పుష్ప-2 ప్రీమియర్స్ షోలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ ను తాజాగా డాక్టర్లు డిశ్చార్జి చేశారు. శ్రీతేజ్ గత ఐదు నెలలుగా ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. గత 15 రోజుల క్రితం ఐసీయూ నుంచి తర్వాత శ్రీతేజ్ ను రూమ్ కు తరలించారు. ప్రస్తుతం పైప్ నుంచి మాత్రమే లిక్విడ్ రూపంలో ఆహారం తీసుకుంటున్నాడు. రిహాబిలిటేషన్ కు తీసుకెళ్తే అక్కడ ఫిజియో థెరపీ ద్వారా మరింత కోలుకునే అవకాశం ఉందని డాక్టర్లు సూచించడంతో కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు సికింద్రబాద్ లోని కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. పుష్ప-2 ప్రీమియర్స్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోయారు.
ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరాడు. శ్రీతేజ్ అప్పటి నుంచి అచేతన స్థితిలోనే ఉన్నాడని డాక్టర్లు చెబుతున్నారు. బ్రెయిన్ ఇంకా కోలుకోలేదని.. అవయవాలు ఇంకా పనిచేయట్లేదని డాక్టర్లు చెబుతున్నారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్ మాట్లాడుతూ.. తమకు ప్రభుత్వం, పుష్ప-2 మేనేజ్ మెంట్ అండగా ఉన్నారని.. బాబు ఇంకా కోలుకోవట్లేదని చెబుతున్నారు. తమను ఇంకా గుర్తు పట్టట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భాస్కర్. ప్రస్తుతం శ్రీతేజ్ కు రిహాబిలిటేషన్ సెంటర్ లో 15 రోజులు ట్రీట్ మెంట్ ఇచ్చిన తర్వాత ఇంటికి తీసుకెళ్లొచ్చు అని డాక్టర్లు సూచించినట్టు భాస్కర్ చెప్పారు.
