BIGGBOSS-8: తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉన్న రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 8 (తెలుగు) 14 మంది కంటెస్టెంట్స్ తో సెప్టెంబర్ 1న మొదలై ప్రస్తుతం చివరి అంకానికి చేరుకుంది. మధ్యలో కొందరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి పంపించడంతో హౌజ్‌మేట్స్ vs వైల్డ్‌కార్డులు మధ్య గేమ్స్తొ నామినేషన్స్, ట్విస్ట్‌లతో కొనసాగింది. ఇప్పటికి 15 మంది కంటెస్టెంట్లు ఎలిమినేటై ప్రస్తుతం ఏడుగురు మిగిలారు. దీంతో సీజన్-8 గ్రాండ్ ఫినాలేకు సిద్ధమైంది. ఫినాలే ఎప్పుడు..? టాప్-5 వివరాలు.. ప్రైజ్ మనీ వివరాలు పరిశీలిస్తే..
టాప్-5 కంటెస్టెంట్స్ ను ఆడియన్స్ నిర్ణయిస్తారన్న బిగ్‌బాస్.. నామినేషన్స్ లేకుండా నేరుగా అవినాష్ ను నామినేట్ చేశాడు. దీంతో ఈవారం నామినేషన్స్‌లో విష్ణుప్రియ, గౌతమ్, నిఖిల్, ప్రేరణ, రోహిణి, నబీల్ నిలిచారు. ఈవారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే వార్తల నేపథ్యంలో టాప్-5 ఎవరనే ఉత్కంఠ నెలకొంది. 6గురిలో ఇద్దరు మిడ్ వీక్‌లో ఒకరు, వీకెండ్లో మరొకరు ఎలిమినేట్ అవుతారని.. టాప్-5 నిఖిల్, గౌతమ్, నబీల్, విష్ణుప్రియ, అవినాష్ ఉంటారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రతి సీజన్ కు భిన్నంగా ప్రైజ్ మనీని లాస్ట్ వీక్‌లో కాకుండా.. ఈసారి సంపాదించుకున్నోడికి సంపాదించుకున్నంతగా ప్లాన్ చేశారు. దీంతో భారీగా రూ.54,30,000 ప్రైజ్‌మనీ వచ్చింది. ఇది పెరగొచ్చు లేదా తగ్గొచ్చనే సంకేతాలిచ్చారు నాగార్జున. బిగ్ బాస్-8 సీజన్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 15వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రసారమవుతుందని తెలుస్తోంది. ఆకట్టుకునే గేమ్స్, సెలబ్రిటీలతోపాటు చీఫ్ గెస్ట్ ను కూడా పిలుస్తారని సమాచారం.