Switch to English

దిశ ఎన్‌కౌంటర్: సజ్జనార్ పై కమిషన్ ప్రశంసలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటన అంశంలో అప్పటి సీపీ సజ్జనార్ పై కమిషన్ ప్రశంసలు కురిపించింది. సీన్ రీకన్స్ట్రక్షన్‌, నిందితులు తప్పించుకోవడం, జరిగిన సంఘటనపై సజ్జనార్ ను అడిగి తెలుసుకుంది. ఈక్రమంలో సజ్జనార్ ఇచ్చిన సమాచారంపై కమిషన్ ప్రశంసలు కురిపించింది. దీంతో దిశ కమిషన్‌ ముందు సజ్జనార్‌ విచారణ ముగిసింది. కమిషన్ ముందు సజ్జనార్ తో జరిపిన విచారణ..

కమిషన్: ఎన్ కౌంటర్ జరిగిన విషయం మీకు ఏ సమయానికి తెలిసింది?

సజ్జనార్‌: డిసెంబర్ 6 ఉదయం ఆరు గంటల 20 నిమిషాలకు తెలిసింది.

కమిషన్‌: ఎన్ కౌంటర్‌పై ఎఫ్ఐర్ నమోదు ఎంక్వైరీ చేశారా ?

సజ్జనార్‌: శంషాబాద్ డీసిపి కి ఎఫ్ఐఆర్ చేయమని చెప్పాను.

కమిషన్: ఎన్‌కౌంటర్‌ స్పాట్ కి ఏ టైంలో చేరుకున్నారు?

సజ్జనార్‌: ఉదయం 8:30 గంటలకు చేరుకున్నాను.

కమిషన్:  ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఇంచార్జ్ ఆఫీసర్ ఎవరు?

సజ్జనార్‌: షాద్‌నగర్ సీఐ శ్రీధర్ ఇంచార్జీ.

కమిషన్: ఎన్‌కౌంటర్ స్పాట్‌కు రీచ్ అయ్యాక ఎవరెవరిని కలిశారు?

సజ్జనార్‌: ఏసిపి సురేందర్‌ను కలిశాను.

సజ్జనార్‌: పోస్టుమార్టం గురించి డీఎంఈకి సమాచారం అందించాను.

కమిషన్: ఇంక్వెస్ట్‌ను ఎవరి సమక్షంలో చేశారు.

సజ్జనార్‌: తెలంగాణలో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు ఇంక్వెస్ట్ చేస్తారు.

కమిషన్: ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో మీతో పాటు ఎంత మంది సీనియర్ అధికారులు ఉన్నారు?

కమిషన్: సీన రీ కన్స్ట్రక్షన్ కి వెళ్లేటప్పుడు పోలీసులతో ఆయుధాలు ఉన్నాయా?

కమిషన్: ఉన్నాయి.

కమిషన్: వెపన్స్ ఎందుకు అన్లాక్ చేశారు?

సజ్జనార్‌:  వెపన్స్ అన్లాక్ చేయలేదు.

కమిషన్: మీడియా సమావేశంలో వెపన్స్ అన్ లాక్ చేసినట్టు ఉంది?

కమిషన్: వెపన్స్ రికవరీ కాకుండా, పోస్ట్ మార్టం పూర్తి కాకుండా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు?

సజ్జనార్‌: డిసిపి శంషాబాద్ పెట్టమంటే ప్రెస్ మీట్ పెట్టాను.

కమిషన్: ఘటన జరిగిన సమయంలో ఎన్ని గంటలు స్పాట్‌లో ఉన్నారు?

సజ్జనార్‌: గంటన్నరపాటు ఉన్నాను.

కమిషన్: 2008 వరంగల్ ఎన్‌కౌంటర్, 2016 నక్సలైట్ల ఎన్‌కౌంటర్,  2019 దిశ కేస్ కౌంటర్ లలో ఒకటే రకమైన విధానం కనిపిస్తుంది. మీ హయంలోనే ఇలా జరిగింది.

సజ్జనార్‌: వరంగల్ ఎన్‌కౌంటర్ సమయంలో నేను ఎస్పీ గా ఉన్నాను, 2016 లో నేను లా అండ్ ఆర్డర్ లో లేను.

కమిషన్‌: మిమ్మల్ని ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్‌గా మీడియా అభివర్ణించింది. మీరు ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అని ఒప్పుకుంటారా?

సజ్జనార్‌: నేను అంగీకరించను.

కమిషన్‌: ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అంటే ఏమిటి?

సజ్జనార్‌: నాకు తెలియదు.

కమిషన్‌: మీరు ప్రతీది డీసీపీ చెప్తేనే తెలిసింది అంటున్నారు. డీసీపీపై నే ఆధారపడతారా?

సజ్జనార్‌: గ్రౌండ్ లెవెల్ లో ఆఫీసర్ లకు పూర్తి సమాచారం ఉంటుంది. వారికి నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తాను.

కమిషన్‌: దిశ ఘటన జరిగిన రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం చేశారు?

సజ్జనార్‌: మిస్సింగ్ కంప్లైంట్ రాగానే బాధితురాలి కోసం వెతకడంలో కొంత ఆలస్యమైంది.

కమిషన్‌: ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

సజ్జనార్‌: ఎఐఆర్‌ నమోదు చేయడంలో అలసత్వం వహించిన నలుగురు పోలీస్ సిబ్బంది పైన సస్పెన్షన్ విధించాం.

కమిషన్‌: ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో విచారణ ముగియకముందే మీడియా సమావేశం ఎలా పెట్టారు? అందుకే విచారణ సరిగా చేయలేకపోయారని సాక్షులు చెప్పారు.

సజ్జనార్‌: న్ కౌంటర్ స్పాట్ కి 300 మీటర్ల దూరంలో విచారణకు ఆటంకం కలగకుండా వీడియో సమావేశం ఏర్పాటు చేశాం.

కమిషన్‌: సమావేశం కోసం కుర్చీలు, టేబుల్లు తదితర సామగ్రిని అంత తక్కువ సమయంలో ఎక్కడి నుండి తెచ్చారు?

సజ్జనార్‌: షాద్ నగర్ పోలీసులు తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి సామాగ్రిని  తీసుకొచ్చారో నాకు తెలియదు. ఘటన జరిగి రెండేళ్లయింది. నాకు గుర్తు లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

ఎక్కువ చదివినవి

జనసేన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం ఈ ఛానల్ హ్యాక్ అయింది....

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...