తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ లో క్రియాశీలకంగా వ్యవహరించిన పీసీసీ నాయకుడు దాసోజు శ్రవణ్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. రేవంత్ రెడ్డి పోకడలకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లుగా దాసోజు శ్రవణ్ ప్రకటించాడు. కాంగ్రెస్ లో కింది స్థాయి నుండి ఎదిగిన తాను పార్టీ కోసం చాలా కష్టపడ్డాను అన్నాడు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీలో అరాచకత్వం రాజ్యం ఏళుతోందని.. పార్టీలో ఆయన నిర్ణయాలు ఏమాత్రం సరిగా లేవని శ్రవణ్ పేర్కొన్నాడు.
స్పోక్స్ పర్సన్ గా కాంగ్రెస్ లో అత్యంత క్రియాశీలక వ్యక్తిగా నిలిచిన శ్రవణ్ పార్టీని వీడటం అనేది ఖచ్చితంగా పెద్ద నష్టం అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బీజేపీలో చేరుతారా లేదా అనేది చూడాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ శ్రవణ్ ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం అంటూ ప్రకటించాడు. ఏ పార్టీలో చేరబోయే విషయమై శ్రవణ్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.