నటి హరితేజ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. బిగ్ బాస్ సీజన్-8లో చాలామంది ఫేవరెట్ కంటెస్టెంట్లలో ఆమె కూడా ఒకరు. అక్టోబర్ 6న వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన హరితేజ తన ఆట తీరుతో బాగానే ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. రెండు వారాల్లో ఆమె అందరితో కలిసిపోయే ప్రయత్నాలు బాగానే చేసింది. కానీ ఆమె ప్రేక్షకులను తన ఆటతీరుతో, తన బిహేవియర్ తో అంతగా ఆకట్టుకోలేదనే చెప్పుకోవాలి. ఈ సారి నామినేషన్స్ లో గౌతమ్, నిఖిల్, ప్రేరణ, యష్మీ, విష్ణుప్రియ, పృథ్వీ, హరితేజ పదో వారం నామినేషన్స్‌లో ఉన్నారు.
ఇందులో గౌతమ్ కు అత్యధిక ఓట్లు సాధించారు. డేంజర్ జోన్ లో హరితేజ, యష్మి ఉండగా.. ప్రేక్షకుల నిర్ణయం ప్రకారం హరితేజ ఎలిమినేట్ అయిపోయింది. ఆమె మూడు వారాల పాటు బిగ్ బాస్ లో ఉండగా వారానికి రూ.3లక్షల వరకు పారితోషికం అందుకుంది. అంటే రోజుకు రూ.42,857. అంటే ఈ లెక్కన ఆమె ఐదు వారాలకు గాను రూ.15 లక్షల వరకు పారితోషికం తీసుకుందని సమాచారం. ఈ లెక్కన ఆమె బాగానే వెనకేసుకుందని చెబుతున్నారు. తాను ఎలిమినేట్ అయినా సరే సంతోషంగా ఉందని చెప్పింది.
హౌస్ లో ఎవరు మాస్కులు తీసి ఆడాలో చెప్పాలంటూ నాగార్జున అడగ్గా.. అవినాష్, రోహిణి, టేస్టీ తేజ, ప్రేరణ, నిఖిల్ అని మాస్క్‌లు తీసి ఆడాలంటూ హరితేజ చెప్పుకొచ్చింది.