పంచాంగం:
తేదీ 08-11-2024, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, కార్తీక మాసం, శరత్ ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.02 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:30 గంటలకు.
తిథి: శుక్ల సప్తమి రా. 7.50 వరకు, తదుపరి అష్టమి
నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ 9.24 వరకు, తదుపరి శ్రవణం
దుర్ముహూర్తం: ఉ 8.24 నుంచి 9.12 వరకు, మ. 12.24 నుంచి 1.12 వరకు
శుభ సమయం: ఉ 11.00 నుంచి 12.00 వరకు
రాహుకాలం: ఉ 10.30 నుంచి 12.00 వరకు
యమగండం: మ. 3.00 నుంచి 4.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: అదృష్ట కాలం. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో నెలకొన్న వివాదాలు తగ్గుముఖం పడతాయి. స్నేహితులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి.
వృషభ రాశి: అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల గురించి ఇతరులతో చర్చించేటప్పుడు జాగ్రత్త వహించాలి. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. భాగస్వామ్య వ్యాపారానికి సంబంధించిన ఒప్పంద పత్రాలను జాగ్రత్తగా చూసుకోవాలి. విలువైన వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది.
మిధున రాశి: పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే ఆలోచనను వాయిదా వేయడం మంచిది. బంధువుల రాక సంతోషాన్నిస్తుంది. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి తో వాగ్వాదం ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో నెలకొన్న వివాదాలు మరింత తీవ్రమవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి.
కర్కాటక రాశి: విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక సంబంధ నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించడం ఉత్తమం. ఇంటి పెద్దల అనారోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. వారిపై శ్రద్ధ పెట్టాలి. ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెట్టేటప్పుడు జీవిత భాగస్వామి సలహా తీసుకోండి. పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి.
సింహరాశి: అనుకూల కాలం. ముఖ్యమైన పనులను వేగవంతంగా పూర్తి చేస్తారు. రాజకీయ రంగంలో ఉండే వారికి అదృష్టం కలిసి వస్తుంది. ప్రజాదరణ పెరగడంతోపాటు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. న్యాయవాద వృత్తి రంగంలో ఉండే వారికి విశేషమైన గుర్తింపు లభిస్తుంది.
కన్య రాశి: ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించడం వల్ల భవిష్యత్తు లో సమస్యలకు దారితీస్తుంది. పిల్లల కదలికలపై ఏకాగ్రత అవసరం. వారి ప్రవర్తనపై దృష్టి పెట్టాలి. విద్యార్థులకు శ్రమ ఎక్కువ అవుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వ్యాపారానికి సంబంధించి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు ఈరోజు జరపకపోవడం మంచిది.
తులారాశి: కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారంలో నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఇతరుల సలహా తీసుకోవడం మంచిది. తోబుట్టువుల మద్దతు లభిస్తుంది. కుటుంబంలో నెలకొన్న వివాదాలు తొలగిపోతాయి.
వృశ్చిక రాశి: జీవిత భాగస్వామిని కలుసుకుంటారు. వారిని కుటుంబ సభ్యులకు చేరువ చేస్తారు. గతంలో చేసిన తప్పిదాల వల్ల అధికారుల మందలింపు ఉంటుంది. ఫలితంగా ఉద్యోగులకు స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. చాలాకాలంగా వాయిదా పడ్డ ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.
ధనస్సు రాశి: ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. మనస్పర్ధలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈరోజు రుణ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార భాగస్వామి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. వ్యాపార ప్రత్యర్థులు దెబ్బతీయాలని చూస్తారు. సమయస్ఫూర్తితో వాటిని ఎదుర్కోవాలి.
మకర రాశి: వ్యాపార లావాదేవీలు లాభిస్తాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. పిల్లలతో కలిసి ఆనందంగా గడుపుతారు. శత్రువులకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి విశేషమైన లాభాలు అందుతాయి.
కుంభరాశి: మిశ్రమ కాలం. ఆలోచించి ముందడుగు వేయాలి. ముఖ్యమైన పనుల్లో నిర్లక్ష్యం వహించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రతిష్టను పెంచుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. చాలా కాలం తర్వాత బంధువులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు.
మీన రాశి: ఉదర సంబంధిత అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సామరస్యంగా చర్చించడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తొలగుతాయి. పాత స్నేహితులను కలుసుకుంటారు. బద్ధకాన్ని దరిచేరనీయొద్దు. రుణ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకండి. స్పష్టతతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి.