Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 11 జూన్ 2021

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్టమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:28
సూర్యాస్తమయం: సా.6:28
తిథి: జ్యేష్ట శుద్ధ పాడ్యమి సా.4:53 వరకు తదుపరి జ్యీష్ట శుద్ధ విదియ
సంస్కృతవారం: బృగువాసరః( శుక్రవారం)
నక్షత్రము: మృగశిర మ.1:31 వరకు తదుపరి ఆరుద్ర
యోగం: శూల ఉ.8:17 వరకు తదుపరి గండ
కరణం: బవ సా.4:53 వరకు
వర్జ్యం: రా.10:39 నుండి రా.12:33 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:06నుండి 8:58 వరకు తదుపరి మ.12:26 నుండి 1:18 వరకు
రాహుకాలం: మ.10:30 నుండి 12:00 వరకు
యమగండం: మ.3:00 నుండి 4:30 వరకు
గుళికా కాలం : ఉ. 7:22 నుండి 8:59 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:08 నుండి తె.4:56 వరకు
అమృతఘడియలు: తె.4:44 నుండి 5:28 వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:48 నుండి12:40 వరకు

ఈరోజు. (11-06-2021) రాశి ఫలితాలు

మేషం: సంఘంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా అవసరానికి సహాయం అందుతుంది. వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఆర్థిక లబ్ది కలుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం: వృధా ఖర్చు విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. నూతన ప్రయత్నాలు అంతగా కలిసి రావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో అధికారులతో చికాకులు కలుగుతాయి. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి.

మిథునం: నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాల బాట పడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది.

కర్కాటకం: ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు శ్రమతో కూడి ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగి చికాకులు అధికమవుతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు అందవు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

సింహం: చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపార ఉద్యోగాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు సకాలంలో అందుతాయి.

కన్య: ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు ఉంటాయి.

తుల: దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటాబయటా సమస్యలు అధికమవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.

వృశ్చికం: చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపార వ్యవహారాలలో అవరోధాలు తొలగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు.

ధనస్సు: చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుండి బయటపడే వరకు అధికారుల సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. గృహమున వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ విషయంలో అధికారులతో సఖ్యత గా వ్యవహరించి ఉన్నత పదవులు పొందుతారు.

మకరం: బంధుమిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. నూతన గృహ వాహన యోగం ఉన్నది. నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో అంచనాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.

కుంభం: ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక నిరాశ పడతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి.

మీనం: ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. కుటుంబ విషయాలలో స్థిరత్వం లేని ఆలోచనల వలన వివాదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. నూతన రుణాలు చేయకపోవడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి

సినిమా

మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా

మెగాస్టార్ చిరంజీవి వరస ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకున్న విషయం తెల్సిందే. కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య చిత్రాన్ని దాదాపు పూర్తి చేసాడు. దీని...

మా అధ్యక్షురాలి రేసులోకి హేమ!

మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల హంగామా విడుదలైంది. మా అధ్యక్ష పీఠం కోసం ఈసారి భారీ పోటీ ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు ప్రముఖులు...

కమెడియన్‌ ను దర్శకుడిగా తీసుకు రాబోతున్న నాగ్‌

ఎంతో మంది దర్శకులను పరిచయం చేసిన అక్కినేని వారు మరో దర్శకుడిని పరిచయం చేసేందుకు సిద్దం అయ్యారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ లు పునః ప్రారంభం...

రష్మిక ఇంటికి వెళ్లిన ఫ్యాన్‌.. పోలీసులు అరెస్ట్‌

హీరోలు మరియు హీరోయిన్స్‌ కు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు తమ అభిమాన స్టార్స్ ను చూసేందుకు ఎంత దూరం అయినా వెళ్తారు....

ఫారెస్ట్‌ ఫ్రంట్ లైన్‌ హీరోస్‌ కోసం ఉపాసన

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల చేసే కార్యక్రమాలు అన్ని ఇన్నీ కావు. ఆమె చేస్తున్న షో లతో మరియు ఆమె...

రాజకీయం

నారా లోకేష్ పవర్ పంచ్: నడి రోడ్డు మీద కాల్చెయ్యమన్లేదు కదా.?

