వైద్యరంగంలో చైనా మరో ముందడుగు వేసింది. 5G టెక్నాలజీ తో దేశీయంగా తయారుచేసిన రోబో సాయంతో 5వేల కి. మీ దూరం నుంచి షిల్లాంగ్ కి చెందిన వైద్యుడు విజయవంతంగా సర్జరీ చేశాడు. కస్గర్ కి చెందిన ఓ రోగి ఊపిరితిత్తుల్లో ఉన్న కణతిని క్విన్ కాన్ అనే వైద్యుడు షిల్లాంగ్ లోని తన ఆఫీస్ నుంచి 5G రోబో మెషిన్ ను ఆపరేట్ చేస్తూ సర్జరీ చేసి తొలగించారు.
కొందరు వైద్యుల సాయంతో సుమారు గంటపాటు శ్రమించి ఈ ఆపరేషన్ ను విజయవంతం చేశారు. షాంఘై మున్సిపాలిటీలోని షాంఘై చెస్ట్ హాస్పిటల్ లో ఈ సర్జరీ జరిగింది. దీనికి సంబంధించిన వీడియోని ప్రముఖ స్టాక్ మార్కెట్ ట్రేడర్ నరేష్ నంబిషన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలాంటి రోబో సాయంతో సర్జరీ చేయడం అనేది భవిష్యత్తు తరాల్లో ట్రెండ్ కాబోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“రిమోట్ రోబోటిక్ మినిమల్ యాక్సిస్ సర్జరీ” అనేది ప్రస్తుతం చైనాలో ఇప్పుడిప్పుడే అవలంబిస్తున్నారు. దీనికి 5G టెక్నాలజీ అవసరం. ప్రపంచమంతా ఈ ట్రెండ్ త్వరలో మొదలు కాబోతోంది” అంటూ ఓ సర్జన్ ఆ వీడియోకి కామెంట్ పెట్టారు. ” మెడికల్ హిస్టరీలో ఇదొక అద్భుతమని చెప్పాలి. ఈ రోబో సాయంతో మానవ శరీరంలో ఇంకా ఎలాంటి అద్భుతాలు దాగున్నాయో కనుక్కోవచ్చు” అని మరో సర్జన్ అన్నారు.