Switch to English

బర్త్ డే స్పెషల్: రాఘవేంద్రరావు సృష్టించిన అద్భుతాలు ఎన్నో.. అందులో టాప్ 10.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్దర్శకులుగా చెప్పుకోదగ్గ దర్శకుల్లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఒకరు, ఆయన సినిమాలకి తెలుగు సినీ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. శతాధిక చిత్రాల దర్శకుడిగా ఎన్నో అపురూపమైన సినిమాలను తెరకెక్కించారు. కెరీర్లో నాటి ఎన్టీఆర్ నుంచి చిరంజీవి, నేటి జనరేషన్ లో అల్లు అర్జున్ వరకూ ఎంతోమంది హీరోలతో సినిమాలు చేసారు. అలాగే ఆయన వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళని తెలుగు సినిమాకి హీరోలుగా పరిచయం చేసాడు. అలాగే అతిలోక సుందరి శ్రీదేవి, కుష్బూ, టబు, దీప్తి భట్నాగర్, శిల్ప శెట్టి, తాప్సి లాంటి ఎందరో హీరోయిన్స్ ని కూడా ఆయన తెలుగు సినిమాకి పరిచయం చేశారు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే, యంగ్ హీరోస్ తో కూడా డిఫరెంట్ సినిమాలు చేసి వారి కెరీర్ కి పూల బాట వేశారు.

ఆయన అందించిన బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్, క్లాసిక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పాటల్లో అందం, హీరోయిన్ గ్లామర్ ను చూపించడంలో కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. 45 ఏళ్ల కెరీర్లో ఆయన అందించిన అద్భుతాలెన్నో ఉన్నాయి. నేడు ఆయన జన్మదినం సందర్భంగా దర్శకేంద్రుడికి తెలుగుబుల్లెటిన్.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన కెరీర్లో మైలురాళ్లుగా నిలిచిన టాప్ 10 సినిమాలు మీకోసం..

1. బాబు: శోభన్ బాబుతో తెరకెక్కించిన ఈ సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. భవిష్యత్ సినిమాల్లో తన ప్రభంజనానికి ఈ సినిమా ఉపయోగడినా తర్వాతి సినిమా జ్యోతితో హిట్ ట్రాక్ పట్టారు.

రాఘవేంద్రరావు సృష్టించిన అద్భుతాలు ఎన్నో.. అందులో టాప్ 10.!

2. అడవిరాముడు: ఎన్టీఆర్, జయప్రద కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో స్టార్ డైరక్టర్ గా మారిపోయారు. ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ పాటను తెరపై డబ్బులు విసిరేలా తెరకెక్కించి సెన్సేషన్ క్రియేట్ చేశారు.

రాఘవేంద్రరావు సృష్టించిన అద్భుతాలు ఎన్నో.. అందులో టాప్ 10.!

3. వేటగాడు: ఎన్టీఆర్ – శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. పాటలన్నీ సూపర్ హిట్. ఆకు చాటు పిందె తడిసే పాట సెన్సేషనల్ హిట్ అయింది.

రాఘవేంద్రరావు సృష్టించిన అద్భుతాలు ఎన్నో.. అందులో టాప్ 10.!

4. హిమ్మత్ వాలా: ఈ సినిమాతో హిందీలో అడుగుపెట్టారు. శ్రీదేవిని హిందీలో స్టార్ హీరోయిన్ ను చేసిన సినిమా ఇదే. తెలుగులో కృష్ణతో తీసిన ఊరికిమొనగాడు సినిమాకు ఇది రీమేక్.

రాఘవేంద్రరావు సృష్టించిన అద్భుతాలు ఎన్నో.. అందులో టాప్ 10.!

5. కలియుగ పాండవులు: ఈ సినిమాతో తెలుగు తెరకు వెంకటేశ్ ను పరిచయం చేశారు. కుష్బూ కథానాయిక. వెంకటేశ్ కు తొలి సినిమాతోనే సూపర్ హిట్ ఇచ్చారు.

రాఘవేంద్రరావు సృష్టించిన అద్భుతాలు ఎన్నో.. అందులో టాప్ 10.!

