పంచాంగం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం
సూర్యోదయం: ఉ.5:47
సూర్యాస్తమయం: సా.6:27
తిథి: శ్రావణ బహుళ షష్ఠి రా.11:58 వరకు తదుపరి సప్తమి
సంస్కృతవారం: సౌమ్య వాసరః (బుధవారం)
నక్షత్రము: అశ్వని రా.2:16 వరకు తదుపరి భరణి
యోగం:గండ రా.2:04 వరకు తదుపరి వృద్ది
కరణం :గరజి మ.12:55 వరకు తదుపరి వనిజ
దుర్ముహూర్తం:ఉ.11:36 నుండి 12 :24పరక
వర్జ్యం :ఉ.10:10 నుండి మ.11:48 వరకు
రాహుకాలం:మ.12:00 నుండి 1:30 వరకు
యమగండం: ఉ7:30 నుండి 9:00 వరకు
గుళికా కాలం :ఉ.10:45 నుండి 12:20వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:27 నుండి 5:15 వరకు
అమృతఘడియలు:రా.6:52 నుండి 8:30 వరకు
అభిజిత్ ముహూర్తం: లేదు
ఈరోజు (17-08-2022) రాశి ఫలితాలు
మేషం: నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.బంధు మిత్రులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.
వృషభం: దూర ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో మరింత ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి. వృత్తి వ్యాపారములలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మిథునం: దూరపు బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమౌతాయి. చేపట్టిన వ్యవహారాలలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సోదరుల నుండి ధన సహాయం లబిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి వ్యాపారాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
కర్కాటకం: ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. రుణగ్రస్తుల నుండి రావలసిన ధనం సకాలంలో అందుతుంది. వృత్తి వ్యాపారములలో సమస్యలు అధిగమిస్తారు. సమాజంలో పెద్దవారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.
సింహం: ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సోదరులతో స్ధిరాస్తి సంబంధిత వివాదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. సంతాన పరంగా స్వల్ప ఇబ్బందులుంటాయి. ఉద్యోగ విషయమై అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
కన్య: బంధు మిత్రులు మీ మాటలతో విభేదిస్తారు. ఇంటా బయట పరిస్థితులు చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలతో గానీ పూర్తి కావు. వృత్తి వ్యాపారమున ఆలోచన లో స్థిరత్వం లోపిస్తుంది.
తుల: ఉద్యోగ విషయంలో సహోద్యోగులతో మనస్పర్ధలు తొలగుతాయి. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. దీర్ఘ కాలిక రుణాల ఒత్తిడి నుండి బయటపడతారు. జీవిత భాగస్వామితో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో అంచనాలు నిజమౌతాయి.
వృశ్చికం: ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. అవసరానికి ఇతరుల నుండి సహాయం అందుతుంది పాత విషయాలు జ్ఞప్తికి వస్తాయి వ్యాపార ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్నంగా విజయం సాదిస్తారు.
ధనస్సు: దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన సమస్యలు వలన చికాకులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి.
మకరం: ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు.కుటుంబ వ్యవహారాలలో ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.
కుంభం: ఉద్యోగ విషయంలో అధికారుల నుండి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన విషయాలలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడుతాయి. వృత్తి వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు లాభాలు కలిగిస్తాయి. బంధు మిత్రులతో సఖ్యత గా వ్యవహరిస్తారు.
మీనం: వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలు చేజారకుండా చూసుకోవాలి. ఉద్యోగమున అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాల్లో శ్రమ మరింత పెరుగుతుంది.
539761 651202Beging with the entire wales properly before just about any planking. Our own wales can easily compilation of calculated forums those thickness analysts could be the similar to some with the shell planking along with much more significant damage so that they project right after dark planking. planking 453181
281828 701717I gotta favorite this site it seems really beneficial . 456624