులు పూసిన వైనం గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఇప్పుడు కరోనా వైరస్‌ని...

సోనియా ఐడియా.. మీడియాకు సంకటమే

కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి, కరోనాపై పోరుకు అవసరమైన నిధులు ఎలా తీసుకురావాలి అనే అంశంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేసిన సూచనలు మీడియాకు సంకటంగా మారాయి....

ఎక్కువ చదివినవి

వైసీపీ ప్రజా ప్రతినిథులకి ‘బాధ్యత’ లేదా.?

ఓ మంత్రిగారేమో కరోనా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డు ప్రారంభోత్సవానికి వెళతారు. ఇంకో మంత్రిగారేమో.. పెద్ద సంఖ్యలో అనుచరుల్ని పోగేసుకుని, ప్రజలకు సాయం చేస్తున్న పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేసుకుంటారు....

మహేష్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ మద్య రచ్చ

మహేష్‌ బాబు హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాకు అనీల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి...

డిజిటల్ ప్లాట్ ఫామ్ లో “పలాస 1978″కు మంచి స్పందన

ఈమద్య కాలంలో కొత్త వారు సరికొత్త కాన్సెప్ట్‌లతో చేస్తున్న సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలాస సినిమాపై కూడా మంచి అంచనాల మధ్య విడుదలై సక్సెస్ సాధించింది....

భయపెడ్తున్న ‘మళ్ళీ లాక్‌డౌన్‌’ పుకార్లు.!

ఏది నిజం.? ఏది అబద్ధం.? ఏమీ అర్థం కాని పరిస్థితి. ‘అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించండి.. పుకార్లను అస్సలేమాత్రం నమ్మొద్దు.. లాక్‌డౌన్‌ కొనసాగింపు ఆలోచనల్లేవు..’ అని ఓ పక్క కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా...

లాక్ డౌన్ లాభాల్లో ఇది మరో కోణం

లాక్ డౌన్.. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మార్మోగుతున్న పదం. దీని గురించి చిన్నపిల్లాడి నుంచి పండు ముదుసలి వరకు, చదువురాని వ్యక్తి నుంచి ప్రొఫెషన్ వరకు అందరికీ తెలుసు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి లాక్...