6. జగదేకవీరుడు అతిలోకసుందరి: ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ఓ చరిత్ర. నాలుగు ఫ్లాపులు తర్వాత తీసిన ఈ సినిమా రాఘవేంద్రరావు కెరీర్లో ఓ అద్భుతంగా, తెలుగు సినిమాల్లో ఓ క్లాసిక్ వండర్ గా నిలిచిపోయింది.

రాఘవేంద్రరావు సృష్టించిన అద్భుతాలు ఎన్నో.. అందులో టాప్ 10.!

7. ఘరానామొగుడు: ఈ సినిమాతో తెలుగులో తొలి 10కోట్ల షేర్ వసూలు చేసిన సినిమాగా నిలిపారు. చిరంజీవిలోని మాస్ యాంగిల్ ను పూర్తిగా ఉపయోగించి కథను అత్యంత పవర్ ఫుల్ గా చూపించారు.

రాఘవేంద్రరావు సృష్టించిన అద్భుతాలు ఎన్నో.. అందులో టాప్ 10.!

8. పెళ్లి సందడి: శ్రీకాంత్ హీరోగా తీసిన ఈ లోబడ్జెట్ సినిమా అప్పట్లో సంచలనాలు నమోదు చేసింది. రాఘవేంద్రరావు మార్క్ పాటలు, కామెడీ, లవ్ స్టోరీతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.

రాఘవేంద్రరావు సృష్టించిన అద్భుతాలు ఎన్నో.. అందులో టాప్ 10.!

9. అన్నమయ్య: రాఘవేంద్రరావు అంటే హీరోయిన్ల గ్లామర్, పాటలు మీద ఆధారపడతాడు అనే ముద్రను చెరిపేసిన సినిమా. నాగార్జునలో ఇలాంటి నటుడున్నాడా అని నిరూపించింది అన్నమయ్య. ఆ జనరేషన్ లో 175 రోజులు ఆడింది. ధియేటర్లన్నీ ఆధ్యాత్మిక క్షేత్రాలయ్యాయి.

రాఘవేంద్రరావు సృష్టించిన అద్భుతాలు ఎన్నో.. అందులో టాప్ 10.!

10. గంగోత్రి: కెరీర్లో రాఘవేంద్రరావుకు 100వ సినిమా. అల్లు అర్జున్ కు ఇది తొలి సినిమా. ఈ సినిమాను సూపర్ హిట్ చేసారు. బన్నీలోని నటనను రాబట్టి అతని కెరీర్ ను గ్రాండ్ గా లాంచ్ చేశారు.

రాఘవేంద్రరావు సృష్టించిన అద్భుతాలు ఎన్నో.. అందులో టాప్ 10.!

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు కెరీర్లో ఇవే కాకూండా ఎన్నో కమర్షియల్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి కానీ ఆయన కెరీర్ ని మలుపు తిప్పిన టాప్ 10 చిత్రాలను మీకందించాం.. మీకు నచ్చిన సినిమాల లిస్ట్ ని కింద కామెంట్స్ లో తెలపండి.

సినిమా

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

టీడీపీకి ఎన్టీఆరే దిక్కు.. కండిషన్స్‌ అప్లయ్‌.!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు తరహాలోనే ఖాకీ రంగు దుస్తులు ధరించి, రాజకీయ తెరపై కన్పించాల్సిందేనా.? ఆ సమయం ఆసన్నమయ్యిందా.? అంటే, అవుననే అంటున్నారు టీడీపీలో చాలామంది...

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ గిఫ్ట్.. ఎప్పుడైతే అప్పుడే

తన సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడంలో రాజమౌళి శైలి వేరు. ప్రమోషన్స్ కు చాలా ప్రాధాన్యతను ఇస్తాడు జక్కన్న. తన హీరోల్ని ప్రోజెక్ట్ చేయడంలో కూడా ముందుంటాడు. బాహుబలికి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అంటూ హైప్...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని మించి మరొకటి విజయం సాధించాయి. తన...

విశాఖ గ్యాస్‌ లీక్‌: ఎల్జీ పాలిమర్స్‌కి బిగ్‌ షాక్‌.?

యావత్‌ భారతదేశాన్ని కుదిపేసింది విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన. ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన విష వాయువు లీక్‌ కావడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కారణమైన ‘స్టైరీన్‌’...