స్క్రిప్టు ఫాలో అవుతున్నారా.? లేదంటే, నిజంగానే నారా లోకేష్ రాజకీయ నాయకుడిగా తనలోని ‘పవర్ ఫుల్’ యాంగిల్ చూపిస్తున్నారా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ మధ్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిలో...

ఇసుక వర్సెస్ మట్టి.. నెల్లూరు ‘బులుగు’ ఫైట్.!

ఇద్దరూ అధికార పార్టీకి చెందిన నేతలు. పైగా ప్రజా ప్రతినిథులు. అందునా, కీలకమైన పదవుల్లో వున్న వ్యక్తులు. ‘పవర్’ వుంటే, దోచెయ్యాల్సిందే కదా.. అన్నట్టు, తమకు తోచిన రీతిలో దోచేస్తున్నారట. అందులో ఒకరి...

డెల్టా ప్లస్ వచ్చేసింది.. రాజకీయం చూస్తే సిగ్గేస్తోంది.!

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది రాజకీయ నాయకుల తీరు. కొందరు రాజకీయ ప్రముఖులు కరోనా మొదటి వేవ్, కరోనా రెండో వేవ్ సమయాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ కారణంగా ఉప ఎన్నికలూ వచ్చాయి....

కరోనా సమయంలో పరీక్షలా.. రఘురామ మరో లేఖ

ఏపీలో అధికార పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. నవ హామీలు-వైఫల్యాల పేరుతో ఇప్పటివరకు సీఎం జగన్ కు తొమ్మిది లేఖలు రాసిన ఆయన.. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో...

విజయసాయిరెడ్డి స్థాయికి అశోక్ గజపతిరాజు దిగజారాల్సిందేనా.?

‘16 నెలలు జైల్లో వుండి వచ్చిన వ్యక్తికి అందరూ దొంగల్లానే కనిపిస్తారు.. ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది.?’ అని ఒక్క మాటతో తన మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ‘దిమ్మ తిరిగి మైండ్...

ఎక్కువ చదివినవి

మిల్కీ బ్యూటీ చర్మ సౌందర్యం ‘ఉమ్ము’

కాస్త ఎబ్బెట్టుగా ఇబ్బందిగా అసహ్యంగా ఉన్నా కూడా ఇది నిజం. ఈ విషయాన్ని స్వయంగా తమన్నానే చెప్పుకొచ్చింది. నాలుగు పదుల వయసుకు చేరువ అవుతున్నా కూడా మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్‌ ఏమాత్రం...

ఎన్టీవీ.. ‘కోటి దీపోత్సవం’..! ఈ ఏడాదైనా జరిగేనా..?

ఎన్టీవీకి ఆధ్వర్యంలోని భక్తి చానెల్ అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి ఏటా కార్తీకమాసంలో దీపోత్సవం కార్యక్రమాన్ని చేప‌డుతున్న సంగతి తెలిసిందే. ఈ బృహత్తర కార్యక్రమం మొద‌ట్లో ల‌క్ష దీపోత్సవంగా మొద‌లై అనంతరం కోటి...

చేతులెత్తేసిన కేంద్రం: కోవిడ్ మృతులకు పరిహారమివ్వలేరట.!

కరోనా వల్ల తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులకు పది లక్షల రూపాయలదాకా సహాయమందించేందుకు కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ముందుకొచ్చాయి.. కేంద్రం కూడా ఆ దిశగా కొన్ని కార్యక్రమాలు చేపడుతోంది. మరి, కోవిడ్ కారణంగా మృతి...

అను‘కుల’ మీడియా.. ఎవరి కులం.? ఎవరి మీడియా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, తెలుగు నాట మీడియా రాజకీయ పార్టీల వశమైపోయింది. ఓ పార్టీ తరఫున కొన్ని మీడియా సంస్థలు, మరో పార్టీ తరఫున ఇంకొన్ని మీడియా సంస్థలు వకాల్తా పుచ్చుకోవడమనేది...

వ్యాక్సినేషన్ రికార్డ్: వైసీపీ సర్కార్ ‘పబ్లిసిటీ’ రూటే సెపరేటు.!

ఒక్క రోజు.. ఒకే ఒక్క రోజు పదమూడున్నర లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ చేసింది ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మొత్తంగా నిన్న దేశవ్యాప్తంగా జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలిస్తే, ఆంధ్రపదేశ్ వాటా 47...