Tollywood Directors: సినిమా మీద ఆసక్తితో, తమ టాలెంట్ మీద ఉన్న నమ్మకంతో దర్శకుడు కావాలని ఎందరో ఔత్సాహికులు ఇండస్ట్రీకి వెళ్తూంటారు. ఈక్రమంలో కొందరు దర్శకుల వద్ద సహాయ దర్శకులుగా కెరీర్ ప్రారంభిస్తారు. పలు సినిమాల్లో చిన్న చిన్న సన్నివేశాల్లో సైతం కనిపిస్తూంటారు. వారిలో కొందరు సక్సెల్ ఫుల్ దర్శకులుగా కెరీర్ కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వారిని ఇప్పుడున్న రూపంతో పోల్చి చూస్తే వీరేనా అనిపించక మానదు.
చిరంజీవి స్టాలిన్ లో గోపీచంద్ మలినేని, అందరివాడులో హరీశ్ శంకర్.., రానా లీడర్ లో నాగ్ అశ్విన్ ఓ సన్నివేశంలో బైక్ పై హీరోయిన్ ని టీజ్ చేస్తూ.. క్రికెట్ సన్నివేశంలో కనిపిస్తారు. వంశీ పైడిపల్లి ప్రభాస్ వర్షంలో బస్ సన్నివేశంలో.. సందీప్ రెడ్డి వంగా నాగార్జున కేడీ సినిమాలో.. శ్రీకాంత్ అడ్డాల అల్లు అర్జున్ ఆర్యలో.. అనిల్ రావిపూడి గోపీచంద్ శౌర్యంలో.. నాగార్జున హిందీ శివలో పూరి జగన్నాధ్.. కృష్ణవంశీ సిందూరంలో వర్షం డైరక్టర్ శోభన్ కనిపిస్తారు.
మన దర్శకులు Cameo ఇచ్చిన సీన్స్
Video Credits : @coffeeinchaicup pic.twitter.com/6OhTU6xpox
— Rajesh Manne (@rajeshmanne1) July 21, 2024