రామ్ పొతినేని తన కొత్త సినిమాలో పెట్టిన శ్రద్ధ, శ్రమ, నిబద్ధత మాటల్లో చెప్పలేనిది. ఈ సినిమా కోసం ఆయన స్క్రిప్ట్ రూపకల్పనలో పాల్గొని, ఒక పాటకు లిరిక్స్ రాసి, అదే పాటను స్వయంగా పాడుతూ గాయకుడిగా మారి తన బహుముఖ ప్రతిభను చూపించారు. పారితోషికం తీసుకోకుండా ఏరియా రైట్స్ తీసుకోవడం ద్వారా చిత్రానికి ఉన్న నమ్మకాన్ని రామ్ మరోసారి నిరూపించారు. రిలీజ్‌కు ముందు, రిలీజ్ తర్వాత కూడా రాత్రింబవళ్లు ప్రమోషన్స్‌లో పాల్గొని ప్రతి వేదికపై తన సినిమా గురించి చెప్పి, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేశారు.
స్క్రీన్‌పై కూడా రామ్ తన శాయశక్తులా సత్తా చాటారు. భారీ మాస్ సీన్లలో ఎనర్జీతో అలరించగా, ఎమోషనల్ సన్నివేశాల్లో నటనతో కదిలించారు. అయితే ఇవన్నీ చేసినా సినిమా దగ్గరగా ఉన్న ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడం ఆయన అభిమానులతో పాటు సినీ వర్గాలను కూడా నిరాశపరిచింది. ఈసారి ప్రేక్షకుల వైపు నుండి నిజంగా పెద్దగా సహకారం దక్కలేదన్న భావన స్పష్టంగా కనిపిస్తోంది.
ఇప్పటికైనా రెండో వారాంతంలో కలెక్షన్లలో ఒక అద్భుతం జరగాలని టీమ్ ఆశిస్తోంది. రామ్ చేసిన కష్టానికి మంచి ఫలితం రావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
