Switch to English

కోహ్లీ వర్సెస్‌ రోహిత్‌: ఎవరి వికెట్‌ పడుతుందో..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,481FansLike
57,764FollowersFollow

టీమిండియాకి సంబంధించినంతవరకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఇద్దరూ ఇద్దరే.! ఇద్దరి ట్రాక్‌ రికార్డ్‌ని పరిశీలిస్తే.. ఒకర్ని తక్కువ అని, ఒకర్ని ఎక్కువ అని అనడానికి వీల్లేని పరిస్థితి. ఇద్దరూ ఒకప్పుడు మంచి స్నేహితులు.. కానీ, ఇప్పుడు కాదు. వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ పోటీల సందర్భంగా ఇద్దరి మధ్యా గ్యాప్‌ పెరిగిందన్నది తాజాగా జరుగుతున్న ప్రచారం.

అయితే, చాలాకాలంగా ఇద్దరి మధ్యా నివురుగప్పిన నిప్పులా వున్న ‘అభిప్రాయ బేధాలు’ ఇప్పుడు తారాస్థాయికి చేరి, ఒకరంటే ఒకరికి అస్సలేమాత్రం గిట్టని పరిస్థితి వరకూ వెళ్ళిందట. సోషల్‌ మీడియాలో ‘ఫాలో – అన్‌ ఫాలో’ వ్యవహారాలతో ఈ రచ్చ మరింత ముదిరింది. కోహ్లీ సతీమణి అనుష్క శర్మని, రోహిత్‌ శర్మ అన్‌ ఫాలో అవడం, ఆ వెంటనే రోహిత్‌ శర్మ భార్యని అనుష్క అన్‌ ఫాలో అవడం.. ఆ తర్వాత అనుష్క ఈ మొత్తం వ్యవహారాలపై స్పష్టత ఇవ్వడం.. అయినా వివాదం కొనసాగుతుండడం తెలిసిన సంగతులే.

ఇక్కడ విరాట్‌ కోహ్లీ వ్యవహార శైలిని పరిశీలిస్తే.. చాలా కోపిష్టి అనే ఆరోపణలు అతని మీద వున్నాయి. ఎవరి మీదన్నా పంతం పడితే.. ఆ పంతం నెగ్గించుకోవడానికి టీమిండియా ప్రయోజనాల్ని దెబ్బతీయడానికీ వెనుకాడడని అంటారు. మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే టీమిండియా కోచ్‌గా పనిచేసినప్పుడు అతనితో విభేదాలు వచ్చాయి కోహ్లీకి. ఆ విభేదాల కారణంగానే టీమిండియా ఛాంపియన్స్‌ ట్రోఫీని చేజార్చుకోవడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది.

వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్‌కి ముందు రోహిత్‌తో విభేదాల కారణంగానే కోహ్లీ, చెత్త బ్యాటింగ్‌ చేశాడంటూ చాలా పుకార్లు వచ్చాయి. ఆ పుకార్ల మాటెలా వున్నా, జట్టు కూర్పు విషయమై కెప్టెన్‌ వైఖరిని రోహిత్‌ శర్మ పరోక్షంగా తప్పుపడుతున్న విషయం విదితమే. ఇద్దరు స్టార్‌ క్రికెటర్ల మధ్య ఇలాంటి అభిప్రాయ బేధాలు.. జట్టు ప్రయోజనాల్ని దెబ్బతీస్తాయని బీసీసీఐ గట్టిగా నమ్ముతోంది. అయితే, ఎవరినీ మందలించే పరిస్థితి లేదు.. వేటు వేసే పరిస్థితీ అసలే వుండకపోవచ్చు.

వెస్టిండీస్‌ టూర్‌ కోసం కోహ్లీకి రెస్ట్‌ ఇవ్వాలని జట్టు మేనేజ్‌మెంట్‌ భావించింది. దాంతో రోహిత్‌ కెప్టెన్సీలో టీమిండియా, వెస్టిండీస్‌తో తలపడాల్సి వుంది. అది ఇష్టం లేకనే, కోహ్లీ తనకు రెస్ట్‌ వద్దంటూ ముందుకొచ్చాడన్నది ఇంకో వివాదం. ఏదిఏమైనా, ఈ వివాదాలు ముదిరితే ఖచ్చితంగా ఓ పెద్ద వికెట్‌ పడిపోతుంది. అది కోహ్లీదా.? రోహిత్‌దా.? అన్నది రానున్న రోజుల్లో తేలుతుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర...

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు....

రాజకీయం

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

ఎక్కువ చదివినవి

రాజమౌళి డైరక్షన్ లో డేవిడ్ వార్నర్.. ఈ క్రేజీ వీడియో చూశారా?

ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్( David Warner) మైదానంలో ఎంత యాక్టివ్గా ఉంటాడో..సోషల్ మీడియాలోనూ అంతే చురుగ్గా ఉంటాడు. ఫేమస్ టాలీవుడ్ పాటలకు తన స్టైల్ లో స్టెప్పులేస్తూ ఆ వీడియోలను అభిమానులతో...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

Margadarsi: మార్గదర్శికి ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Margadarsi: మార్గదర్శి (Margadarsi) కి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. మంగళవారం విచారణకు వచ్చిన పిటిషన్ పై కీలక తీర్పును వెలువరించింది....

విజయ్ దేవరకొండపై ఇంత నెగెటివిటీ ఎందుకు.?

విజయ్ దేవరకొండ చాలా మారాడు.! ఔను, చాలా చాలా మారాడు.! ‘అర్జున్ రెడ్డి’ ఫేం విజయ్ దేవరకొండ ఎక్కడ.? ‘ఫ్యామిలీ స్టార్’ విజయ్ దేవరకొండ ఎక్కడ.! ఈ మార్పు నిజంగానే అనూహ్యం. మూతి...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా (కోవిడ్...