Switch to English

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ‘శవ పుత్రుడు’: న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర

మళ్ళీ మళ్ళీ అదే పాత సామెతను ప్రస్తావించుకోవాల్సి వస్తోంది. ఏం చేస్తాం, పరిస్థితులు అలా తగలడ్డాయ్.! తమలపాకుతో సుతిమెత్తగా నువ్వొకటిస్తే, తలుపు చెక్కతో బుర్ర బద్దలయ్యేలా నేనొకటిస్తా.. అన్నట్టు తయారైంది పరిస్థితి.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పదే పదే ‘సీబీఎన్ దత్త పుత్రుడు..’ అంటూ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ‘రెండు చోట్లా ఓడిపోయిన దత్త పుత్రుడు..’ అనీ, ఇంకోటనీ.. పవన్ కళ్యాణ్‌ని ఎగతాళి చేయడమే రాజకీయంగా తన లక్ష్యం.. అన్నట్టు వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అక్కర్లేదు.. రాజధాని అసలే అవసరం లేదు.. అభివృద్ధి ఊసే లేదు. కానీ, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం ద్వారా ‘తుత్తి’ పొందాలి. ఇదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవిత లక్ష్యమనే విమర్శలు జనసేన పార్టీ నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి.

గత కొద్దిరోజులుగా వైఎస్ జగన్ ఇంతలా ‘దత్తపుత్రుడు’ అని చెలరేగిపోయి విమర్శలు చేస్తున్నారంటే, ఆ పవన్ కళ్యాణ్‌ని చూసి ఆయనెంతలా భయపడుతున్నారో అర్థమవుతోందని జనసేన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆ పవన్ కళ్యాణ్ కొట్టబోయే రాజకీయ దెబ్బ నుంచి తనను రక్షించమని ప్రజల్ని వైఎస్ జగన్ దేబిరించుకుంటున్నట్టుంది పరిస్థితి అని జనసేన నేత ఒకరు, తాజాగా ఓ ఛానల్ చర్చా కార్యాక్రమంలో చెప్పారు.

ఇదిలా వుంటే, పదే పదే దత్త పుత్రుడంటూ పవన్ కళ్యాణ్ మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న విమర్శలపై న్యాయవాది, ఒకప్పటి జనసేన నాయకుడు, పవన్ కళ్యాణ్ అభిమాని కళ్యాణ్ దిలీప్ సుంకర, యూ ట్యూబ్ వీడియో ద్వారా స్పందించారు.

తన తండ్రి పార్తీవ దేహాన్ని పక్కనే పెట్టుకుని రాజకీయాలు చేసిన ఘన చరిత్ర వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదనీ, ఆ సమయంలో వైఎస్ జగన్ కంట కన్నీరు కనిపించలేదనీ ఎద్దేవా చేశారు కళ్యాణ్ దిలీప్ సుంకర. ఆ పార్తీవ దేహం సాక్షిగా రాజకీయాలు చేసి, ‘ముఖ్యమంత్రి పదవి కోసం’ పాకులాడిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శవ పుత్రుడు అంటే తప్పెలా అవుతుందని కళ్యాణ్ దిలీప్ సుంకర ప్రశ్నించడం గమనార్హం.

ఇప్పుడీ ‘శవ పుత్రుడు’ అంశం సోషల్ మీడియాలో ట్రెండిగ్ అయి కూర్చుంది. జనసేనకు చెందిన బొలిశెట్టి సత్యనారాయణేమో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిన బెయిల్ రెడ్డి.. జైలు రెడ్డి.. అంటున్నారాయె.! దత్త పుత్రుడనే కామెంట్ కంటే, దారుణమైన కామెంట్లు కదా ఇవి.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

క్రైమ్, సస్పెన్స్, రొమాన్స్, కామెడీతో.. ‘అం అః’ సినిమా..! ట్రైలర్ విడుదల

సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా శ్యామ్ మండల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అం అః'. (ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్లర్) ట్యాగ్‌లైన్‌. రంగ‌స్థలం మూవీ...

లైగర్ ‘పీకే’ పోస్టర్‌ తో పబ్లిసిటీ పీక్స్‌

డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాద్ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతుంది. షూటింగ్ ముగిసి నెలలు గడుస్తోంది....

పుష్ప 2 ఫైనల్ వర్షన్‌ ఇంకా రెడీ అవ్వలేదట

అల్లు అర్జున్‌.. సుకుమార్‌ ల కాంబోలో గత ఏడాది చివర్లో వచ్చిన పుష్ప సినిమా సెన్షేషనల్ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతటి ఘన విజయాన్ని సొంతం...

