తెలుగు సినిమా పరిశ్రమలో వేతనాల అంశంపై నిర్మాతల ఏకగ్రీవ తీర్మానం – దామోదర్ ప్రసాద్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,297FansLike
57,764FollowersFollow

తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఇప్పటికే కష్టకాలంలో ఉందని, ఇటువంటి సమయంలో వేతనాల పెంపు విషయాన్ని ప్రస్తావించడం పరిశ్రమకు మరింత భారమని తెలుగు ఫిలిం చాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ వెల్లడించారు.

గౌరవనీయులైన కార్మిక శాఖ కమిషనర్ గారి ఆధ్వర్యంలో సామరస్యపూర్వక చర్చలు జరుగుతున్నప్పటికీ, ఫెడరేషన్ వారు ఆ మార్గదర్శకత్వాన్ని పక్కన పెట్టి 30% వేతనాల పెంపు అమలు చేస్తామని, నిర్మాతల నుండి కన్ఫర్మేషన్ లెటర్ తీసుకున్నవారికి మాత్రమే షూటింగ్‌కు అనుమతి ఉంటుందన్న నిర్ణయం తీసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇది నిజాయితీతో జరుగుతున్న చర్చల స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చిన్న నిర్మాతలు ఈ పెంపును భరించే స్థితిలో లేరని దామోదర్ ప్రసాద్ స్పష్టం చేశారు. కనీస వేతనాల చట్టం ప్రకారం నిర్మాతలు తమకు సాధ్యమైన వేతనంతో కార్మికులను నియమించుకునే హక్కు కలిగి ఉన్నారని కార్మిక శాఖ కమిషనర్ ఇప్పటికే తెలియజేశారని గుర్తుచేశారు. అదనంగా, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా నిర్మాతల స్వయంప్రతిపత్తిని సమర్థిస్తూ, ఫెడరేషన్ విధానాలను వ్యతిరేకించినట్లు తెలిపారు.

హైదరాబాద్‌లో జీవన వ్యయం ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నా, మన పరిశ్రమలో కార్మికులకు ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నామని ఆయన వివరించారు. అయితే యూనియన్లు కొత్తగా పరిశ్రమలోకి రావాలనుకునే నైపుణ్యవంతులైన యువకులను లక్షల రూపాయల సభ్యత్వ రుసుము విధిస్తూ అడ్డుకుంటున్నాయని, ఇది ప్రతిభావంతులైన కార్మికులకు అన్యాయం అవుతుందని విమర్శించారు.

ఈ నేపథ్యంలో తెలుగు ఫిలిం చాంబర్ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు దామోదర్ ప్రసాద్ తెలిపారు. నైపుణ్యం ఉన్న ఎవరైనా కార్మికులు, యూనియన్ సభ్యత్వం ఉన్నా లేకపోయినా, సరైన వేతనానికి పనిచేయడానికి సిద్ధంగా ఉంటే నిర్మాతలు వారిని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారని స్పష్టం చేశారు. ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించడం పరిశ్రమ బలోపేతానికి దోహదం చేస్తుందని అన్నారు.

సినిమా పరిశ్రమలో నిర్మాతలే మూలాధారం అని గుర్తుచేస్తూ, వారి శ్రేయస్సే పరిశ్రమకు ప్రాణమని దామోదర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని కార్మిక సంఘాలు గుర్తించి పరిశ్రమ మేలుకోసం సహకరించాలని ఆయన కోరారు.

 

తెలుగు సినిమా పరిశ్రమలో వేతనాల అంశంపై నిర్మాతల ఏకగ్రీవ తీర్మానం – దామోదర్ ప్రసాద్

తెలుగు సినిమా పరిశ్రమలో వేతనాల అంశంపై నిర్మాతల ఏకగ్రీవ తీర్మానం – దామోదర్ ప్రసాద్

సినిమా

‘అందరికీ కనెక్ట్ అయ్యే కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నాం’.. ‘ఓ.! సుకుమారి’పై నిర్మాత...

యంగ్ హీరో తిరువీర్, టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన గ్రామీణ కుటుంబ కథా చిత్రం 'ఓ.! సుకుమారి' జూలై 17న ప్రేక్షకుల ముందుకు...

