పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్ల నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్రత్యేకమైన అనుబంధాన్ని కొనసాగించాడు. ఎక్కడికి వెళ్లినా వెంట త్రివిక్రమ్ ఉండేవాడు. చివరికి పవన్ పొలిటికల్ మీటింగ్స్ కు చాలా మటుకు స్పీచ్ లు త్రివిక్రమ్ రాసేవాడని బలంగా పుకార్లు వచ్చాయి. ఇండస్ట్రీలో ఎవరైనా కూడా పవన్ ను అప్రోచ్ అవ్వాలంటే త్రివిక్రమ్ ఒక్కడే మార్గంగా ఉండేవాడు. దాంతో మిగతా దర్శకులకు పవన్ దూరమయ్యాడు. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన బిజీలో తను ఉండడం, పవన్ రీ ఎంట్రీ తర్వాత మిగతా సినిమా వాళ్లతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుండడంతో నెమ్మదిగా త్రివిక్రమ్ దూరం అవుతున్నాడని అంటున్నారు.
అయితే దీని వెనుక దిల్ రాజు హస్తం కూడా ఉందట. త్రివిక్రమ్ శ్రీనివాస్ ద్వారానే పవన్ ను కలిసి పింక్ రీమేక్ కు ఒప్పించిన దిల్ రాజు ఇప్పుడు పవన్ తో కలిసి ఎక్కువగా కనిపిస్తున్నాడని అంటున్నారు. దిల్ రాజు అవకాశం ఇస్తే హీరోలతో అల్లుకుపోవడంలో ముందుంటాడు. ఎవరితోనూ పెద్దగా క్లోజ్ అవ్వని మహేష్ నే దిల్ రాజు పడేసాడు. వరసగా తనతో సినిమాలు చేసేలా ఒప్పించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దిల్ రాజుకు ఫిదా అయినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పింక్ రీమేక్ చేస్తోన్న పవన్, దిల్ రాజుకు మరో సినిమా కూడా చేస్తానని మాట ఇచ్చాడట. ఇప్పుడు పవన్ ను అప్రోచ్ అవ్వాలంటే దిల్ రాజు బెస్ట్ మార్గం అని ఇండస్ట్రీలో కూడా మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గా భీష్మ టీమ్ ను పవన్ కు కలిపించాడు దిల్ రాజు. అలా పవన్ కు క్లోజ్ గా వ్యవహరిస్తూ కీలకమైన సలహాలు కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది.
544720 439975There is noticeably lots of money to comprehend about this. I assume youve created certain good points in attributes also. 70838
944868 144898Merely wanna input that you have a quite good website , I enjoy the pattern it really stands out. 301956
464030 173863Seriously really very good contribution, I actually depend on up-dates of your stuff. 4302