దిల్ రాజు ప్లాన్ తో ఆ సినిమాల రిలీజ్ షెడ్యూల్స్ గందరగోళం

టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ కమ్‌ డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌ రాజు సినిమా ల రిలీజ్ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన థాంక్యూ సినిమా...

మేజర్‌ కు అక్కడ కూడా బ్రహ్మరథం

అడవి శేష్‌ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన మేజర్‌ సినిమా విడుదల అయిన ప్రతి చోట కూడా పాజిటివ్‌ రెస్పాన్స్ ను దక్కించుకుంది....

రాజకీయం

మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నల్ల బెలూన్లతో నిరసన..! పలువురి అరెస్టు

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు....

‘వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే..’ అల్లూరి జయంతి వేడుకల్లో కేటీఆర్

వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై...

ఫాఫం రఘురామ.! చేసుకున్నోడికి చేసుకున్నంత.!

అంతన్నాడింతన్నాడే గంగరాజు.. అన్న పాట గుర్తుకొస్తోంది వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా పరిస్థితి చూస్తోంటే. కొండంత రాగం తీసి తుస్సుమనిపించేశారాయన. ఔను మరి, కోర్టుకెళ్ళారు.. ప్రత్యేక హెలికాప్టర్ అన్నారు.. చివరికి రైలులో పయనమైనా,...

యావత్ భారతావని తరపున అల్లూరికి పాదాభివందనం చేస్తున్నా: ప్రధాని మోదీ

భారతావని మన్యం వీరుడు, విప్లవ జ్యోతి, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ మనమంతా కలుసుకోవడం అదృష్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు...

అల్లూరి చుట్టూ రాజకీయం.! ఇదా ఆయనకిచ్చే గౌరవం.?

ఓ సినీ కవి, మహాత్మాగాంధీని ఉద్దేశిస్తూ.. ‘ఇలా నడి రోడ్డు మీదా.. కరెన్సీ నోటు మీదా.. మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ..’ అంటాడు. మహనీయుల్ని మనం ఎలా చూస్తున్నాం.? అన్న విషయమై...

ఎక్కువ చదివినవి

హైద్రాబాద్ వేదికగా నరేంద్ర మోడీ డబుల్ ఇంజిన్ నినాదం.!

అసలు డబుల్ ఇంజిన్ అంటే ఏంటి.? దాని వల్ల ప్రయోజనమేంటి.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. అయినాగానీ, డబుల్ ఇంజిన్.. అంటోంది కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే ప్రయోజనమనుకుంటే, మహారాష్ట్రలో...

వైసీపీ అంతర్గత కుమ్ములాటలు దేనికి సంకేతం.?

ఓ వైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘నా వెంట్రుక కూడా పీకలేరు..’ అంటూ విపక్షాలను ఉద్దేశించి వెకిలి వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్న వేళ, ఇంకో వైపు వైఎస్సార్సీపీ పునాదుల్ని...

చిత్తూరు వాళ్లకు ‘పుష్ప’ బంపర్ ఆఫర్‌

అల్లు అర్జున్‌ అభిమానులతో పాటు సినీ వర్గాల వారు మరియు మీడియా వారు అంతా కూడా ప్రస్తుతం పుష్ప 2 కోసం వెయిట్‌ చేస్తున్నారు. పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద షేక్ చేసిన...

పక్కా కమర్షియల్ రివ్యూ: కమర్షియల్ ఎంటర్టైనర్

ఎంతో కాలం నుండి హిట్ లేకుండా ఉన్న గోపీచంద్, విజయవంతమైన చిత్రాల దర్శకుడు మారుతితో జట్టుకట్టాడు. మంచి బజ్ తో ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది పక్కా కమర్షియల్. మరి ఈ సినిమా...

ల్యాప్‌టాప్ ఔట్.! ట్యాబ్ ఇన్.! జగనన్న ‘కోత’ల పథకం.!

ఒక్క రాజధాని వద్దు, మూడు రాజధానులు ముద్దు.. అన్నారు. ఒకటీ లేదు, మూడే లేదు. మొత్తంగా ఇప్పుడు అయోమయం.! అమ్మ ఒడి అన్నారు.. దాంట్లో భాగంగా కోరినవారికి ల్యాప్‌టాప్ అన్నారు. అదిప్పుడు మాయమై,...