Switch to English

ప్రభుత్వ విక్రయం: నెయ్యి ఇడ్లీ, గట్టి చట్నీ, చేపల పులుసు.!

‘చిత్ర నిర్మాణం కోసం హీరో హీరోయిన్లు మొదలుకుని, ఆఖరి వ్యక్తి వరకూ చెల్లించే మొత్తాన్ని నిర్మాత నుంచి ప్రభుత్వం జమ చేయించుకుని, ఆన్‌లైన్‌లో టిక్కెట్ల మాదిరిగా వారి బ్యాంకు ఖాతాలోకి వెళ్ళేలా చూస్తే బావుంటుంది.. దీని వల్ల దుబారా, ఎగవేతలు వుండవు. పారదర్శకత వుంటుంది..’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఓ ఉచిత సలహా పారేశారు రాజకీయ కురువృద్ధుడు, ప్రత్యక్ష రాజకీయాలకూ దూరంగా వుంటోన్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.

కాన్సెప్ట్ అదిరిపోయింది కదూ.! ఈ వ్యవహారంపై సినీ దర్శకుడు, నిర్మాత సాయి రాజేష్ తనదైన స్టయిల్లో స్పందించారు. ‘షూటింగులో పూర్ణ టిఫిన్స్ నెయ్యి ఇడ్లీ, గట్టి చట్నీ.. చౌదరి మెస్ చేపల పులుసు కూడా హీరోలు, దర్శకులు, నిర్మాతలకే తప్ప కిందవారికి అందడంలేదు. లైట్ మేన్ నుంచి అందరికీ అందేలా ప్రత్యేక అధికారిని ప్రభుత్వం నియమించాలని కూడా కోరుకుంటున్నాం..’ అంటూ సాయి రాజేష్ సెటైర్ వేశారు.

సినిమా అంటే ప్రభుత్వంలో వున్నవారికి, వారికి మద్దతిచ్చేవారికి ఎంత వెటకారం అయిపోయిందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? అసలు తెలుగు సినీ పరిశ్రమ ఎక్కడుంది.? హైద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. అలాంటప్పుడు, నటీనటుల రెమ్యునరేషన్ల గొడవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికెందుకు.?

తమిళ సినిమాకి చెందిన నటీనటుల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకు మంట లేదు.. బాలీవుడ్ నటీ నటుల మీద అధికార వైసీపీ నేతలకు పంచాయితీ లేదు.. తెలుగు సినిమా మీదనే ఎందుకీ మంట.? సినిమా కోసం పెట్టుబడి పెట్టే నిర్మాత, తన డబ్బుని తీసుకెళ్ళి ప్రభుత్వం చేతుల్లో పెట్టాలట. ప్రభుత్వమేమో, రెమ్యునరేషన్ల కింద పంపకాలు చేస్తుందట.

ముద్రగడ తెలివి ఎంత హీనంగా తయారైందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి. ముద్రగడ రాశారా.? లేదంటే, అధికార పార్టీ నేతలు రాసి, ముద్రగడతో ఆ లేఖ మీద సంతకం చేయించారా.? ఒక్కటి మాత్రం నిజం.. తెలుగు సినీ పరిశ్రమ, ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ సినిమాల ప్రదర్శన, మార్కెట్ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందేనేమో.

1 COMMENT

  1. అలాగే అధికార పార్టీ రిజర్వేషను కోటాలో 80 శాతం నటీనటులు, టెక్నీషియన్లను తెలుగు సినిమా లకు నియమించాలి. అధికార పార్టీ నేతల/సలహాదారుల అనుమతి మీదనే తెలుగు సినిమాలను డిస్ట్రిబ్యూటర్ లకు, ధియేటర్లకు ఇవ్వాలి. పూర్తి అయిన ప్రతి తెలుగు సినిమా ని సెన్సార్ బోర్డు కంటే ముందుగా అధికార పార్టీ నేతలకు/సలహాదారులకు చూపించి అనుమతులు తీసుకోవాలి. లేకుంటే ఆ సినిమాలు రాష్ట్రంలో ప్రదర్శించే హాక్కులు ఉండవు. ఈ షరతులు కేవలం తెలుగు సినిమా పరిశ్రమలోని కొందరు పెద్ద హీరోలు, దర్శకులు, నిర్మాతల సినిమాలకు మాత్రమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘మా’ బైలాస్ మారుస్తాం.. వారిద్దరి రాజీనామాలు ఆమోదించట్లేదు: మంచు విష్ణు

‘మా’ అసోసియేషన్ బైలాస్ ను మారుస్తామని.. నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించట్లేదని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం ఉదయం...

వచ్చే రెండేళ్లూ విష్ణుని నిద్రపోనివ్వను: ప్రకాశ్ రాజ్

‘మా’ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాశ్ రాజ్ ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మా’లో ఉన్న సమస్యలను పరిష్కరించాలనే నేను ఎన్నికల్లో...

రష్మిక నె.1, రౌడీస్టార్ నెం.1

సెలబ్రెటీలు అంటేనే ప్రభావితం చేసే వారు అనడంలో సందేహం లేదు. వారి మాటలు లేదా వారి ప్రవర్తన ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది. అందుకే వారితో...

అఖిల్ సక్సెస్ లో అల్లు అర్జున్ భాగం!

అఖిల్ అక్కినేని ఎప్పటినుండో ఎదురుచూస్తోన్న తొలి విజయం మొత్తానికి వచ్చేసింది. అఖిల్ మొదటి మూడు చిత్రాలు ప్లాప్ అవ్వడంతో నాలుగో సినిమా విజయం సాధించడానికి డెస్పెరేట్...

దీపావళికి ఆర్ ఆర్ ఆర్ మెరుపులు

అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి నుండి బాహుబలి తర్వాత వస్తోన్న ప్యాన్ ఇండియా చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఐదు భాషల్లో విడుదలవుతోన్న ఆర్...

రాజకీయం

‘మా’ లొల్లి అమెరికా కూడా వెళ్లొచ్చేయ్ ఓ పాలి..

ఎన్నికలు అయిపోయాయ్. ఇకపై మేమంతా ఒక్కటే.. అని ‘మా’ కొత్త అధ్యక్షడు మంచు విష్ణు చెప్పాడు. చెప్పాకా మాట మీద నిలబడాలా.? వద్దా.? ‘మా’ ప్యానెల్ నుంచి ఇకపై ఎవరూ మీడియా ముందుకొచ్చి...

‘మా’ యుద్ధం: ‘వేటు’ షురూ చేయనున్న మంచు విష్ణు.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నాడట తాజా అధ్యక్షుడు మంచు విష్ణు. ఈ విషయాన్ని మంచు విష్ణు తాజాగా వెల్లడించాడు. ఓ జర్నలిస్టు, డబ్బింగ్ సినిమాలు నిర్మించి, అందులో ఓ పాటలో...

కారుణ్య నియామకాలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం..!

కోవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 30 నాటికి అ ప్రక్రియ పూర్తి చేయాలని...

జనసేనానిపై ‘బులుగు-పచ్చ’ కుట్ర: ఆర్కే మార్కు పైత్యం.!

అధికార పీఠంపై రెండే రెండు సామాజిక వర్గాలకు అవకాశం వుండాలి. ఇంకెవరూ అటువైపు కన్నెత్తి చూడకూడదు. సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చెయ్యాలి.. నామినేటెడ్ పదవుల పేరుతో ఇతర సామాజిక...

టీడీపీలో కీలక చేరిక

ఏపీలో తెలుగు దేశం పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే ముఖ్య నాయకులు పలువురు పార్టీని వదిలేశారు. ఇప్పుడు మరి కొందరు ముఖ్య నాయకులు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి...

ఎక్కువ చదివినవి

భీమ్లా నాయక్ ను కలిసిన మంచు మనోజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్ డైరెక్ట్ గా మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు సపోర్ట్ చేసాడు. తనకు ప్రకాష్ రాజ్ కు మధ్య విబేధాలున్నా కానీ నేను తనను...

కింగ్ మేకర్ నరేష్.. కామెడీకి పరాకాష్ట….!

సీనియర్ నటుడు నరేష్ తనను తాను కింగ్ మేకర్.. అని చెప్పుకుంటున్నారు. ‘నేనే రథ సారధిని.. నేనే మంచు విష్ణుని గెలిపించాను.. కొందరి అహంకారాన్ని దెబ్బకొట్టాం.. గెలిచి చూపించాం..’ అంటూ నరేష్ తన...

పవన్ కల్యాణ్ తో శేఖర్ కమ్ముల పొలిటికల్ మూవీ..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – సెన్సిబుల్ డైరక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా తెరకెక్కబోతోందా..? అంటే.. టీటౌన్ లో ప్రస్తుతం ఈ గాసిప్ బాగా వైరల్ అవుతోంది. రానాను హీరోగా తెరకెక్కించిన...

యాదాద్రీశుడిని దర్శించుకున్న దర్శకుడు రాఘవేంద్రరావు..!

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ స్టార్ దర్శకుడు రాఘవేంద్రరావు తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. విజయదశమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో రాఘవేంద్రరావు ఉదయం స్వామివారిని...

మోహన్‌బాబు ముక్కుసూటితనం.. ఇంతేనా.?

సినీ నటుడు మోహన్‌బాబు, ‘మా’ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, తన కుమారుడ్ని బరిలోకి దింపారు. కులం, మతం, ప్రాంతం.. ఇలా ఒకటేమిటి.? అన్ని కోణాల్నీ ‘మా’ ఎన్నికల కోసం మంచు విష్ణు...