Switch to English

కొత్త ఛాలెంజ్‌: ‘పుర్రె’ పగులుద్ది జాగ్రత్త.!

జస్ట్‌ ఫర్‌ ఫన్‌ కాస్తా.. ఇప్పుడు ప్రాణాల మీదకు తెస్తోంది. రోజుకో కొత్త ఛాలెంజ్‌ ఇంటర్నెట్‌ని కుదిపేస్తోంది. ఎక్కడో ఎవడో ఓ పిచ్చోడు ఏదో చేస్తే, దాన్ని పట్టుకుని.. ప్రాణాలు తీసేసుకోవడం యువతకి అలవాటైపోయింది. ‘బ్లూ వేల్‌’ ఛాలెంజ్‌ అనీ, ఇంకోటనీ.. ప్రధానంగా యువత ప్రాణాల్ని తోడేస్తోన్న విషయం విదితమే. ఇలాంటి వెకిలి ఛాలెంజ్‌లు పుట్టుకొచ్చిన ప్రతిసారీ, ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.

తాజాగా ‘స్కల్‌ బ్రేకర్‌ ఛాలెంజ్‌’ అనే కొత్త మహమ్మారి.. ఇంటర్నెట్‌లో అత్యంత ప్రమాదకరంగా సంచరించేస్తోంది.. యువతీయువకుల మెదళ్ళను చితక్కొట్టేస్తోంది. మొత్తం ముగ్గురు వ్యక్తులుంటారు.. అందులో ఇద్దరు నిల్చుని తమ కాళ్ళను గాల్లోకి లేపుతారు.. అంటే జంప్‌ చేస్తారన్నమాట. మధ్యలో వున్నోడినీ జంప్‌ చేయమంటారు.. అలా మధ్యలో వున్న వ్యక్తి గాల్లోకి జంప్‌ చేయగానే, మిగిలిన ఇద్దరూ.. గాల్లోకి ఎగిరిన వ్యక్తి కాళ్ళను తమ కాళ్ళతో తోసేస్తారు.. అంతే కిందపడ్తాడు ఆ మూడో వ్యక్తి. తలకాయ నేరుగా నేలకి తాకుతుంది. ఇంకేముంది.? పుర్రె పగిలిపోతుంది.

దీన్ని ఛాలెంజ్‌ అని అనగలమా.? దీన్ని హత్యాయత్నంగా భావించాల్సి వుంటుంది. ఈ పైశాచిక ఆనందంపై ఇప్పటికే కొన్ని చోట్ల పోలీసు వ్యవస్థలు సీరియస్‌గా స్పందిస్తున్నాయి. కొన్ని వెబ్‌సైట్స్‌లో ఈ తరహా వీడియోలకు అడ్డుకట్ట కూడా పడుతోంది. దురదృస్టవశాత్తూ ఇలాంటి పైత్యాలకి మన ఇండియన్స్‌ ఎక్కువగా ప్రభావితమవుతుంటారు.

టిక్‌ టాక్‌ ద్వారా మొదలైన ఈ పైశాచిక ఆనందం.. మన దేశంలో ఇప్పటికే చాలా చోట్ల చాలామందిని దెబ్బతీసిందనే వార్తలు విన్పిస్తున్నాయి. అధికారికంగా ఇలాంటి ఘటనలు ఇంకా నమోదు కాలేదట. ఫన్‌ కోసం తగిన ఏర్పాట్లు చేసుకున్నా.. అమాంతం పై నుంచి కిందపడితే ప్రమాదమేనని వైద్య నిపుణులు స్కల్‌ బ్రేకర్‌ ఛాలెంజ్‌ గురించి హెచ్చరిస్తున్నారు. సరైన ఏర్పాట్లు చేసుకోకపోతే.. వెంటనే ప్రాణాలు కోల్పోయే అవకాశముందన్నది డాక్టర్ల హెచ్చరిక.

సినిమా

మెగాస్టార్ రీమేక్ లోకి జగ్గూ భాయ్.!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కరోనా కారణంగా బ్రేక్ పడిన...

మరో స్పెషల్ రికార్డ్ కొట్టేసిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు నచ్చిన సినిమాల గురించి పోస్ట్ చేయడం...

మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండేలా లేదుగా.!

సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. లాక్ డౌన్ సమయంలో రాజమౌళిని...

లెజండరీ దర్శకుడితో విక్టరీ వెంకటేష్?

