పంచాంగం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం
సూర్యోదయం: ఉ.5:46
సూర్యాస్తమయం: సా.6:32
తిథి: శ్రావణ శుద్ధ ఏకాదశి సా.5:22 వరకు తదుపరి ద్వాదశి
సంస్కృతవారం: ఇందు వాసరః (సోమవారం)
నక్షత్రము: జ్యేష్ఠ ఉ.11:57 వరకు తదుపరి మూల
యోగం: వైధృతి రా.2:14 వరకు తదుపరి విష్కంభం
కరణం:భథ్ర సా.5:18 వరకు
దుర్ముహూర్తం :మ.12:24 నుండి 1:12 వరకు తదుపరి మ.2:46 నుండి 3:34 వరకు
వర్జ్యం : రా.7:25 నుండి 8:55 వరకు
రాహుకాలం: ఉ.7:30 నుండి 9:00 వరకు
యమగండం: ఉ.10:30 నుండి 12:00 వరకు
గుళికా కాలం : మ.1:56 నుండి 3:32 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:25 నుండి 5:13 వరకు
అమృతఘడియలు:తె.4:21 నుండి 5:46 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:56 నుండి మ.12:47 వరకు
ఈరోజు (08-08-2022) రాశి ఫలితాలు
మేషం: దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. అనారోగ్యం సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. వృథాఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది. విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. దూరప్రయాణ సూచనలున్నవి.
వృషభం: ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. రుణదాతల నుండి ఋణ వత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
మిథునం: వ్యాపారాలు, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కుటుంబ విషయమై ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధిక వృద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
కర్కాటకం: ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నూతన ధన వస్తులాభాలు పొందుతారు.
సింహం: అవసరానికి ధన సహాయం అందుతుంది. ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఆరోగ్య సమస్యలు వలన చికాకులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి, ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి.
కన్య: ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఇంటా బయట అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
తుల: పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారమున కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
వృశ్చికం: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉదర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్ధిక సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు
ధనస్సు: సమాజంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు
మకరం: వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి
కుంభం: ఉద్యోగమున జీత భత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు.
మీనం: ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు అనుకున్న విధంగా రాణిస్తాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు నూతనోత్సాహంతో లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున మీ పని తీరుకు గుర్తింపు పొందుతారు.
175357 889458Your home is valueble for me. Thanks!? This internet page is really a walk-via for all of the information you necessary about this and didn know who to ask. Glimpse appropriate here, and you l surely uncover it. 425657
277624 497568learning toys can enable your kids to develop their motor skills quite easily;; 393028