ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తన కూతురు ఆద్య అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. వివిధ సందర్భాల్లో వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని పవన్ బయటపెట్టారు. తాజాగా ఆయన కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా ఆయన ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కుమార్తె ఆద్యతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. ప్రసంగానికి ముందు ఆయన ఈ ఫోటో తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి డిప్యూటీ సీఎం తో పాటు మరికొన్ని శాఖలకు మంత్రిగా ఉన్నారు. అప్పటినుంచి పవన్ తన మార్క్ పాలనతో దూసుకుపోతున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలను ఘనంగా జరిపేందుకుగాను దాదాపు 34 ఏళ్ల తర్వాత మేజర్ పంచాయతీలకు రూ. 25 వేల బడ్జెట్ ని కేటాయించారు. మైనర్ పంచాయతీలకు రూ. 10 వేలు కేటాయిస్తూ పవన్ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు ఈ బడ్జెట్ రూ. 100 నుంచి రూ. 250 గా మాత్రమే ఉండేది.