టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్స్ లో క్రిష్ ఒకరు. ఆయన తీసే సినిమాలు రొటీన్ కు చాలా భిన్నంగా ఉంటాయి. అందుకే ఆయన తీసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. కానీ ఆయనకు ఇప్పుడు కాలం పెద్దగా కలిసి రావట్లేదు. కొత్తగా వస్తున్న దర్శకులు దూసుకుపోతుంటే.. ఆయన మాత్రం సినిమాల విషయంలో వెనక బడ్డారు. ఇటు కెరీర్ పరంగానే కాకుండా అటు వ్యక్తిగత జీవితంలో కూడా ఇబ్బందులు పడుతున్నారు క్రిష్. ఆయన గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయితో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు.
అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నారు. ఆయన గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒక డాక్టర్. ఇక ఆమెతో విడాకుల తర్వాత క్రిష్ మరొకరిని పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరిగినా అప్పట్లో వాటిని ఆయన పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు రెండో వివాహానికి ఆయన రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆమె హైదరాబాద్ కు చెందిన ఓ డాక్టర్ అని తెలుస్తోంది. క్రిష్ పెళ్లి చేసుకోబోయే ఆమెకు ఇప్పటికే పెళ్లి అయి విడాకులు కూడా అయ్యాయని.. ఓ 11 ఏళ్ల కొడుకు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి కుటుంబాలు ఇప్పటికే పెళ్లికి ఇరువురిని ఒప్పించినట్టు తెలుస్తోంది.
త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. క్రిష్ ప్రస్తుతం అనుష్కతో ఘాటీ సినిమాను తీస్తున్నాడు. గతంలో పవన్ తో హరిహర వీరమల్లు సినిమాను ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా పూర్తి కాలేదు. దాని షూటింగ్ కూడా ఆగిపోయింది.