“ఆ దివ్యాంగురాలికి అండగా నిలుస్తాను”.. చదలవాడ శ్రీనివాసరావు

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో చోటుచేసుకున్న దారుణ హత్యల ఘటనపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో కుటుంబ...

“అఖిల్ విజయానికి నాగార్జున చేసిన కష్టమే కారణం”.. భావోద్వేగమైన శివాజీ

'లెనిన్' బ్లాక్‌బస్టర్ విజయోత్సవ వేడుకల్లో నటుడు శివాజీ చేసిన ప్రసంగం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. ఈ సినిమా తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన చిత్రంగా...

‘లెనిన్’తో ఆకట్టుకున్న భాగ్యశ్రీ బోర్సే.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి మరో ఛాన్స్?

బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన భాగ్యశ్రీ బోర్సే, చాలా తక్కువ సమయంలోనే తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తొలి తెలుగు చిత్రంలోనే...

‘లెనిన్’ సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయనున్న అక్కినేని కుటుంబం.. బిగ్ స్టార్‌తో...

అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన 'లెనిన్' సినిమాకు తొలి రోజు నుంచే మంచి స్పందన లభిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కూడా సినిమా ఆశాజనకంగా ప్రారంభం కావడంతో...

రాజకీయం

నారా లోకేష్ సొంత నిధులతో కుట్టు మిషన్లు పంపిణీ

మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో నిర్వహిస్తున్న 'స్త్రీ శక్తి' కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానికంగా మంచి ఆదరణ...

వియత్నాం బోటు ప్రమాదం.. వెంటనే రంగంలోకి దిగిన లోకేష్!

వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు చిక్కుకున్నారన్న సమాచారం అందడంతో అత్యవసరంగా అధికారులతో మాట్లాడి పరిస్థితిపై పూర్తి...

“కార్మికుల సమస్యలపై పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడతారు”.. తాళ్లూరి రామ్

జనసేన పార్టీ కార్మికులు, శ్రామికులు, ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ అన్నారు. జనసేన సభ్యత్వం పొందిన కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం...

సౌత్ కొరియాలో లోకేష్ సక్సెస్ టూర్.. 50కి పైగా కంపెనీలతో పెట్టుబడి చర్చలు

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వారంరోజుల సౌత్ కొరియా పర్యటన విజయవంతంగా ముగిసింది. భారత్-దక్షిణ కొరియా సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే...

పవన్ కళ్యాణ్‌కు శస్త్ర చికిత్స.. మూడున్నర గంటల పాటు ఆపరేషన్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు శనివారం ముంబయిలో కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. రెండు భుజాల్లో తీవ్ర స్థాయిలో రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఉన్నట్లు వైద్యులు గుర్తించగా, వీలైనంత త్వరగా...

ఎక్కువ చదివినవి

ఏపీలో హ్వాసంగ్ మెగా క్లస్టర్‌కు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియాలోని బుసాన్‌లో పర్యటిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, ప్రముఖ హ్వాసంగ్ గ్రూప్ (Hwaseung Group) ఉన్నతస్థాయి ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఫుట్‌వేర్, ఫుట్‌వేర్ మెటీరియల్స్, ఆటోమోటివ్...

‘లెనిన్’లో చివరి 20 నిమిషాలే హైలైటా? శివాజీ పాత్రపై ఆసక్తి

అఖిల్ నటిస్తున్న 'లెనిన్' సినిమాపై విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో చివరి 20 నిమిషాలు కథను పూర్తిగా కొత్త మలుపు తిప్పేలా...

నారా లోకేష్ సొంత నిధులతో కుట్టు మిషన్లు పంపిణీ

మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో నిర్వహిస్తున్న 'స్త్రీ శక్తి' కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానికంగా మంచి ఆదరణ...

పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాల్సిందే.! సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని నిలబడి నేరం చేశాడు మరి.!

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జన సేన పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాలని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీ దేవి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు...

హస్తకళాకారులకు పవన్ హామీ అమలు.. ప్రత్యేక వైద్య శిబిరాల ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హస్తకళాకారులకు ఆరోగ్య భరోసా కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీకి అనుగుణంగా...