తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ డొక్కా మణిక్య వరప్రసాద్, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి ఓ లేఖ కూడా రాశారాయన. రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలతో కలత చెందాననీ, మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాననీ, రాజధాని విభజన తీవ్రంగా తనను కలచి వేసిందనీ టీడీపీ అధినేతకు రాసిన లేఖలో డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు.
కాగా, డొక్కా మాణిక్య వరప్రసాద్‌తో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు జరిగాయనీ, ఈ నేపథ్యంలోనే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. శాసన మండలిలో ప్రస్తుతానికి టీడీపీదే మెజార్టీ. దాంతో, శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లుని పాస్ చేయించుకునేందుకు విపక్షం బలాన్ని తగ్గించేందుకు వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోంది.
పలువురు ఎమ్మెల్సీలు రాజీనామా బాట పట్టనున్నారనీ, కొందరు అధికార పార్టీలోకి జంప్ చేయబోతున్నారనీ గుసుగుసలు విన్పిస్తున్నాయి. ‘సాయంత్రానికి ఏం జరుగుతుందో మీరే చూస్తారు..’ అంటూ అధికార వైఎస్సార్సీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండడాన్ని చూస్తే.. మండలిలో ప్రతిపక్షం బలం కొద్ది గంటల్లోనే దారుణంగా పడిపోయేలా కన్పిస్తోంది.
అయితే, మండలిలో ఈ రోజు వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం, విపక్షం దానికి అడ్డు తగలడం జరిగిపోయాయి. కాగా, అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం తారాస్థాయికి చేరింది. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి యాగీ చేయడంతో, స్పీకర్ తమ్మినేని సహనం కోల్పోయారు. సభ నుంచి వెళ్ళిపోతున్నట్లు ప్రకటిస్తూ, సభను వాయిదా వేశారాయన. సభలో ఈ తరహా గొడవలు కొత్తేమీ కాదుగానీ, స్పీకర్ సహనాన్ని కోల్పోవడమే ఆశ్చర్యకరం.
987809 574288Hmm is anyone else experiencing issues with the images on this weblog loading? Im trying to find out if its a difficulty on my finish or if its the weblog. Any responses would be greatly appreciated. 401438
88453 575943Most reliable human being messages, nicely toasts. are already provided gradually during the entire wedding celebration and therefore are anticipated to be very laid back, humorous and as nicely as new all at once. greatest man speech 416482