హాస్య బ్రహ్మ బ్రహ్మానందం థియేటర్ లో సినిమాలు చూడరా.. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా అది నిజమట. తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే మన బ్రహ్మి థియేటర్ కి వెళ్లి సినిమా చూసి చాలా కాలమైందట. ఆయన అలా థియేటర్ కి వెళ్లి సినిమా చూడటానికి అంతగా ఇష్టపడరట. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు స్వయానా బ్రహ్మానందం తనయుడు గౌతమ్ రాజా వెల్లడించాడు.
బ్రహ్మానందం కొడుకు గౌతమ్ కూడా హీరోగా కొన్ని ప్రయత్నాలు చేశాడు. ఐతే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అతను మళ్లీ బ్రహ్మా ఆనందం టైటిల్ తో ఒక సినిమా చేశాడు. ఈ సినిమాలో తండ్రి బ్రహ్మానందంతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు గౌతమ్ రాజా. ఈ సినిమాలో గౌతమ్ తో బ్రహ్మానందం ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు.
బ్రహ్మానందం ఇలా లెంగ్తీ రోల్ చేసి చాలా ఏళ్లు అవుతుంది. ఐతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రహ్మానందం అసలు థియేటర్ లో సినిమా చూడరని షాకింగ్ న్యూస్ చెప్పాడు గౌతమ్. ఆయన టీవీలో చూడటం తప్ప సినిమాలు థియేటర్ కి వెళ్లి చూడరని అన్నాడు. తనకు తెలిసి అన్నమయ్య సినిమాను ఆయన థియేటర్ లో చూశారని అది కూడా రాఘవేంద్రరావు గారి కోసం ప్రీమియర్ ని థియేటర్ లో చూసినట్టు చెప్పాడు. అంతేకాదు ఆయన సినిమాలకు ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ కూడా తాను ఫోన్ లో రికార్డ్ చేసి నాన్నకు చూపిస్తానని అన్నాడు గౌతమ్. బ్రహ్మానందం థియేటర్ లో సినిమాలు చూడకపోవడం అనేది కాస్త ఆశ్చర్యకరంగానే ఉందని అంటున్నారు ఆడియన్స్.