Switch to English

ధనుష్ సార్ మూవీ రివ్యూ

Critic Rating
( 2.25 )
User Rating
( 2.20 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,477FansLike
57,764FollowersFollow

తమిళ నటుడు ధనుష్ చేసిన స్ట్రెయిట్ తెలుగు అండ్ తమిళ్ మూవీ సార్. డీసెంట్ అంచనాల మధ్య ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి సార్ ఎలా ఉందో చూద్దామా?

కథ:

ఒక ప్రైవేట్ సంస్థలో టీచర్ గా చేస్తుంటాడు బాలు. ఒక ప్లాన్ లో భాగంగా బాలుని ఒక ప్రభుత్వ కాలేజ్ కు పంపుతారు యాజమాన్యం. బాలు ప్రభుత్వ కాలేజ్ కు వెళ్ళాక అక్కడి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంటాడు. విద్యార్థులు కాలేజ్ కి వచ్చేలా, వాళ్ళు పరీక్షలు పాస్ అయ్యేలా చేస్తాడు.

ఇవి ఆ ప్రైవేట్ సంస్థకు తలనొప్పులు తెచ్చిపెడతాయి. బాలు కి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంతకీ ఆ ప్రైవేట్ సంస్థ ప్లాన్ ఏంటి ? బాలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? చివరికి ఏమైంది అన్నది చిత్ర కథ.

నటీనటులు:

ధనుష్ ఎంత మంచి నటుడు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సార్, ధనుష్ వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. ఎఫర్ట్ లెస్ యాక్టింగ్ కు సరైన ఉదాహరణ ఈ చిత్రంలో ధనుష్ నటన. ధనుష్ స్క్రీన్ మీద ఉన్నంత సేపూ అటెన్షన్ తన మీదే ఉంచుకోవడంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి.

సంయుక్త మీనన్ తన పాత్ర వరకూ బాగానే చేసింది. అయితే ఆమెకు పెద్దగా పెర్ఫార్మన్స్ కు స్కోప్ లేని పాత్ర దొరికింది. ధనుష్ కాంబినేషన్ ఉన్న సీన్స్ ప్రత్యేకంగా అనిపిస్తాయి. సముద్రఖని కొత్తగా చేసిందేమి లేదు. తనకు అలవాటైన రీతిలో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. పాత్ర కూడా రొటీన్.

సాయి కుమార్, హైపర్ ఆది, తదితరులు సపోర్టింగ్ రోల్స్ లో కనిపించారు.

సాంకేతిక నిపుణులు:

మనకు బాగా తెలిసిన కథనే రీసైకిల్ చేసి సార్ గా మన ముందుకు తీసుకొచ్చాడు వెంకీ అట్లూరి. రొటీన్ కాన్సెప్ట్ కే బ్యాక్ గ్రౌండ్, సెటప్ మార్చి మన ముందుకు తీసుకొచ్చాడు. అయితే అది అంతలా సహాయపడలేదు. ఈ చిత్రంలో పలు సన్నివేశాలు, ఎమోషన్స్ ఇదివరకే చూసామే అన్న ఫీలింగ్ ను కచ్చితంగా కలిగిస్తాయి. దర్శకుడు కొత్తగా చేసిందేమి లేదు. ఫస్ట్ హాఫ్ ఓ మోస్తరుగా ఎంటర్టైన్ చేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం వీక్ గా అనిపిస్తుంది. నరేషన్ బాగా స్లో గా ఉంది. అలాగే క్లైమాక్స్ కూడా రొటీన్ గా సాగింది.

వెంకీ అట్లూరికి ఈ చిత్రం ద్వారా చాలా మంచి ఛాన్స్ వచ్చింది కానీ దాన్ని సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన డైలాగ్స్ బాగున్నాయి. తన పంచ్ లైన్స్ కు తోడు కొన్ని ఆలోజింపచేసే రచనలు ఆకట్టుకుంటాయి.

జివి ప్రకాష్ కుమార్ సంగీతం మెప్పిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. కెమెరా వర్క్ ఇంప్రెసివ్ గా సాగింది. ఎడిటింగ్ ఇంకా బాగుండొచ్చు.

ప్లస్ పాయింట్స్:

  • ధనుష్ పెర్ఫార్మన్స్
  • సంగీతం

మైనస్ పాయింట్స్:

  • పూర్ సెకండ్ హాఫ్
  • సరిగ్గా మెసేజ్ చెప్పలేకపోవడం
  • వీక్ స్క్రీన్ ప్లే

చివరిగా:

ఒక అర్థమవంతమైన మెసేజ్ ఉన్న చిత్రం సార్. అయితే దాన్ని రజింపచేసే విధంగా చెప్పడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. రొటీన్ టెంప్లేట్ కావడం వల్ల చాలా సన్నివేశాలు బోరింగ్ గా సాగాయి.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

రాజకీయం

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

ఎక్కువ చదివినవి

Janasena: ‘జనసేన’కు స్టార్ క్యాంపెయినర్లు.. ప్రకటించిన పవన్ కల్యాణ్

Janasena: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్ధుల ఎంపిక, ప్రకటనలు పూర్తయ్యాయి. దీంతో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పార్టీ ముఖ్య నాయకులు ప్రచారంలో బిజీగా ఉంటున్నారు....

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు,. ఇప్పటికే రిలీజ్...

Chiranjeevi: ఏమున్నావ్ బాసూ..! అదిరిపోయిన మెగాస్టార్ న్యూ లుక్

Chiranjeevi: చిరంజీవిలో ఉన్న గొప్పదనం.. లుక్స్. 15ఏళ్ల క్రితం పాలిటిక్స్ లో ఉన్నప్పుడు చిరంజీవి ఎలా ఉండేవారు.. మళ్లీ సినిమాలు చేయడంతో ఎలాంటి పిజిక్ కి వచ్చేసారనే కంపారిజన్ చాలు.. డిస్కషన్ ఓవర్....

KTR : బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ గా… కేటీఆర్ మాట

KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా...

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...