Devara: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సినిమాలో భాగంగా మొదటి పార్టు సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈక్రమంలో సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు సినిమా కెమెరామెన్ రత్నవేలు. దీంతో ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నారు.
‘దేవర షూటింగ్ స్పీడుగా జరుగుతోంది. సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రొడ్యూసింగ్ సాంగ్ చిత్రీకరిస్తున్నాం. అద్భుతంగా రాబోతోందీ పాట. పాటకు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నారు. అనిరుధ్ సంగీతంలో పాట అభిమానులకి కిక్కు ఇస్తుంది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి వర్కింగ్ స్టిల్ పంచుకున్నారు.
దీంతో ఫ్యాన్స్.. సినిమా కోసం మేమంతా వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. అంచనాలు భారీగా ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్. ఆమధ్య విడుదలైన సినిమా గ్లింప్స్.. ఇటివలే విడుదలైన చుట్టమల్లే పాటతో అంచనాలు రెట్టింపయ్యాయి.