Switch to English

ఎన్ కౌంటర్ పై అప్పుడలా.. ఇప్పుడిలా..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,481FansLike
57,764FollowersFollow

దిశ హత్యాచార నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడాన్ని మృతుల కుటుంబీకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తమ బిడ్డలను అన్యాయంగా చంపేశారంటూ పోలీసులపై మండిపడుతున్నారు. తమ బిడ్డలు చేసింది తప్పని, వారిని చంపేసినా పర్లేదని తొలుత పేర్కొన్నవారే తాజాగా ధ్వజమెత్తుతున్నారు. హత్యలు, అత్యాచారాలు చేసినోళ్లు ప్రాణాలతో తిరగట్లేదా.. ఇంత అన్యాయంగా మా వాళ్లను చంపేస్తారా అంటూ తూర్పారబడుతున్నారు.

దిశ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తడం, నిందితులను పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేయడం, అనంతరం ఎన్ కౌంటర్ లో నలుగురు నిందితులూ హతమవడం తెలిసిందే. నిందితుల ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. అత్యాచారానికి పాల్పడి జైళ్లలో ఉన్నవారిని సైతం ఇలాగే ఎన్ కౌంటర్ చేసేయాలంటూ డిమాండ్లు రేగాయి.

అయితే, కొన్ని మహిళా, ప్రజా సంఘాలు మాత్రం ఎన్ కౌంటర్ ను వ్యతిరేకించాయి. అలాగే జాతీయ మానవ హక్కుల సంఘం కూడా దీనిపై సుమోటోగా విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబీకుల వైఖరిలోనూ మార్పు వచ్చింది. తమ బిడ్డలు ఇలా చేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన వార తల్లిదండ్రులు.. వారిని చంపేసినా పర్లేదని తొలుత పేర్కొన్నారు.

ఏ తల్లిదైనా కడుపు కోతేనని, ఆ అమ్మాయిని చంపినట్టుగానే తన కొడుకును చంపినా పర్లేదంటూ మృతుల్లో ఒకరైన చెన్నకేశవులు తల్లి జయమ్మ అప్పుడు స్పష్టంచేసింది. ఎన్ కౌంటర్ లో తన కొడుకు చనిపోయాడని తెలిసిన తర్వాత పోలీసులపై ఆమె తీవ్రంగా మండిపడుతోంది. తనకున్న రెండెకరాలు అమ్మి అయినా సరే.. ఆ ఎన్ కౌంటర్ చేసిన పోలీసుల పని పడతానని హెచ్చరించింది.

పైగా తప్పు మొత్తం దిశదే అనే రీతిలో అభ్యంతకర వ్యాఖ్యలు కూడా చేసింది. లారీ వాళ్లు అలాగే ఉంటారని, ఆ అమ్మాయికి రాత్రి 9 గంటల తర్వాత అక్కడ ఏం పని అంటూ ప్రశ్నలు గుప్పించింది. ఈ విషయంలో మానవ హక్కుల కమిషన్ ముందు కూడా తన గోడు వెళ్లబోసుకుంది. తమ బిడ్డలను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారంటూ మృతుల కుటుంబ సభ్యులు కమిషన్ సభ్యుల ముందు వాపోయారు.

మరోవైపు పోలీసులు మాత్రం పక్కా ఆధారాలతో సన్నద్ధమవుతున్నారు. అది నిజమైన ఎన్ కౌంటరే అని నిరూపించాలని భావిస్తున్నారు. ఇక జాతీయ మీడియా సైతం ఈ ఎన్ కౌంటర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తోంది. దేశవ్యాప్తంగా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలను ఇలాగే ఎన్ కౌంటర్ చేయగలరా అని ప్రశ్నిస్తోంది. మొత్తానికి దిశ నిందితుల ఎన్ కౌంటర్ కొత్త చర్చకు దారితీసింది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర...

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు....

రాజకీయం

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

ఎక్కువ చదివినవి

Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ కు ఫ్యామిలీ ఆడియన్స్.. కలిసొచ్చిన సెలవులు

Family Star: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) సినిమా సక్సెస్ ఫుల్ గా ధియేటర్లలో రన్ అవుతోంది. సినిమాకు ఏపీ,...

Chiranjeevi: ఏమున్నావ్ బాసూ..! అదిరిపోయిన మెగాస్టార్ న్యూ లుక్

Chiranjeevi: చిరంజీవిలో ఉన్న గొప్పదనం.. లుక్స్. 15ఏళ్ల క్రితం పాలిటిక్స్ లో ఉన్నప్పుడు చిరంజీవి ఎలా ఉండేవారు.. మళ్లీ సినిమాలు చేయడంతో ఎలాంటి పిజిక్ కి వచ్చేసారనే కంపారిజన్ చాలు.. డిస్కషన్ ఓవర్....

KTR : బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ గా… కేటీఆర్ మాట

KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

Ram Charan: రామ్ చరణ్ గొప్పదనం అదే.. అందుకే గౌరవ డాక్టరేట్..

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరో అరుదైన ఘనతను గౌరవాన్ని దక్కించుకున్నారు. చెన్నైలోని వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు రామ్ చరణ్. కళా రంగానికి...