Switch to English

మన ఆంధ్ర అద్భుతాలు ప్రపంచానికి – ‘డిస్కవర్ ఆంధ్ర’ గ్లింప్స్ లాంఛ్ సందడి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,203FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో రూపొందుతున్న ‘డిస్కవర్ ఆంధ్ర’ డాక్యుమెంటరీ టైటిల్, గ్లింప్స్ లాంఛ్ శనివారం ఘనంగా జరిగింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనుమతి, మార్గదర్శకతతో నిర్మాతలు పడాల సురేందర్ రెడ్డి, శ్రావ్య కూనం ఈ ప్రత్యేక ప్రాజెక్ట్‌ను తీసుకువస్తుండగా, నవదీప్ పల్లపొలి, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ సమర్పణలో శ్రీకాంత్ మన్నెపూరి ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఆంధ్రలో ఉన్న సహజ సంపద, అడవులు, జలపాతాలు, అపురూపమైన వైల్డ్ లైఫ్‌ను ప్రపంచానికి పరిచయం చేయబోతున్న ఈ ప్రాజెక్ట్‌పై సినీ ప్రముఖులు, ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ, ఆంధ్రలో ఇన్ని అద్భుతాలు మన కళ్లముందే ఉన్నా కూడా వాటిని గుర్తించలేకపోతున్నామని, వాటిని ఇంత అందంగా చూపించినందుకు శ్రీకాంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 2020లో పర్యావరణంపై తనకెక్కువగా ఆలోచనలు రావడంతో ‘గ్రీన్ పాస్’ అనే ఎన్జీవోను స్నేహితుడితో కలిసి ప్రారంభించిన విషయం గుర్తుచేశారు. బీచ్ క్లీన్‌అప్స్, కోస్టల్ జీవుల రక్షణ, పక్షుల సంరక్షణ కోసం చేస్తున్న పనులను వివరించారు. ‘రిపబ్లిక్’ సినిమాలోనూ పర్యావరణ పరిరక్షణపై సందేశం ఇచ్చినట్టు చెప్పి, ఇప్పుడు ‘డిస్కవర్ ఆంధ్ర’లో మన నేచర్, కల్చర్‌ను కాపాడుకోవాల్సిన అవసరాన్ని మరింత బలంగా చూపించినట్టు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు మణిశర్మ సంగీతం పెద్ద బలమైందన్నారు. మీడియా, ఆడియెన్స్ ఇలాంటి ప్రాజెక్ట్‌లకు మరింత సపోర్ట్ ఇవ్వాలంటూ అభిలషించారు.

నవదీప్ మాట్లాడుతూ, శ్రీకాంత్ 2014లో ప్రారంభించిన వైల్డ్ లైఫ్ జర్నీ తనను షాక్‌కు గురిచేసిందని, ఆంధ్రలో ఇంత అపురూపమైన వైల్డ్ లైఫ్ ఉందన్న విషయం డాక్యుమెంటరీ చూసే వరకు తెలుసుకోలేదని తెలిపారు. అడవిలో గడిపిన ప్రతి క్షణం తనను రీఫ్రెష్, రీసెట్ చేసినట్టు చెప్పారు. సమాజంలో మనం పక్క జీవుల్ని హింసిస్తూ బతికేస్తున్నాం కానీ ప్రకృతి మనకు ఇస్తున్న అద్భుతాల్ని మనమే పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఆంధ్ర వైల్డ్ లైఫ్‌ను ప్రపంచానికి చూపాలన్న శ్రీకాంత్ సంకల్పం తనను, సాయి దుర్గ తేజ్‌ను ఈ ప్రాజెక్ట్‌తో అనుసంధానించిందన్నారు. విజువల్స్ చూసిన తేజ్ వెంటనే స్పందించి పవన్ కళ్యాణ్‌ను కలిపి కావాల్సిన సహాయం అందేలా చేశారని తెలిపారు. 72 నిమిషాల నిడివితో రూపొందిన ఈ డాక్యుమెంటరీ చూసిన తర్వాత ప్రేక్షకులందరూ “మన రాష్ట్రంలో ఇన్ని అద్భుతాలున్నాయా?” అని ఆశ్చర్యపోతారని నవదీప్ నమ్మకంగా చెప్పారు.

దర్శకుడు శ్రీకాంత్ మన్నెపూరి మాట్లాడుతూ, గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక వైల్డ్ లైఫ్‌పై చేసిన రీసెర్చ్‌లో తన తెలుగు రాష్ట్రాల అద్భుతాలు అందరికీ తెలియకపోవడం బాధ కలిగించిందన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో వాలంటీర్‌గా పనిచేసిన తర్వాత ఆంధ్రలో ఉన్న అసలైన సహజసంపద తన కళ్లకు కనిపించిందని చెప్పారు. మన దగ్గరున్న వైవిధ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ‘డిస్కవర్ ఆంధ్ర’ ఆలోచన వచ్చిందన్నారు. వైల్డ్ లైఫ్ అంటే ఆంధ్ర గుర్తుకు రావాలని, ఈ డాక్యుమెంటరీ అందుకు మొదటి అడుగవుతుందని చెప్పారు. టైటిల్, గ్లింప్స్ తో అందర్నీ ఆకట్టుకున్నామని, త్వరలోనే ట్రైలర్‌తో మరింత మంత్రముగ్ధులను చేయబోతున్నామని తెలిపారు. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్, నవదీప్, సాయి దుర్గ తేజ్‌కి కృతజ్ఞతలు చెప్పారు. మణిశర్మ అందించిన సంగీతం ప్రాజెక్ట్‌కు కొత్త ప్రాణం పోసిందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సహజ అద్భుతాలు, అరుదైన జంతువులు, ప్రకృతి అందాలు ప్రపంచానికి చేరవేసే ‘డిస్కవర్ ఆంధ్ర’ కోసం ఇప్పుడు ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ డాక్యుమెంటరీ విడుదల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

సినిమా

ప్రేక్షకుల ప్రేమే మా అసలైన విజయం: ‘అనగనగా ఒక రాజు’ థాంక్యూ...

సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్లలో నవ్వుల పండగ సృష్టించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’ విజయోత్సాహంతో దూసుకుపోతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన...

మెగా 158లో చిరంజీవి సరసన ఐశ్వర్య రాయ్?

మెగాస్టార్ చిరంజీవి తాజా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా 158 సినిమాను పూర్తి...

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్.. యాక్షన్‌తో ఆకట్టుకుంటున్న ప్రభాస్ నిమ్మల కొత్త...

సంక్రాంతి పండుగ కానుకగా దర్శకుడు ప్రభాస్ నిమ్మల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం ఈరోజు (జనవరి 16) అధికారికంగా విడుదల...

సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’

సంక్రాంతి పండుగ సీజన్‌లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తోంది. విడుదలైన కేవలం నాలుగు...

CHIRANJEEVI: చిరంజీవి క్రేజ్, రేంజ్ ఏంటో చూస్తున్న ‘Gen Z’

CHIRANJEEVI: ‘నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా..., నువ్వో చిరంజీవి మరి.., చిరంజీవిలా ఆ ఫోజేంటేహే’.. ఇదీ 80, 90 దశకాల్లో చిరంజీవి హవా. చెప్పాలంటే రాజకీయాల్లోకి వెళ్లే...

రాజకీయం

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ సందడి: సాహిత్యానికి సత్కారం, క్రీడలకు ఉత్సాహం, చేనేతకు ప్రోత్సాహం

మంగళగిరి నియోజకవర్గంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ విస్తృతంగా సందడి చేశారు. సాహిత్య రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, క్రీడలను ఉత్సాహపరిచి, స్థానిక వ్యాపారాలకు...

“స్వగ్రామం నుంచి స్వర్ణాంధ్ర దిశగా: సమసమాజమే లక్ష్యం”: చంద్రబాబు

నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి దృక్పథం, పండుగల ప్రాధాన్యం, గ్రామీణ పునర్నిర్మాణం, ఆర్థిక అసమానతలపై తన ఆలోచనలను విస్తృతంగా వెల్లడించారు. గతంలో గ్రామాలకు వెళ్లడానికి...

నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు: కుటుంబంతో కలిసి పూజల్లో పాల్గొన్న నారా లోకేష్

మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నారావారిపల్లెలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో ఏర్పాటైన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొని...

వాటర్‌ పాలిటిక్స్‌లో రాజకీయ ఆరోపణలు.. ఏపీపై ప్రభావం?

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాజకీయాల్లో నీటి అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య సన్నిహిత రాజకీయ అవగాహన ఉందన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి...

పీపీపీపై కేంద్రం మరో లేఖ.. రాష్ట్ర వైద్య రంగానికి కీలక దిశానిర్దేశం

వైద్య సేవల డిమాండ్‌–లభ్యత మధ్య ఉన్న గ్యాప్‌ను పూరించేందుకు పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరోసారి స్పష్టమైన సూచనలు చేసింది. ఈ మేరకు...

ఎక్కువ చదివినవి

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్.. యాక్షన్‌తో ఆకట్టుకుంటున్న ప్రభాస్ నిమ్మల కొత్త సినిమా

సంక్రాంతి పండుగ కానుకగా దర్శకుడు ప్రభాస్ నిమ్మల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం ఈరోజు (జనవరి 16) అధికారికంగా విడుదల చేసింది. ‘సత్య గ్యాంగ్’, ‘ఫైటర్ శివ’...

మీడియా కథనాలపై కోమటిరెడ్డి భావోద్వేగం

ఒక టీవీ చానెల్‌లో తనపై, మహిళా ఐఏఎస్ అధికారిపై వచ్చిన కథనాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ప్రచారం తనను తీవ్రంగా...

Daily Horoscope: మేషం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది – తులలో కీలక నిర్ణయాలు

జనవరి 15, 2026 గురువారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ముందడుగు వేయగలుగుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఒక మంచి ఆలోచన...

Daily Horoscope: మేషంలో ఉద్యోగ అవకాశాలు, వృషభంలో ఆర్థిక లాభాలు

జనవరి 13, 2026 బుధవారం రాశిఫలాలు: మేషం (Aries): ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. పై అధికారుల సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో చిన్న విషయాలపై చర్చలు ఉండొచ్చు....

సోషల్ మీడియా షేక్ చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’: మెగాస్టార్ మ్యాజిక్ మళ్లీ రిపీట్

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్ షోల తర్వాత సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి పేరుతో మార్మోగిపోతోంది. X, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ప్లాట్‌ఫాంలలో సినిమా గురించి వస్తున్న...