Switch to English

ధనుష్ ‘జగమే తంత్రం’ మూవీ రివ్యూ

Critic Rating
( 2.25 )
User Rating
( 3.00 )

No votes so far! Be the first to rate this post.

Movie జగమే తంత్రం
Star Cast ధనుష్, ఐశ్వర్య లేక్ష్మి, జేమ్స్ కాస్మో, జోజు జార్జ్
Director కార్తీక్ సుబ్బరాజ్
Producer ఎస్. శశి కాంత్
Music సంతోష్ నారాయణ్
Run Time 2 గంటల 38 నిమిషాలు
Release జూన్ 16, 2021

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా, ‘పిజ్జా’, ‘పేట’ సినిమాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘జగమే తందిరం’. ఈ సినిమాని తెలుగులో ‘జగమే తంత్రం‘గా డబ్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా థియేటర్స్ ని స్కిప్ చేసి, టాప్ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజయింది. ఇంటర్నేషనల్ గా 17 భాషల్లో రిలీజైన మరి ఈ జగమే తంత్రం ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

లండన్ లో రిచ్ అండ్ టాప్ గ్యాంగ్ స్టర్ పీటర్(జేమ్స్ కాస్మో).. తమిళనాడు నుంచి వచ్చి లండన్ లో సెటిల్ అయిన శివదాస్(జోజు జార్జ్) పీటర్ కి పోటీగా గ్యాంగ్ స్టర్ గా ఎదుగుతాడు. శివదాస్ గ్యాంగ్ పీటర్ కజిన్ ని చంపేస్తారు. దాంతో పీటర్ శివదాస్ ని లేపేయాలనుకుంటాడు. అందుకోసం మధురై లో తెలివైన డాన్ సురులి(ధనుష్) గురించి తెలిసి, డబ్బులిచ్చి లండన్ కి రప్పిస్తారు. అనుకున్నట్టే సురులి సాయంతో పీటర్ శివదాస్ బిజినెస్ ని దెబ్బ కొట్టడమే కాకుండా చంపేస్తాడు. ఆ తర్వాత సురులి పై జరిగిన ఓ మర్డర్ అటెంప్ట్ ద్వారా పీటర్ కి – కాళిదాస్ కి మధ్య ఉన్న వ్యత్యాసం సురులికి తెలుస్తుంది. అది తెలిసాక సురులి ఏం చేసాడు? పీటర్ – శివదాస్ కి మధ్య ఉన్నవి జస్ట్ గ్యాంగ్ వార్స్ మాత్రమేనా లేదా ఇంకేదైనా కారణం ఉందా? చివరికి లోకల్ డాన్ పీటర్ మీద సురులి గెలిచాడా? లేదా? అన్నదే కథ..

తెరమీద స్టార్స్..

ధనుష్.. ఇప్పటికే నేషనల్ వైడ్ తన నటనతో ప్రేక్షకులను సంపాదించుకున్న హీరో.. లోకల్ గ్యాంగ్ స్టర్ సురులి పాత్రలో అద్భుతమైన నటనని కనబరిచాడు. తెలుగు వారికి ధనుష్ నటన బాగా నచ్చుతుంది కానీ ఒరిజినల్ ఫ్లేవర్ తమిళ్ కాబట్టి వారికి ధనుష్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ మాడ్యులేషన్, నటన సూపర్బ్ అనిపిస్తుంది. ఇకపోతే హాలీవుడ్ యాక్టర్ జేమ్స్ కాస్మో నటనతో పాటు, తన ప్రెజన్స్ చూసే వారికి కొత్త ఫీల్ ని ఇస్తుంది. జోజు జార్జ్, ఐశ్వర్య లేక్ష్మి లు ఉన్నంతలో బాగా నటించారు. ఎమోషనల్ సీన్స్ లో ఐశ్వర్య చాలా బాగా చేసింది.

తెర వెనుక టాలెంట్..

శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ, సంతోష్ నారాయణ్ మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. కంప్లీట్ హాలీవుడ్ స్టైల్ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ ఫీల్ తీసుకురావడంలో శ్రేయాస్ కృష్ణ విజువల్స్ సూపర్బ్ అనిపిస్తే, సంతోష్ నారాయణ్ మ్యూజిక్ ఆడియన్స్ హై ఫీల్ మోమెంట్స్ ఇచ్చింది. వివేక్ హర్షన్ ఎడిటింగ్ కూడా బాగుంది. కానీ ఒక స్టేజ్ తర్వాత కథ ఇది ని కంప్లీట్ గా రివీల్ అయ్యాక మాత్రం మూవీ కాస్త స్లో అనిపిస్తుంది అక్కడ మాత్రం కాస్త ఎడిటర్ లాగ్ కట్ చేసి ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ వస్తుంది. ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది.