దర్శకుడిగా కె రాఘవేంద్రరావు తెలుగు సినీ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా కమర్షియల్ ఫార్మటును కొత్త పుంతలు తొక్కించి రాఘవేంద్రరావు ఎన్నో మరపురాని విజయాలను...

స్పెషల్‌: స్టార్ హీరోతో రెజీనా షార్ట్ ఫిల్మ్

తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ రెజీనా. ఈ అమ్మడు ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేకపోవడం తో వెబ్ సిరీస్...

రాజకీయం

ఇన్‌సైడ్‌ స్టోరీ: ఇళ్ళ పట్టాల పేరుతో వైసీపీ నేతలు దోచేస్తున్నారా.?

జులై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేపథ్యంలో అదే రోజున పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం గత కొద్ది నెలలుగా...

మళ్ళీ లాక్‌డౌన్‌.. హైద్రాబాద్‌పై ఏంటీ గందరగోళం.?

గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో మళ్ళీ కరినంగా లాక్‌డౌన్‌ అమలు కాబోతోందట.! గత కొద్ది రోజులుగా విన్పిస్తోన్న ఈ ఊహాగానాలు సగటు హైద్రాబాదీని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తోంది. ‘హైద్రాబాద్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది’...

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై ఈడీ కేసు

టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై ఈడీ కేసు నమోదయింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ టీవీ9 లో నిధుల దుర్వినియోగంపై రవి ప్రకాష్ పై చేసిన ఫిర్యాదు మేరకు ఈ...

వైసీపీకి మళ్ళీ ‘పీకే’ అవసరం ఎందుకొచ్చినట్లు.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకి మళ్ళీ ప్రశాంత్‌ కిషోర్‌ ‘అవసరం’ వచ్చిందట. గ్రామ స్థాయిలో పార్టీ పరిస్థితిపై ‘పీకే’ టీమ్ తో అంచనా వేయించి, పరిస్థితులు తేడాగా వుంటే సరిదిద్దుకునేందుకు పార్టీ...

ఏపీ కరోనా టెస్టుల్లో విశ్వసనీయత ఎంత.?

కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత ఒకరు తనకు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్ట్‌ జరిగితే పాజిటివ్‌ అని తేలిందనీ.. అదే తెలంగాణలో టెస్ట్‌ చేయించుకుంటే నెగెటివ్‌గా తేలిందనీ ఆరోపిస్తూ.. కొన్ని ఆధారాల్ని తెరపైకి...

ఎక్కువ చదివినవి

కరోనా స్వైరవిహారం.. ఐదు లక్షలు దాటిన కేసులు

దేశంలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. లాక్ డౌన్ ఎత్తివేయడం.. దాదాపు అన్ని రకాల కార్యకలాపాలకూ అనుమతి ఇవ్వడంతో ఈ పరిస్థితి నెలకొంది. చాలామంది...

జమ్మూలో ఉగ్ర దాడి.. స్థానికులకు కంటతడి పెట్టించిన బాలుడు

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. భద్రత బలగాలు ఎంతగా ఉగ్రవాదులను ఏరి పారేస్తున్నా కూడా ఎక్కడో ఒక చోట పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు పాల్పడి సామాన్యుల జీవితాలను అంతం చేస్తున్నారు....

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి విరాటపర్వం

అంతా సవ్యంగా నడిచి ఉంటే ఈపాటికి విరాటపర్వం రిలీజై చాలా రోజులై ఉండేది. అయితే లాక్ డౌన్ కారణంగా 90 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్ర షూటింగ్ అక్కడే నిలిచిపోయింది. ప్రభుత్వం...

వర్మ మరో సంచలనం : ఏటీటీ కోసం ‘పవర్‌స్టార్‌’ చిత్రం

రామ్‌ గోపాల్‌ వర్మ ఈమద్య కాలంలో డిజిటల్‌ చిత్రాలపై దృష్టి పెట్టాడు. ఓటీటీ కాకుండా ఏటీటీ(ఎనీ టైమ్‌ థియేటర్‌) అంటూ సినిమా వెనుక సినిమాను విడుదల చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే తన...

మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండేలా లేదుగా.!

సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. లాక్ డౌన్ సమయంలో రాజమౌళిని మీ తర్వాతి ప్రాజెక్ట్ ఏంటని అడిగితే...