టీటీడీ పాలకవర్గం, అధికారుల మధ్య ఏం జరుగుతోంది?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,439FansLike
57,764FollowersFollow

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతోంది?. పాలకవర్గానికి అధికారులకు మధ్య సమన్వయం ఎందుకు లోపించింది?. సాక్షాత్తు సీఎం ఎదుటే టీటీడీ చైర్మన్, ఈవో పరస్పరం వాదులాటకు దిగేంత పరిస్థితి ఎందుకొచ్చింది?. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారిద్దరిపై అసహనం వ్యక్తం చేసే పరిస్థితి ఎందుకు తలెత్తింది? ఈనెల 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గురువారం తిరుపతికి వచ్చిన సీఎం చంద్రబాబు ఈ ఘటనపై ఆరా తీశారు. ఎక్కడ తప్పు జరిగిందనే అంశంపై విశ్లేషించారు. ఇందులో భాగంగా టీటీడీ పాలకవర్గం, ఈవో ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో చైర్మన్ ఈవో ఇద్దరూ సంయమనం కోల్పోయారు. సీఎం ఎదుటే వాదులాటకు దిగారు.

చైర్మన్ గా వచ్చినప్పటి నుంచి తనను చిన్నచూపు చూస్తున్నారని, తనకేమీ చెప్పడం లేదని బీఆర్ నాయుడు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. చైర్మన్ కు చెప్పకుండా ఏమీ జరగడం లేదంటూ ఈవో శ్యామల రావు ఘాటుగా బదులిచ్చారు. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఏర్పాట్ల గురించి తనకేమీ చెప్పలేదని చైర్మన్ అన్నారు. దీనిపై స్పందించిన ఈవో.. శ్రీవాణి ట్రస్ట్ బోర్డ్ విషయంలో తమ జోక్యం లేకుండా చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరించారని సీఎం కి ఫిర్యాదు చేశారు. ఇలా ఇద్దరూ వాగ్వాదం చేసుకుంటుండగా సీఎం జోక్యం చేసుకొని వారిపై ఆగ్రహించారు. ఇద్దరూ సమన్వయంతో పనిచేయాల్సిందేనని ఆదేశించారు.

ఆధిపత్య ధోరణే కారణమా?

టీటీడీ లో ఎవరి ఆధిపత్యం వాళ్ళు చూపించుకోవాలన్న అత్యుత్సాహమే సమన్వయ లోపానికి కారణమైనట్లు తెలుస్తోంది. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లకు సంబంధించి 15 సార్లు సమావేశాలు జరిగాయి. ఇందులో ఈవో, చైర్మన్ కలిసి ఒకేసారి సమావేశంలో పాల్గొన్నారు. ఇకపోతే అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి నిర్ణయాలపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఈఓ, చైర్మన్ కాకుండా అంతా తానే అన్నట్లు వెంకయ్య చౌదరి వ్యవహార శైలి ఉందని టీటీడీ లో పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టీటీడీ ఉద్యోగుల విషయంలో ఆయన దురుసుగా ప్రవర్తిస్తున్నారని కొందరు అంటున్నారు. ప్రక్షాళన పేరుతో ఉద్యోగులను బదిలీ చేస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తన ఆదేశాలను పాటించని ఉద్యోగుల పై చర్యలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో చాలామంది ఉద్యోగులు సెలవు పై వెళ్ళిపోతున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పాలకవర్గం కూడా ఏర్పాటై ఉంటే వారికి అధికారులకు అంత గ్యాప్ ఉండేది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా

Gaddar Awards-2026: గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

Gaddar Awards-2026: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2025లో విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (తండేల్), ఉత్తమ నటిగా రష్మిక (ది...

Vijay: ‘జననాయగన్’కి గుడ్ న్యూస్.. వెంటాడుతున్న బ్యాడ్ న్యూస్..!

Vijay: తమిళ హీరో విజయ్ కు ఇటివల వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ‘జననాయగన్’ సినిమా విడుదల ఆగిపోవడం.. కరూర్ తొక్కిసలాట ఘటన, భార్య సంగీత విడాకుల...

Bala Krishna: మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

Bala Krishna: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్ రాబోతుందా..? ఇండస్ట్రీ నుంచి అవుననే సంకేతాలే వస్తున్నాయి. త్వరలోనే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్....

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు....

రాజకీయం

“భారత్ నాలెడ్జ్ ఎకానమీకి నాయకత్వం వహిస్తోంది” : రైసినా డైలాగ్‌లో చంద్రబాబు

ఢిల్లీ వేదికగా నిర్వహించిన ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్–2026 సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 2016 నుంచి కొనసాగుతున్న ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సులో తొలిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం...

పోలవరం పనులు ఎలా వెనక్కి వెళ్లాయి? కాగ్ నివేదికలో కీలక అంశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్ట్ పనులు గత కొన్ని సంవత్సరాల్లో ఎలా ఆలస్యానికి గురయ్యాయన్న అంశం మళ్లీ చర్చకు వచ్చింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో ప్రాజెక్ట్...

అందరూ కూటమి ఎమ్మెల్యేలే.! చంద్రబాబు స్వీట్ వార్నింగ్!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి, చంద్రబాబు వ్యాఖ్యల్ని సంచలన ప్రకటనగా చూడాల్సి వుంటుంది. అదీ, కూటమి...

లిక్కర్ స్కామ్‌లో భారీ చర్యలు.. రూ.441 కోట్ల ఆస్తులు అటాచ్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక చర్యలు చేపట్టింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002 కింద దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ, కేసిరెడ్డి...

పవన్ కళ్యాణ్: “వాళ్లది విధ్వంస పాలన.. మాది దూరదృష్టి పాలన”

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని...

ఎక్కువ చదివినవి

లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ వైభవంలో పాల్గొన్న లోకేష్ దంపతులు

మంగళగిరిలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు దేవస్థానం ఉత్సవ ప్రాంగణంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో...

ట్రైలర్‌తో ఆసక్తి పెంచిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’

ఒకప్పుడు వరుస విజయాలతో ప్రేక్షకులను అలరించిన శివాజీ–లయ జంట మళ్లీ కలిసి నటించిన తాజా చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ప్రచార దృశ్యాలు విడుదలయ్యాయి. గతంలో ‘మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా...

విరోష్ సేవా సందేశం: దేశవ్యాప్తంగా దేవాలయాల్లో అన్నదానం, స్వీట్స్ పంపిణీ

వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భంగా దేశ ప్రజల ఆశీస్సులకు కృతజ్ఞతగా విరోష్ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ మరియు ప్రముఖ నటి రష్మిక  మందన్న జంట తమ వివాహం...

పయ్యావుల ప్రశ్నలతో మండలిలో బొత్సకు ఇబ్బంది

అమరావతి: రాష్ట్ర బడ్జెట్‌పై శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వైసీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర, రాష్ట్ర...

హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభం: మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య సంఘర్షణను తగ్గించడమే లక్ష్యం – పవన్ కళ్యాణ్

మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య పెరుగుతున్న సంఘర్షణలను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘హనుమాన్’ పేరుతో ప్రత్యేక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,...