ఇక కెప్టెన్ ఆఫ్ ది షిప్ కార్తీక్ సుబ్బరాజ్ విషయానికి వస్తే.. ఇతని మేకింగ్ హాలీవుడ్ స్టైల్ లో ఉంటుంది. ఈ మూవీలోనూ అదే స్టైల్ ట్రై చేశారు. అలాగే ప్రథమార్థం అద్భుతంగా తీసుకెళ్లడం ఇతని స్పెషాలిటీ అయితే, సెకండాఫ్, ముఖ్యంగా క్లైమాక్స్ ని తేల్చేయడం ఇతని వీక్ నెస్. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. హీరో మొదటి భాగంలో చాలా తెలివైన వాడు కానీ సెకండాఫ్ కి వచ్చే సరికి అలా బిహేవ్ చేయడు. స్క్రీన్ ప్లే పరంగా సెకండాఫ్ లో కాసేపటికే ట్విస్ట్ రివీల్ చేసేసి, ఇక హీరో ఏం చేస్తాడు అనేది చెప్పాక సీన్స్ లో నెక్స్ట్ సీన్ ఎలా ఉంటుందా అనే సస్పెన్స్ ఉండాలి కానీ ఆ సప్సెన్స్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. డైరెక్టర్ గా పలు విభాగాల్లో ది బెస్ట్ అనిపించుకున్న చివరికి వచ్చేసరికి ఓకే అనిపించుకోగలిగే సినిమా ఇచ్చాడే తప్ప అదిరిపోయింది అనే రేంజ్ సినిమా అయితే ఇవ్వలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఫెంటాస్టిక్.

విజిల్ మోమెంట్స్:

– సురులిగా ధనుష్ సూపర్బ్ పెర్ఫార్మన్స్
– ఫస్ట్ హాఫ్
– ఎలివేషన్ సీన్స్
– మ్యూజిక్ అండ్ విజువల్స్

బోరింగ్ మోమెంట్స్:

– డ్రాప్ అయిపోయిన సెకండాఫ్
– వీక్ స్టోరీ
– నెమ్మదిగా సాగే కథనం
– వీక్ క్లైమాక్స్
– దిమ్మతిస్తే రన్ టైం

విశ్లేషణ:

‘జగమే తందిరం లేదా జగమే తంత్రం’ లో హైలైట్ గా నిలిచింది ధనుష్ నటన మాత్రమే.. సురులి పాత్రలో ధనుష్ సూపర్బ్ అనిపించుకున్నప్పటికీ, ధనుష్ ని డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ సరిగా ఉపయోగించుకోలేదు అనిపిస్తుంది. మేకింగ్ లో ఒక్కటే హాలీవుడ్ స్టైల్ లో ఉంటే సరిపోదు, కథ కూడా అదే స్టైల్ లో ఉండాలి లేదా స్క్రీన్ ప్లే అయినా కొత్తగా ఉండాలి. అవేమీ లేకపోవడంతో మొదటి అర్ధభాగం పరవాలేదనిపించినా రెండవ అర్ధభాగం బాబోయ్ అనిపిస్తుంది. ఫైనల్ గా ‘జగమే తంత్రం’ ధనుష్ డై హార్డ్ ఫాన్స్ కి కొంతవరకు నచ్చచ్చు..

చూడాలా? వద్దా?: ధనుష్ ఫాన్స్, స్టైలిష్ మేకింగ్ ఇష్టపడే వారికి ఓకే అనిపిస్తుంది, మిగతా వారికి నచ్చకపోవచ్చు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్: 2.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: తుఫాను హోరులో కలెక్షన్ల వర్షం కురిపించిన...

సినిమాల్లో రెగ్యులర్ గా చేసే మాస్, క్లాస్, ఫ్యామిలీ, లవ్, హార్రర్, యాక్షన్, భక్తి, సంగీతం.. సినిమాలకు భిన్నంగా కొత్త కాన్సెప్టులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీస్తే...

మహేశ్ బర్త్ డే స్పెషల్స్: మహేశ్-పూరి కాంబోలో టాలీవుడ్ గేమ్ చేంజర్...

బాల నటుడిగా నిరూపించుకున్న మహేశ్ బాబు పూర్తిస్థాయి హీరోగా ఫుల్ ఛార్మింగ్ లుక్, రొమాంటిక్, పాల బుగ్గల మేని ఛాయతో తెలుగు సినిమాకు గ్లామర్ తీసుకొచ్చారు....

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: స్లో డ్యాన్సులతో ట్రెండ్ సెట్ చేసిన...

ఎప్పుడైతే చిరంజీవి స్పీడ్ ఫైట్లు, బ్రేక్ డ్యాన్సులతో తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా వినోదం అందించారో ప్రేక్షకులు ఆయన ప్రతి సినిమాలో ఏదో కొత్తదనం ఆశిస్తూనే...

