నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమా మార్చి 28న రిలీజ్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది. రిలీజ్ దగ్గర పడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇప్పటికే నితిన్ హానెస్ట్ పాడ్ కాస్ట్ అంటూ డైరెక్టర్ వెంకీ తో, హీరోయిన్ శ్రీలీలతో ఫన్నీ చిట్ చాట్ చేశారు.
మరోపక్క సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నాడు. ఐతే రాబిన్ హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ కూడా నటించాడన్న విషయం తెలిసిందే. సినిమాలో అతని రోల్ ఏంటన్నది తెలియదు కానీ కచ్చితంగా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. ఇదిలాఉంటే నేడు రాబిన్ హుడ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈవెంట్ కి గెస్ట్ గా డేవిడ్ వార్నర్ వస్తున్నారు.
ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు డేవిడ్ వార్నర్ హైదరాబాద్ వచ్చారు. డైరెక్టర్ వెంకీ కుడుముల డేవిడ్ వార్నర్ ని రిసీవ్ చేసుకున్నారు. నేడు జరగబోతున్న ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నితిన్, శ్రీలీలతో పాటు డేవిడ్ వార్నర్ కూడా సందడి చేయనున్నారు.
రాబిన్ హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ 5 నిమిషాలు మాత్రమే కనిపిస్తారని టాక్. ఈ సినిమా చేసినందుకు గాను వార్నర్ రెండున్నర కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకున్నాడని చెప్పుకుంటున్నారు.