Dil Raju: ‘తెలంగాణ సంస్కృతిని హేళన చేయడం నా ఉద్దేశం కాదు. తెలంగాణ వాసిగా రాష్ట్ర సంస్కృతిని ఎలా హేళన చేస్తానని భావించారో అర్ధం కావట్లేదు. నా మాటలు కించపరచినట్టు ఉన్నాయని అనుకుంటున్న వారికి క్షమాపణలు చెప్తున్నాన’ని నిర్మాత దిల్ రాజు అన్నారు. ఈమేరకు ఓ వీడియో విడుదల చేశారు.
‘నిజామాబాద్ వాసిగా సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేయాలని భావించాం. అప్పట్లో ఫిదా విజయోత్సవం వేడుక చేశాం. ఇక్కడ ఎక్కువా సినిమా ఈవెంట్లు జరగవు కాబట్టి చేశాం. ఈ ప్రాంత అనుబంధంతో మొన్నటి ఈవెంట్లో తెలంగాణ సంస్కృతిలో ఉండే దావత్, మటన్, తెల్ల కల్లు గురించి మాట్టాడాను. కానీ.. అవి తెలంగాణను అవమానించినట్టుగా సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి’.
‘ఈ సంక్రాంతికి నా నుంచి రెండు సినిమాలు వస్తున్నాయి. తెలంగాణ దావత్ మిస్సవుతున్నా. రెండు సినిమాలు విజయవంతమయ్యాక దావత్ చేసుకోవాలనుందనే మాట మాట్లాడా’నని చెప్పడం నా ఉద్దేశం. అంతేతప్ప రాష్ట్ర సంస్కృతిని కించపరచడం నా ఉద్దేశం కాద’ని ఓ వీడియో సందేశం విడుదల చేశారు.