మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గేమ్ ఛేంజర్ పై అప్ డేట్స్ మొదలయ్యాయి. నిర్మాత దిల్ రాజు దీనిపై అప్పుడప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఊరిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి సోలో సినిమా వచ్చి చాలా రోజులు అవుతోంది. పైగా దర్శకుడు శంకర్ కావడంతో ఇంకాస్త క్యూరియాసిటీ పెరుగుతోంది. ఇప్పటి వరకు మూవీ నుంచి ఒక్క డైలాగ్ కూడా రిలీజ్ కాలేదు. వైలెన్స్ కన్నా సైలెన్స్ తోనే సెన్సేషనల్ గా మారిపోయింది ఈ మూవీ. ఇక తాజాగా ప్రొడ్యూసర్ దిల్ రాజు మూవీ టైటిల్ గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు.
ఆయన మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ టైటిల్ కోసం చాలా కష్టపడ్డాం. ఎందుకంటే ఇది పాన్ ఇండియా మూవీ. కాబట్టి అన్ని భాషల్లో ఈ టైటిల్ మనకు కావాలి. కొన్ని భాషల్లో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉంటారు. కాబట్టి అప్పుడు మనకు ప్రాబ్లమ్ అవుతుంది. గేమ్ ఛేంజ్ విషయంలో కూడా అదే జరిగింది. ఓ లాంగ్వేజ్ లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ వాళ్లతో మాట్లాడి మేం సెట్ చేసుకున్నాం. పైగా అన్ని భాషల వారికి ఇది కనెక్ట్ అయ్యేలా ఉండాలని ఈ టైటిల్ ఎంచుకున్నాం అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. రెండు రోజుల క్రితం ఈ కథ గురించి కూడా ఆయన చెప్పారు.
ఈ కథను శంకర్ పవన్ కల్యాణ్ కోసం రాసుకున్నాడని.. కానీ తానే ఈ కథను రామ్ చరణ్ తో తీయాలని కోరడంతో ఈ మూవీ పట్టాలెక్కిందని చెప్పుకొచ్చారు దిల్ రాజు. ఇక గేమ్ ఛేంజర్ సినిమా మీద రామ్ చరణ్ పాన్ ఇండియా ఆశలు ఉన్నాయి. మరి అవి నిలబడుతాయా లేదా అనేది చూడాలి. ఇప్పటికే శంకర్ నుంచి వచ్చిన భారతీయుడు-2 ఘోరంగా ప్లాప్ అయింది. దాంతో ఆ టెన్షన్ గేమ్ ఛేంజర్ మీద కూడా పడింది. మరి శంకర్ ప్లాప్ సెంటిమెంట్ రిపీట్ చేస్తాడా.. బ్రేక్ చేస్తాడా అనేది చూడాలి.
I blog quite often and I seriously thank you for your information. The article has truly peaked my interest.
I’m going to book mark your website and keep checking for
new information about once a week. I opted in for your RSS feed too.
My brother recommended I might like this web site.
He was totally right. This post truly made my day. You can not imagine simply how much time I had spent
for this information! Thanks!