‘ఒట్టు.! నిజం.! నన్ను కొట్టలే.!’ అంటాడో సినిమాలో కామెడీ విలన్. అప్పట్లో ఆ డైలాగ్ పెను సంచలనం.! అలాంటి సీన్ నిజంగానే జరిగిందా.? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గరంగరంగా ప్రారంభమయ్యాయి.
చట్ట సభలంటే, అవేవో ప్రజల్ని ఉద్ధరించడానికన్న భ్రమల్లేవిప్పడు.! విషయం సుస్పష్టం. రాజకీయ నాయకులు కొట్టుకోడానికీ, తిట్టుకోడానికీ మాత్రమే అన్నట్లు తయారైంది పరిస్థితి. తప్పదు గనుక, చట్టాలు చేశామనిపించుకోవాలి గనుక.. వాటిని కూడా ‘మమ’ అనిపిస్తారు, కొంత సమయం తీసుకుని.
మిగతా సమయమంతా, తిట్టుకోవడమే.. బజారుకెక్కిన చందాన అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించడమే అయిపోయింది చట్ట సభల్లోని సభ్యులకి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ.. మాటల యుద్ధం నడిచింది. అసలు సభ ఎక్కడ నడిచింది గనుక.?
చంద్రబాబు అక్రమ అరెస్టు.. అంటూ టీడీపీ గుస్సా అయ్యింది. వైసీపీ, కౌంటర్ ఎటాక్ మాటలతో కాకుండా, భౌతికంగా ఇచ్చేందుకు ప్రయత్నించిందన్నది టీడీపీ ఆరోపణ. సభలో ఏం జరిగిందో తెలియదుగానీ, మంత్రి అంబటి రాంబాబుని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొట్టారన్న పుకారు అయితే పుట్టింది.
‘సినిమాల్లోకెళ్ళి మీసాలు మెలేసుకో..’ అంటూ నందమూరి బాలకృష్ణని ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించడంతో విషయం ముదిరి పాకాన పడిందట. ‘నా వృత్తిని అవమానించాడు. నేనూ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చాను..’ అంటూ బాలకృష్ణ ఆ తర్వాత మీడియా సమావేశంలో చెప్పడం గమనార్హం.
మామూలుగానే బాలయ్యకి షార్ట్ టెంపర్ ఎక్కువ.! అభిమానులే దబిడి దిబిడి అయిపోతుంటారు. అలాంటిది, ఫాఫం.. అంబటి.! తన్నులు తినే వుంటారా.? అన్న డౌటానుమానాలు రాకుండా వుంటాయా.?
ఛ..ఛ.. అలా ఎలా జరుగుతుంది.? అసెంబ్లీలో అధికార పార్టీకే బలమెక్కువ.. కొడితే, వీళ్ళే కొట్టి వుండాలి బాలయ్యని.. అనేవారూ లేకపోలేదు. కొట్టుకోవడం అయితే నిజమేనా.? అన్న చర్చ జనబాహుళ్యంలోనూ జరుగుతోంది. ఆ వీడియోలేవో రిలీజ్ చేసేస్తే, అసలు విషయం స్పష్టమవుతుంది. కానీ, రావు.! వైసీపీకి కావాల్సిన విధంగా మాత్రమే ఎడిట్ చేసి వదులుతారు రేపో మాపో.!
Appreciafing thee commitment you put iinto your site annd
in ddepth informaztion you present. It’s grdat to come
across a blog every nce inn a whioe thst isn’t tthe same oldd rehashed information. Excellent read!
I’ve bookmarked yoiur sitee and I’m includjng youhr RSS feeds to
my Golgle account.