Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి త్వరలో దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించే సినిమాలో నటించనున్నారు. దీనికి సంబంధించి ఆయన పుట్టినరోజున అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కబోయే ఈ సినిమా భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కనుంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పుడీ సినిమాకు సంబంధించి దర్శకుడు వశిష్ఠ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని సంగతలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
‘చిరంజీవిగారు నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి ఫ్యాంటసీ మూవీ. అటువంటి కాన్సెప్ట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. నేటి జనరేషన్ చిన్న పిల్లలు చిరంజీవిని ఆ తరహాలో చూడాలన్నదే నా తపన. విక్రమ్, జైలర్ తరహాలో చిరంజీవి తన వయసుకు సరిపోయే పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్లు ఉన్నా రొమాన్స్ ఉండదు. సినిమా చాలా గ్రాండ్ స్కేల్లో తెరకెక్కిస్తున్నా’మని అన్నారు. దీంతో మెగాభిమానుల్లో ఉత్సాహం.. సినిమాపై అంచనాలు పెరిగాయి.
సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఓ హీరోయిన్ గా అనుష్కను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
Hey very nice blog!