Switch to English

అసెంబ్లీలో జనసేనాని తొలి ప్రసంగం.! నాయకుడంటే ఇలా వుండాలి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,552FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో తొలిసారి ప్రసంగించారు. పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కూడా అయిన కొణిదెల పవన్ కళ్యాణ్, అసెంబ్లీలో తన తొలి ప్రసంగంతోనే అందరి మన్ననలూ అందుకున్నారు. అందరి దృష్టినీ ఆకర్షించారు. నాయకుడంటే ఇలా వుండాలి.. శాసన సభ్యుడంటే ఇలా వుండాలి.. అని ప్రతి ఒక్కరూ చర్చించుకునేలా పవన్ కళ్యాణ్ ప్రసంగం సాగింది.

స్పీకర్ ఛెయిర్‌లో కూర్చున్న చింతకాయల అయ్యన్న పాత్రుడిపైనా తనదైన ఛమక్కులతో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇంతకాలం చూపిన వాగ్ధాటిని స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు వదిలేయాల్సి వుంటుందని డిప్యూటీ సీఎం పవన్ సూచించారు.

అర్థవంతమైన చర్చకు శాసన సభ వేదిక కావాలనీ, అంతే తప్ప బూతులు తిట్టుకోవడానికి సభా సమయాన్ని వృధా చేయరాదని డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యానించారు. ‘గత అసెంబ్లీలో ఎలాంటి దురదృష్టకర పరిస్థితులున్నాయో చూశాం. ఆ తప్పిదాల్ని మనం చేయకూడదు. సభ్యులెవరైనా హద్దులు దాటే పరిస్థితి వుంటే, స్కూల్ మాస్టారిలా స్పీకర్ మైక్ కట్ చేయాల్సి వుంటుంది’ అని డిప్యూటీ సీఎం సూచించడం గమనార్హం.

‘మేం ఓడినా పారిపోలేదు.. దురదృష్టం, వైసీపీ పారిపోయింది. గతంలో దక్కిన అద్భుత విజయంపై విర్రవీగడం వల్లే వైసీపీ 11 సీట్లకు పరిమితమయ్యిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ‘భాష అనేది మనుషుల్ని కలపడానికి తప్ప, విడగొట్టడానికి కాదు’ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల హర్షం వ్యక్తమవుతోంది.

ఎంతటి జఠిల సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందనీ ఉప ముఖ్యమంత్రి, అసెంబ్లీలో తన తొలి ప్రసంగం సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా, రెండో రోజు అసెంబ్లీ సమావేశాలకు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డుమ్మా కొట్టారు.

స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడి నియామకం పట్ల జగన్ అసహనంతో వున్న విషయం విదితమే. సభా సంప్రదాయాల ప్రకారం, స్పీకర్‌గా ఎంపికైన వ్యక్తుల్ని ఆయా పార్టీల శాసనసభా పక్ష నేతలు, స్పీకర్ ఛెయిర్ వద్దకు తీసుకు వెళ్ళాల్సి వుంటుంది.

సినిమా

Thammudu: నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్ లాంచ్.. ఓ రిఫరెన్స్ మూవీ అవుతుందన్న...

Thammudu: నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘తమ్ముడు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. లయ, వర్ష...

Mega 157: ‘ఇది కదా చిరంజీవి మ్యాజిక్ అంటే..’ ఆసక్తి రేకెత్తిస్తున్న...

Mega 157: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటివలే ఓ...

Naga Vamsi: హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతోందా..? నిర్మాత నాగవంశీ పోస్టు...

Naga Vamsi: యంగ్ టైగర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుందా..? సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న న్యూస్. అయితే.. నిర్మాత నాగవంశీ చేసిన...

మంగ్లీ పార్టీలో తప్పిదం నాకు ఆపాదించ వద్దు: నటి దివి

నిన్న రాత్రి ఓ రిసార్ట్ లో జరిగిన గాయని మంగ్లీ పుట్టిన రోజు వేడుకల్లో.. కొంతమంది గంజాయి వినియోగం జరిగిందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియా...

సూర్య 46 షూటింగ్ స్టార్ట్..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్...

రాజకీయం

తల్లికి వందనం: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్

సుపరిపాలనకు ఏడాది.! ఔను, కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది., ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం, సరికొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. తల్లికి వందనం పేరుతో నేటి నుంచే,...

AP News: అమరావతి మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు.. జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ ప్రాంతంపై విషం కక్కుతూ నీచపు మాటలు మాట్లాడిన జర్నలిస్టు కృష్ణంరాజు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇటివల సాక్షి టీవీ చానెల్ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావు...

క్లాస్ మేట్స్ వర్సెస్ జైల్ మేట్స్.. అర్థమయ్యిందా రాజా: జగన్‌కి లోకేష్ షాక్ ట్రీట్మెంట్.!

సోషల్ మీడియా వేదికగా, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ‘అర్థమయ్యిందా రాజా’ అంటూ నారా లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. రాష్ట్రంలో శాంతి...

సాక్షిపై దాడి.! టీడీపీ కార్యాలయంపై దాడి.! అభిమానస్తుల బీపీ, షుగర్.. వల్లే కదా జగన్.!

వైసీపీ హయాంలో, టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. వైసీపీ కార్యకర్తలు, టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేశారు. ఈ క్రమంలో పలువురు టీడీపీ కార్యాలయ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తమోడుతున్న టీడీపీ కార్యాలయ...

సంకర తెగ: వైసీపీ వర్సెస్ అమరావతి.!

అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అమరావతి అంటే, ఎందుకంత అసహ్యం.? నో డౌట్, వైసీపీ గత కొన్నేళ్ళుగా అమరావతిపై అసహ్యం పెంచుకుంటూనే పోతోంది. కారణాలేంటి.? అన్నది వైసీపీ శ్రేణులకే అర్థం కాని పరిస్థితి. రాజకీయాల్లో...

ఎక్కువ చదివినవి

కొమ్మినేని అరెస్ట్.! రెడ్ బుక్ అంటూనే, పోలీసులపై ప్రశంసలు.!

ఆయనో సీనియర్ జర్నలిస్ట్.. కానీ, రాజకీయ నాయకుడిలా రాజకీయ విమర్శలు చేస్తాడేంటి.? ఇదే ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు మీద, ‘అమరావతి మహిళల్ని వేశ్యలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు’ అంటూ...

తిరుమల లడ్డూలో వాడింది అసలు నెయ్యే కాదా..!

తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న విషయం తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ కేసు విషయంలో లేటెస్ట్ గా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పవిత్రమైన శ్రీవారి...

అనుకున్న డేట్ కే వస్తున్న తమ్ముడు.. త్వరలోనే ట్రైలర్..

నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ ల‌య‌, స‌ప్త‌మీ గౌడ‌,...

Hari Hara Veeramallu: ‘హరి హర వీరమల్లు’ విడుదలపై చిత్ర బృందం క్లారిటీ..

Hari Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన పిరియాడిక్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’. 2020లోనే ప్రారంభమైన సినిమా సుదీర్ఘ కాలం సెట్స్ పైనే ఉండిపోయింది. మే నెలలో విడుదలవుతుందని...

మంగ్లీ పార్టీలో తప్పిదం నాకు ఆపాదించ వద్దు: నటి దివి

నిన్న రాత్రి ఓ రిసార్ట్ లో జరిగిన గాయని మంగ్లీ పుట్టిన రోజు వేడుకల్లో.. కొంతమంది గంజాయి వినియోగం జరిగిందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో గుప్పుమంటోంది.. ఇదే పార్టీ కి...