క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్ లు బాక్సఫీస్ వద్ద నిరాశ పరచడం తో కొంత సమయాన్ని తీసుకొని ప్రస్తుతం హిందీ లో సినిమా చేయాలన్నా ఆలోచనలో ఉన్నాడు . క్రిష్ ఇంతకముందు హిందీ లో అక్షయ్ కుమార్ తో గబ్బర్ అనే సినిమా తీసి మంచి విజయాన్ని దక్కిచుకున్నాడు , తరువాత కంగనా తో తీసిన మణికర్ణిక చిత్ర షూటింగ్ సమయం లో కంగనా తో విబేధాలు రావడం తో ఆ సినిమా మధ్యలో నుండి తప్పుకున్నాడు .
బాలకృష్ణ తో తీసిన ఎన్టీఆర్ సినిమా తరువాత క్రిష్ తన తదుపరి సినిమా తెలుగు లో చేస్తాడని అందరు అనుకున్నారు , కానీ క్రిష్ ఇటీవల అక్షయ్ కుమార్ ని కలిసి స్క్రిప్ట్ వినిపించాడట . అక్షయ్ కి కూడా కథ నచ్చినట్లు తెలుస్తుంది ఒకవేళ అన్ని కుదిరితే త్వరలోనే అక్కి తో క్రిష్ సినిమా ఉండబోతుంది …