పలు సినిమాల్లో బాల నటుడిగా నటించిన దీపక్ సరోజ్ ‘సిద్ధార్థ రాయ్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యి ప్రేక్షకులను అలరించాడు. ఆయన తదుపరి సినిమా లాంచనంగా ప్రారంభం అయ్యింది. శ్రీ లక్ష్మీనరసింహ ఆర్ట్స్ ప్రొడక్షన్ లో సినిమా నేడు పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది. హరీష్ గదగాని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంతో తన్నీరు హరిబాబు నిర్మాత.
దీక్షిక, అనైరా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రఘుబాబు, హైపర్ ఆది, సత్య, యూట్యూబర్ పుంజు, యాదమ్మ రాజు, రచ్చ రవి వంటి వారు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ప్రముఖుల సమక్షంలో
ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. దర్శకులు వేణు ఊడుగుల, ప్రదీప్ మద్దాలి, కమిటీ కుర్రాళ్ళు ఫేమ్ యదు వంశీ , క ఫేమ్ సుజిత్- సందీప్, సందీప్ సరోజ్, భరత్ పెద్దగానిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ మాట్లాడుతూ ఈ కథ ఒప్పుకున్నందుకు దీపక్, అనైరాకి థాంక్స్. రొమాంటిక్ కాల్ టు లవ్ స్టోరీ గా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. జనవరిలో మొదలుపెట్టి ఏప్రిల్ లో ముగించాలని ప్లాన్ చేస్తున్నాము. హీరో దీపక్ సరోజ్ మాట్లాడుతూ.. నేను మంచి కథ కోసం చూస్తున్నప్పుడు ఈ కథ విన్నాను. అనూప్ రూబెన్స్ గారు నా సినిమాకి సంగీతం అందించడం నా అదృష్టం. ఇతర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందనే నమ్మకం వ్యక్తం చేశారు.