Dangal: బాలీవుడ్ (Bollywood) చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా అద్ధుత విజయం సాధించిన అమీర్ ఖాన్ (Amir Khan) ‘దంగల్’ (Dangal) బాలనటి సుహానీ భట్నాగర్ (Suhani Bhatnagar) కన్నుమూసింది. ఆమె వయసు 19 సంవత్సరాలు, ఆమె మృతిని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ధ్రువీకరిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆమె లేకుండా ‘దంగల్’ లేదని పేర్కొంది.
‘సుహానీ మృతి చెందిందనే వార్త మమ్మల్నీ తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అద్భుతమైన ప్రతిభ సుహానీ సొంతం. ఆమె లేకుండా దంగల్ సినిమా లేదు. మా గుండెల్లో సుహానీ ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆమె లేదనే వార్త జీర్ణించుకోలేకున్నాం. ఆమె తల్లి పూజ, ఇతర కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’మని పేర్కొంది.
సుహానీకి కొద్ది రోజుల క్రితం కాలి గాయమైంది. దీంతో ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటోంది. అయితే.. ఆమె వాడిన మందుల వల్లే మృతి చెందిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. సుహానీ మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 2019 నుంచి ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ చదువుకుంటోంది.