యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా “దిల్ రూబా’. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సరెగమ నిర్మిస్తున్నారు. సామ్ సీఎస్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. వాలెంటైన్స్ డే ని పురస్కరించుకొని ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల కానుంది.
ప్రచారంలో భాగంగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. “అగ్గిపుల్లే అలా గీసినట్టు కోపంగా చూడకే కొట్టినట్టు” అంటూ సాగే లిరికల్ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. జితూ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ యూత్ ను ఆకట్టుకుంటోంది. సూపర్ హిట్ మూవీ ‘క” తర్వాత కిరణ్ అబ్బవరం చేస్తున్న సినిమా ఇదే.
ఆ సినిమాకి మ్యూజిక్ అందించిన సామ్ “దిల్ రూబా” కి కూడా సంగీతం అందిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి.