Switch to English

నిరసనల పేరుతో.. దేశాన్ని తగలబెట్టేస్తారా.?

దేశ రాజధాని ఢిల్లీలో ‘నిరసనలు’ ఆందోళనకంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఒకప్పుడు జమ్మూకాశ్మీర్‌లో ఇలాంటి పరిస్థితులు చూశాం. ఇప్పుడు అదే పరిస్థితి దేశ రాజధానిలో కన్పిస్తుండడం.. పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో ఈ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు వున్నప్పటికీ, ఆందోళనలు జరగడంపై కేంద్ర హోంశాఖ సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతోంది.

కాగా, ఓ పథకం ప్రకారమే ఢిల్లీలో అలజడి సృష్టిస్తున్నాయి కొన్ని అల్లరి మూకలు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌పిఆర్‌, ఎన్‌సిఆర్‌లకు వ్యతిరేకంగా తొలుత నిరసనలు జరిగాయి. ఆ నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ఇప్పుడు దేశంలో అలజడిని సృష్టించేందుకు.. ఈ ఆందోళనల్ని కొన్ని అల్లరి మూకలు అవకాశంగా తీసుకుంటున్నాయి.

సోషల్‌ మీడియా వేదికగా ఢిల్లీ అల్లర్లపై జరుగుతున్న యాగీ అంతా ఇంతా కాదు. ‘ఇస్లామిక్‌ టెర్రరిస్టులు’, ‘హిందూ టెర్రరిస్టులు’ అంటూ ఎవరికి వారు తమ తమ శౖలిలో వీడియోలు తయారు చేస్తూ, మార్పిÛంగ్‌ ఫొటోలు ప్రచారం చేస్తూ.. ఉద్రిక్త పరిస్థితుల్ని మరింత పెంచేస్తున్నారు. క్రమక్రమంగా ఈ పైత్యం ఇతర రాష్ట్రాలకూ పాకుతోంది.

దేశంలో కొన్ని రాష్ట్రాల్లోని అధికార పార్టీలు, బీజేపీకి వ్యతిరేకంగా నినదిస్తున్న విషయం విదితమే. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు ముందు ముందు గందరగోళంగా తయారవుతాయనే చర్చ సర్వత్రా జరుగుతోంది. గత కొంతకాలంగా తీవ్రవాద కార్యకలాపాలు దేశంలో పెద్దగా కన్పించలేదు. కానీ, తీవ్రవాదం కొత్త పంథా ఎంచుకుని, దేశంలో అలజడి సృష్టిస్తోందనీ, ఆ తీవ్రవాదం ప్రేరేపితమే.. ఈ అల్లరి మూకల దాడులనే వాదనలూ లేకపోలేదు.

ఏదిఏమైనా, దేశం మనది. అన్ని మతాలకు చెందినవారూ ఇప్పుడు సంయమనం పాటించాల్సిందే. నిరసనల పేరుతో దేశాన్ని తగలబెట్టేయాలని చూడటమంటే అంతకన్నా నరరూపరాక్షసత్వం ఇంకోటి వుండదు. నిరసనలకూ హద్దు వుంటుంది.! ఆ హద్దులకు లోబడే నిరసనలుండాలి.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: టిక్ టాక్ వీడియో కారణంగా గొర్రెల కాపరి అరెస్ట్

అనంతపురం జిల్లాలో అటవీ శాక అధికారులు గొర్రెలు కాసుకునే నాగార్జునను అరెస్ట్ చేశారు. అతడు వన్య ప్రాణులను ఇబ్బంది పెడుతూ టిక్ టాక్ వీడియోను చేశాడు. పలు వీడియో లు సోషల్ మీడియాలో...

వలస కార్మికుల కోసం అల్లు అరవింద్ సైతం

ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ పరిస్థితుల్లోనే ఉంది. ఇటువంటి విపత్కర పరిస్థితులకు వ్యవస్థలే నిస్తేజమైపోవడంతో ఎక్కువగా బలైపోయింది అసంఘటిత కార్మికులే. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి ఉపాధి కరువై పోయింది. దీంతో ఉన్నదేదో చేతబట్టి...

ఫ్లాష్ న్యూస్: రోడ్డు మీద మిలియన్‌ డాలర్ల డబ్బు దొరికితే అతడేం చేశాడో తెలుసా?

రోడ్డు మీద పది రూపాయలు దొరికితే అటు ఇటు చూసి దాన్ని జేబులో పెట్టుకునే రోజులు. వేల రూపాయలతో ఉన్న పర్స్‌ రోడ్డు మీద కనిపిస్తే ఎవరిదో అనే విషయం కనీసం ఆలోచించకుండా...

గ్యాస్‌ లీకేజీ : ఆ రైతులను ఆదుకునేది ఎవరు?

విశాఖ గ్యాస్‌ లీకేజీ కారణంగా మృతి చెందిన వారికి ప్రభుత్వం కోటి నష్టపరిహారంను ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక బాధితులకు సైతం ప్రభుత్వం అంతో ఇంతో సాయం చేసింది. అయితే గ్యాస్‌ లీకేజీ...

లాక్ డౌన్ లో సురక్షితం కాని అబార్షన్లు 10లక్షలు..!

భారత్ లో గర్భం రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకునే వారి సంఖ్య ఎక్కువే. ఇదే వరుసలో అబార్షన్ చేయించుకునే వారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే గర్భం దాల్చకుండా తీసుకునే జాగ్రత్తల్లో...