Devara: ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దేవర’. రెండు భాగాలుగా రాబోతున్న సినిమా తొలి భాగం సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈక్రమంలో సినిమా ప్రీసేల్ టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే.. ఎవరూ ఊహించని విధంగా ప్రీసేల్స్ లో రికార్డులు సృష్టిస్తోంది.
ఓవర్సీస్ లో ప్రీసేల్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. సినిమా రిలీజ్ కు ముందే ప్రీసేల్స్ లో వన్ మిలియిన్ డాలర్లు వసూళ్లు సాధించి భారతీయ సినిమాల్లో ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా రికార్డులు సృష్టించింది. ట్రైలర్ కూడా విడుదల కాకముందే ఈస్థాయి బుక్సింగ్స్ సాధించిన తొలి భారతీయ సినిమాగా కూడా దేవర రికార్డు నెలకొల్పింది.
దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషంలో మునిగిపోతున్నారు. త్వరలో దేవర ట్రైలర్ రిలీజ్ కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ నటిస్తున్న సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నారు. కల్యాణ్ రామ్ ఒక నిర్మాత.