ఫ్యామిలీస్ థియేటర్ కి వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: కృతి శెట్టి

నితిన్ 'మాచర్ల నియోజకవర్గం ఆగస్టు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కృతిశెట్టి విలేఖరుల...

ఇదీ బాస్ అంటే.. ఇదీ వ్యక్తిత్వం అంటే.. అందుకే ఆయన మెగాస్టార్..

నిన్న బింబిసార సినిమా విడుదల అయ్యి హిట్ టాక్ వచ్చిన విషయం అందరికీ సంతోషం కలిగించింది.. కానీ ఎక్కడి నుంచి వస్తారో ఫాన్స్ పేరుతో కొందరు...

రాజకీయం

వైఎస్ జగన్ సమర్థతకి గోరంట్ల మాధవ్ సవాల్.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమర్థతకి హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్ విసిరారా.? ఈ చర్చ ఇప్పుడు వైసీపీ వర్గాల్లోనే జరుగుతోంది. కొన్నాళ్ళ...

ఏపీలో టీడీపీ పరిస్థితే తెలంగాణలో టీఆర్ఎస్‌కి వస్తుందా.?

2014 నుంచి 2018 వరకు టీడీపీ - బీజేపీ కలిసే వున్నాయ్. 2018 నుంచి కథ మొదలైంది. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు నినదించడం మొదలు పెట్టారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది....

గోరంట్ల మాధవ్‌ని వెనకేసుకొచ్చిన మంత్రి రోజా.!

అరరె.! ఎంత మాట అనేస్తిరి.? నేరం నిరూపితం కాకుండానే అనవసరమైన ఆరోపణలు చేయడమేంటి.? అంటూ మంత్రి రోజా ‘సుద్ద పూస కబుర్లు’ చెబుతున్నారు. ఏంటో, ఈ రాజకీయం.! ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, ప్రజారాజ్యం...

మోడీ, బాబు కలయిక.! వాళ్ళకి హ్యాపీ, వీళ్ళకి బీపీ.!

ఇద్దరు రాజకీయ ప్రముఖులు ఎదురు పడితే కులాసాగా కబుర్లు చెప్పుకోవడం కొత్తేమీ కాదు. రాజకీయంగా ఇద్దరి మధ్యా ఎన్ని విభేదాలు వున్నాగానీ.. తప్పవు.. కాస్సేపు నటించాల్సిందే.! అయినా, నటించాల్సిన అవసరమేముంటుంది.? వ్యక్తిగత వైరాలు...

అంతేనా.? గోరంట్ల మాధవ్ మీద ‘వేటు’ పడే అవకాశమే లేదా.?

అదేంటీ, గోరంట్ల మాధవ్ మీద వేటు పడుతుందనే ప్రచారం వైసీపీనే చేసింది కదా.? ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పేటీఎం కార్యకర్తలే సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు కదా.? కఠిన...

ఎక్కువ చదివినవి

హిందూపురం వైసీపీలో లొల్లికీ, ఎంపీ గోరంట్ల వీడియో లీక్‌కీ లింకేంటి.?

గోరంట్ల లీక్స్.. అంటూ సోషల్ మీడియాలో హిందూపూర్ ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ’ ఎంపీ గోరంట్ల మాధవ్‌కి సంబంధించిన ఓ వీడియో హల్‌చల్ చేస్తున్న విషయం విదితమే. మార్పింగ్ వీడియో అంటున్నారు...

చిరుతో సినిమా చేస్తానన్న ఆమిర్, నాగ్ ఏమన్నాడంటే!

ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లాల్ సింగ్ చడ్డా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈ సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు ఆమిర్. నాగ చైతన్య ప్రత్యేక పాత్రను...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవిని ‘మెగాస్టార్’ చేసిన మరణమృదంగం

‘తెలుగు సినిమాల్లో ఎన్టీఆర్ తర్వాత అంతటి మాస్ ఇమేజ్, స్టార్ డమ్ ఉన్న హీరో చిరంజీవి’ అనే మాట అక్షరసత్యం. అటు పాత తరానికి, నేటి తరానికి మధ్య వారధిలా చిరంజీవి ప్రస్థానం...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనను ఆవిష్కృతం చేసిన ‘స్వయంకృషి’

చిరంజీవికి వచ్చిన మాస్ ఇమేజ్ తో నెంబర్ వన్ హీరోగా.. మెగాస్టార్ గా తెలుగు సినిమాను ఏలేశారు. డ్యాన్స్, ఫైట్లతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సమయంలో నట విశ్వరూపాన్ని చూపే సినిమా చేశారు....

ఈ సీత టాలీవుడ్‌ అప్‌ కమింగ్‌ మోస్ట్‌ వాంటెడ్‌

దుల్కర్ సల్మాన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక క్లాస్ సినిమా అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో...