రీసెంట్ గా వచ్చి పెద్ద హిట్ అయిన దాంట్లో దేవర ముందు వరుసలో ఉంటుంది. ఎన్టీఆర్ నుంచి త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టే ఆడింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ను కొత్తగా చూపించారు. బాక్సాఫీస్ వద్ద ఇంకా వసూళ్లు రాబడుతూనే ఉంది. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జాన్వీ కపూర్ హీరోయిన్ మెరవడం కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. కాగా ఈ దేవర మూవీ ఇప్పుడు థియేటర్ లో సునామీ తగ్గిపోయింది.
దీపావళికి కొత్త సినిమాలు రావడం అవి కూడా భారీ హిట్ కావడంతో దేవర గ్రాఫ్ తగ్గిపోయింది. కాగా దేవర ఇప్పుడు ఓటీటీలో సునామీ సృష్టించడానికి రెడీ అయిపోయింది. నెట్ ఫ్లిక్స్ లో నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మరింత సంబరాలు చేసుకునే సమయం వచ్చింది. దాంతో ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఓటీటీలో ఉన్న రికార్డులు చెరిపేసేందుకు దేవర మూవీ రెడీ అవుతుందని అంటున్నారు. మరి దేవర ఏ మేరకు రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
ఇక దేవర పార్టు-2 కూడా తీస్తామని ఇప్పటికే మూవీ టీమ్ ప్రకటించింది. మొదటి పార్టు హిట్, కలెక్షన్ల మీదనే రెండో పార్టు కూడా ఆధారపడి ఉంటుందని అందరికీ తెలిసిందే. మరి థియేటర్లలో రికార్డులు సృష్టించిన దేవర.. నెట్ ఫ్లిక్స్ ఏ మేరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి.