ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడతాడన్న విషయం తెల్సిందే. గత 5 సీజన్లలో దుమ్ము దులిపే పెరఫార్మన్స్ లు ఎన్నో ఇచ్చిన వార్నర్ ప్రస్తుతం క్రికెట్ వ్యవహారాలు ఏం లేకపోవడంతో టిక్ టాక్ యాప్ పై వీరవిహారం చేస్తున్నాడు.
ముఖ్యంగా తెలుగు, తమిళ సాంగ్స్, డైలాగ్స్ తో హల్చల్ చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రంలో బుట్ట బొమ్మ సాంగ్ టిక్ టాక్ తో అందరి దృష్టిని ఆకర్షించిన వార్నర్, రెండు రోజుల క్రితం కమల్ హాసన్ పాట సన్నజాజి పడక ట్యూన్ కు తన భార్య, కూతురుతో కలిసి స్టెప్ వేశారు.
ఇక ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాలోని ఐకానిక్ డైలాగ్ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను టిక్ టాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే దీనిపై దర్శకుడు పూరి జగన్నాథ్, వార్నర్ కు మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది. ఈ డైలాగ్ నీకు సరిగ్గా సెట్ అవుతుంది వార్నర్, నా సినిమాలో ఒక చిన్న పాత్రలోనైనా నిన్ను నటింపజేయాలి అని పూరి జగన్నాథ్ అంటే దానికి వార్నర్ తప్పకుండా అయితే దానికి సన్ రైజర్స్ ట్రేడ్ కు ఒప్పుకుంటుందేమో చూడాలి అని సరదాగా రిప్లై ఇచ్చాడు.
ఇలా వరసగా తెలుగు పాటలు, డైలాగ్స్ తో తెలుగు రాష్ట్రాల ప్రజల మనసు దోచుకుంటున్నారు డేవిడ్ వార్నర్.
David This is soooo you. Stubborn and aggressive. This dialogue suits you the best. You are fantastic as an actor also, Hope you do a cameo in my film. Love you 💪🏽🤩 https://t.co/ejVnYNRTrS
— PURIJAGAN (@purijagan) May 10, 2020
876369 493821It can be difficult to write about this topic. I feel you did a fantastic job though! Thanks for this! 329220