దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన స్పందన తెలియచేశారు. 2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. దేశ అభివృద్ధి కార్యక్రమాలతో ఆర్ధిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారు. ప్రధాని మోదీ నిర్ధేశించిన లక్ష్యాన్ని అందుకోవడం కోసం దేశ రాజధాని ఢిల్లీ పాత్ర చాలా కీలకం. ఈ తరుణంలో ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి విజయం సాధించడం స్వాగతించదగ్గ విషయమని అన్నారు పవన్ కళ్యాణ్.
డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో అభివృద్ధి, సంక్షేమం క్షేత్ర స్థాయికి చేరుతాయని అన్నారు. ఢిల్లీ అభివృద్ధికి, దేశ రాజధానిలోని ప్రజల శ్రేయస్సు కోసం వికసిత సంకల్ప్ పత్ర ద్వారా బిజేపీ ఇచ్చిన హామీలు ప్రజలు మెప్పు పొందాయని అన్నారు పవన్ కళ్యాణ్.
ఢిల్లీ ప్రజలు శ్రీ నరేంద్ర మోదీ గారిపై ఉంచిన విశ్వాసానికి ప్రతీక ఈ ఘన విజయం.. ఆర్ధిక అవకతవకలకు ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు పరిపాలన సాగుతాయని ఢిల్లీ ప్రజలు విశ్వసించారు. ఇక ఈ విజయంలో కేంద్ర హోమ్ శాఖామాత్యులు శ్రీ అమిత్ షా రాజకీయ అనుభవం చాతుర్యం ఈ ఫలితాలు వచ్చేలా చేశాయని అన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖామాత్యులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జే.పి నడ్డా గారు కూటమిని ముందుకు తీసుకెళ్లడంలో సఫలీకృతమయ్యారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో విజయానికి కారణమైన ప్రధాని నరేంద్ర మోడీ గారికి, శ్రీ అమిత్ షా గారికి, శ్రీ జే.పి నడ్డా గారికి. బీజేపీ, మిత్ర పక్ష నాయకులకు హృదయపూర్వక అభిననందలు తెలియచేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్.