కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,072FansLike
57,764FollowersFollow

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు. సిట్ వెల్లడించిన వివరాల ప్రకారం విజయవాడకు సుమారు 12.5 కోట్ల రూపాయలు, చెన్నైకు 7.5 కోట్ల రూపాయలు చేరినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగి నిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు.

పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసే కొందరి వ్యాఖ్యలను కూడా ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్‌పై నోరు పారేసుకునే ‘బందరు బియ్యపు దొంగలు’  నీతులు చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ‘బందరు ఊసరవెల్లి’ చెప్పిన  వెంటనే తాను రాత్రికి రాత్రే వైష్ణవి డెయిరీ గేట్లకు రంగులు వేసానని చెప్పడం కూడా అసత్యమని పేర్కొన్నారు. వెబ్‌సైట్లు డౌన్ చేయడం, మార్ఫింగ్ చేయడం వంటి చర్యలు వైసిపి రాజకీయాల్లో కనిపించే ఫేక్ విధానాలని విమర్శించారు.

రాజధాని అంశంలో గతంలో చేసిన ఆరోపణల సమయంలోనే ఏమీ చేయలేరని చెప్పానని, ఇప్పటికీ అదే చెబుతున్నానని ధూళిపాళ్ల అన్నారు. గతంలో తనను 33 రోజుల పాటు జైలులో ఉంచి సంగం డెయిరీ సర్వర్లను హ్యాక్ చేయాలని ప్రయత్నించారని చెప్పారు. అయితే అణువణువూ పరిశీలించినా ఎలాంటి తప్పు బయటపడలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, వైసిపి ప్రభుత్వాల కాలంలో కూడా తాను ఎప్పుడూ భయపడలేదని అన్నారు.

వైసిపి అధికారంలో ఉన్న సమయంలో సాక్షి పత్రిక, సాక్షి ఛానల్‌కు సుమారు 307 కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చారని ఆరోపించారు. అలాగే భారతీ సిమెంట్స్ నుంచి కాంట్రాక్టర్ల ద్వారా మూడు లక్షల టన్నులకుపైగా సిమెంట్ కొనుగోలు చేశారని అన్నారు. వైసిపి ప్రభుత్వం తనపై పెట్టిన 22 కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, ప్రభుత్వం సహకరిస్తే ఆ తప్పుడు కేసులను ఎత్తివేయాలి కదా, అని  ప్రశ్నించారు.

వైష్ణవి డెయిరీ పక్కన సంగం డెయిరీ ఎంబ్లమ్ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే తనపై కుట్ర చేసి కేసులు పెట్టించిన మాజీ చైర్మన్‌ను అడగాలని ధూళిపాళ్ల పేర్కొన్నారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత వైష్ణవి డెయిరీ కార్యకలాపాలను నిలిపివేశానని చెప్పారు.

తిరుపతి లడ్డూ కల్తీ అంశం నిజమని, నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ మరియు జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB నివేదికలో వెల్లడైందని తెలిపారు. ఈ విషయంలో బాధ్యులైన వారు ఇప్పటికైనా దేవుడి ముందు వెళ్లి తప్పు ఒప్పుకోవాలని సూచించారు. మార్కెట్లో వెన్న ధర సుమారు 360 రూపాయలు ఉంటే 316 రూపాయలకు నెయ్యి ఎలా సరఫరా చేశారని ఆయన ప్రశ్నించారు. పాలు, వెన్న లేకుండా నెయ్యి తయారు చేసినవారు వైసిపి నాయకులేనని విమర్శించారు.

సంగం డెయిరీ 2020, 2021 సంవత్సరాల్లో కూడా టీటీడీ నెయ్యి టెండర్‌లో పాల్గొన్నట్లు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా తిరుమలలో సేవ చేసే అవకాశం కోసం సంగం డెయిరీ ఎదురుచూస్తోందని చెప్పారు. అన్ని నిబంధనలు, సాంకేతిక పరీక్షలు పూర్తి అయిన తర్వాతే సంగం డెయిరీ టెండర్‌లో పాల్గొని నెయ్యి సరఫరా చేస్తుందని స్పష్టం చేశారు. హెరిటేజ్ డెయిరీ మాత్రం టీటీడీకి ఒక్క నెయ్యి కూడా సరఫరా చేయలేదని పేర్కొన్నారు.

సంగం డెయిరీ గుంటూరు రైతుల సంస్థ అని, శ్రీజ డెయిరీ చిత్తూరు మహిళలతో నడుస్తున్న సంస్థ అని ధూళిపాళ్ల తెలిపారు. వైసిపి చేసిన తప్పును దాచేందుకు ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని దగ్గర తప్పు చేసినవారు తప్పించుకోలేరని హెచ్చరించారు.

దక్షిణ భారతదేశంలో అమూల్ తర్వాత నాణ్యమైన పాల ఉత్పత్తులు అందించగల సంస్థ సంగం డెయిరీనే అని ఆయన సవాల్ విసిరారు. రైతుల ఆధారంగా నడుస్తున్న ఈ సంస్థపై తప్పుడు ఆరోపణలు చేయడం సరైంది కాదని అన్నారు.

సినిమా

“ఫస్ట్ హాఫ్ లాక్… అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌కు సూపర్ స్టార్ట్!”

దర్శకుడు Anil Ravipudi తన తదుపరి సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్‌ను పూర్తిగా లాక్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కథనం దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్...

“టీజర్ లేదు… ‘డ్రాగన్’ ఫస్ట్ లుక్ ప్లాన్ ఫిక్స్!”

N. T. Rama Rao Jr. నటిస్తున్న డ్రాగన్ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మే 20న...

రొటీన్ కాదట… ‘పెద్ది’ క్లైమాక్స్ షాక్ ఇవ్వనుందా?”

పెద్ది సినిమా గురించి వస్తున్న తాజా అప్‌డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. దర్శకుడు Buchi Babu Sana ఈ చిత్రానికి సాధారణ కమర్షియల్ ముగింపుకంటే...

Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి....

“మంగ్లీ కేసు ట్విస్ట్… ఆరోపణలకు కౌంటర్ స్టేట్‌మెంట్!”

హైదరాబాద్‌లో ప్రముఖ గాయని Mangli చుట్టూ కొనసాగుతున్న వివాదం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఆమె Panjagutta Police Station ను ఆశ్రయించి సింగపోగు సుబ్బు అనే...

రాజకీయం

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

ఎక్కువ చదివినవి

“డెకాయిట్ ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్… అందులో డౌట్ లేదు”: వెంకటేష్

పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న అడివి శేష్ ఇప్పుడు ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. యాక్షన్, ప్రేమ, భావోద్వేగాలను కలగలిపిన ఈ థ్రిల్లర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి....

చెన్నకేశవరెడ్డి గెటప్‌లో కిరణ్ అబ్బవరం.. మాస్ పల్స్ బాగానే పట్టాడుగా!

తిమ్మరాజుపల్లి టీవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం చేసిన ఎంట్రీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి  గెటప్‌లో ఆయన కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని...

పన్నెండేళ్ళ ఎదురు చూపులకు శుభం కార్డు: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి.!

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది 2014లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని వుందో, లేదో తెలియని దుస్థితి. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ గతంలో, అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ,...

“ఫస్ట్ హాఫ్ లాక్… అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌కు సూపర్ స్టార్ట్!”

దర్శకుడు Anil Ravipudi తన తదుపరి సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్‌ను పూర్తిగా లాక్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కథనం దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఫస్ట్...

యువతకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ మెసేజ్

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఇప్పుడు విస్తృత చర్చకు దారి తీసింది. ముఖ్యంగా...