Switch to English

‘ధమాకా’ హిలేరియస్ ఎంటర్ టైనర్ : హీరోయిన్ శ్రీలీల ఇంటర్వ్యూ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధమాకా’. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్, ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 23న ‘ధమాకా’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదలౌతున్న నేపధ్యంలో హీరోయిన్ శ్రీలీల విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

ధమాకా ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?

దర్శకుడు త్రినాథరావు నక్కిన గారు తన గత చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రంలో ఓ పాత్ర కోసం నన్ను సంప్రదించారు. అప్పుడే రచయిత ప్రసన్న కూడా పరిచయమయ్యారు. కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదు. పెళ్లి సందడి విడుదల కాకముందే ‘ధమాకా’ కథ చెప్పారు. కథ చెప్పిన పది నిమిషాలకే ప్రాజెక్ట్ చేస్తానని చెప్పాను.

ధమాకా కథని ఎంచుకోవడానికి కారణం ?

ధమాకా చాలా మంచి ఎంటర్ టైనర్. చాలా హిలేరియస్ గా వుంటుంది. నాకు ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు చాలా ఇష్టం.

తక్కువ సమయంలోనే రవితేజ గారితో పని చేసే అవకాశం అందుకున్నారు కదా .. ఎలా ఫీలౌతున్నారు ?

గ్రేట్ ఫుల్ ఫీలింగ్. రాఘవేంద్ర రావు గారి సినిమాతో లాంచ్ కావడం తర్వాత రవితేజ గారితో ధమాకా లాంటి బ్యూటీఫుల్ ప్రాజెక్ట్ చేయడం చాలా లక్కీగా వుంది. రోజూ దేవుడికి థాంక్స్ చెప్పుకుంటాను. మొదటి సినిమా అంతా కొత్తవారితో జరిగిపోయింది. రెండో సినిమా రవితేజ గారు లాంటి స్టార్ హీరో కావడంతో మొదట చాలా టెన్షన్ పడ్డా. మొదట్లో మాట్లాడానికి కూడా ఇబ్బంది పడేదాన్ని. అయితే ఆయనతో పని చేస్తుంటే కాన్ఫిడెన్స్ వచ్చింది. రవితేజ గారు చాలా మోటివేట్ చేస్తారు. ఆయనతో పని చేయడంలో ఒక కంఫర్ట్ వుంటుంది. సెట్ లో చాలా సపోర్ట్ చేస్తారు. రవితేజ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. కిక్, విక్రమార్కుడు సినిమాలు ఎన్ని సార్లు చూశానో లెక్కలేదు. ఆయన్ని మొదటిసారి సెట్ లో చూసినప్పుడు ఒక సర్ ప్రైజ్ ఫీలింగ్. పాత్రలో వేరియేషన్స్ ని చాలా ఈజీగా చూపించగలరు. ఇంత ఈజీగా ఎలా చేయగలుగుతున్నారని ఆయన్ని అడుగుతుంటాను. ‘విక్రమార్కుడు’ డ్యుయల్ రోల్ ఎంత అవుట్ స్టాండింగా చేశారో.. ధమాకాలో అంతే అద్భుతంగా చేశారు.

రవితేజ గారి ఎనర్జీకి మ్యాచ్ చేశారా ?

సినిమా చూసి మీరే చెప్పాలి(నవ్వుతూ). డ్యాన్సులు చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. నాకు చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే ఇష్టం. డ్యాన్స్ నేర్చుకున్నాను.

దర్శకుడు త్రినాథరావు నక్కిన గత చిత్రాలు చూశారా ?

చూశా. నేను లోకల్ పాటలు బెంగళూర్ లో వునప్పుడు తెగ వినేదాన్ని. అందులో కీర్తి సురేష్ గారి పాత్ర నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆయనతో వర్క్ చేయడం చాలా అనందంగా వుంది. ఆయన చాలా పాజిటివ్ పర్సన్.

ధమాకాలో మీ ఫేవరేట్ సాంగ్ ?

జింతాక్ పాట బాగా నచ్చింది. తర్వాత వాట్స్ హ్యాపనింగ్ పాట. అందులో వయోలిన్ బిట్ చాలా ఇష్టం.

ట్రైలర్ లో ఇద్దరూ ఇష్టమే అని చెప్పారు.. ఇందులో మీ పాత్ర ఎలా వుంటుంది.?

ఇందులో ప్రణవి అనే పాత్రలో కనిపిస్తా. డబల్ రోల్ తో ట్రావెల్ అయినప్పుడు ఒక కన్ఫ్యూజన్ వుంటుంది. ఇద్దరూ ఇష్టం అంటే.. ముగింపు ఎలా వుంటుందనేది ఇందులో ట్విస్ట్ ఫ్యాక్టర్.

ధమాకా షూటింగ్ లో మీ స్వీట్ మెమోరీస్ గురించి ?

స్పెయిన్ లో జింతాక్ పాట షూట్ చేసినప్పుడు రేపు షూటింగ్ అనగా నా కాస్ట్యుమ్ బ్యాగ్ పోయింది. చాలా టెన్షన్ పడ్డాను. ఐతే మేము వుండే లొకేషన్ నుండి మూడు గంటలు ప్రయాణించి మా డీవోపీ, డైరెక్టర్ వేరేవేరే ప్రదేశాలకు వెళ్లి అక్కడ నా కోసం షాపింగ్ చేసి అక్కడ నుండి ఫోటోలు పెట్టి ఓకే చేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్ నా కోసం షాపింగ్ చేస్తున్నట్లు అనిపించింది. అదొక మంచి క్యూట్ మూమెంట్.

ధమాకా నిర్మాతల గురించి ?

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు చాలా ఆప్యాయంగా చూసుకున్నారు. కొన్ని సందర్భాల్లో మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ‘మన అమ్మాయి’ అనే వైబ్ ఇచ్చారు. వారి నిర్మాణంలో సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ధమాకా విడుదల కోసం చాలా ఎక్సయిటెడ్ గా ఎదురుచూస్తున్నాను. అదే సమయంలో లోపల చిన్న నెర్వస్ నెస్ కూడా వుంది. (నవ్వుతూ)

నటన, చదువుని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ?

నేను బేసిగ్గా స్విచాన్ స్విచాప్ పర్సన్ ని. యాక్టర్ అన్నప్పుడు అందరి ద్రుష్టి వుంటుంది. మెడిసిన్ చదువు విషయానికి వస్తే .. అక్కడ మనల్ని మనలానే వదిలేస్తారు. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేసుకోవడం ఇష్టం. షూటింగ్ నుండి వచ్చినా ఇంట్లో చదువుకుంటాను.

కొత్త సినిమాల గురించి ?

బాలకృష్ణ గారు, అనిల్ రావిపూడి సినిమా ఇటివలే షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అలాగే బోయపాటి-రామ్ గారి సినిమా కూడా చేస్తున్నాను. వైష్ణవ్ తేజ్ గారితో చేస్తున్న సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అలాగే వారాహి ప్రొడక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాను. నితిన్ గారితో ఒక సినిమా చేస్తున్నాను. ఇంకొన్ని సినిమాలు వున్నాయి. నిర్మాణ సంస్థలు ప్రకటిస్తాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...