పంచాంగం:
తేదీ 07-11-2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, కార్తీక మాసం, శరత్ ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.02 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:30 గంటలకు.
తిథి: శుక్ల షష్టి రా. 8.55 వరకు, తదుపరి సప్తమి
నక్షత్రం: పూర్వాషాడ ఉ 9.13 వరకు, తదుపరి ఉత్తరాషాఢ
దుర్ముహూర్తం: ఉ 10.00 నుంచి 10.48 వరకు, మ. 2.48 నుంచి 03.36 వరకు
శుభ సమయం: ఉ 11.00 నుంచి 12.00 వరకు
రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ 6.00 నుంచి 7.30 వరకు
రాశి ఫలాలు
మేషరాశి: కష్టకాలం. ఈరోజు ఈ రాశి వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం పనికిరాదు. వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం. మెరుగైన ఫలితాలు సాధించడానికి శ్రమించాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అపరిచిత వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు జరుపుకుంటూ ఉండటం ఉత్తమం.
వృషభ రాశి: మిశ్రమ కాలం. అదృష్టం కలిసి వస్తుంది. తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. ముఖ్యమైన పనులు చేపట్టే ముందు పెద్దల్ని సంప్రదించడం మంచిది. సొంత నిర్ణయాలను అనుసరించి నడుచుకోవడం వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది.
మిథున రాశి: ఈరోజు ఈ రాశి వారు వ్యాపార సంబంధ విషయాలు ఎవరితోనూ చర్చించకపోవడం మంచిది. వ్యాపార భాగస్వామి ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. సామరస్యంతో మెలగడం మంచిది. విద్యార్థులు మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఆస్తి విషయాల్లో తలెత్తిన వివాదాలు తీవ్రమవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కొరవడుతుంది.
కర్కాటక రాశి: ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. నమ్మిన వారే మోసం చేసే ప్రమాదం ఉంది. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. తోబుట్టువులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు.
సింహరాశి: అదృష్ట కాలం. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభకాలం. భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనుకునేవారు ప్రయత్నాలు మొదలు పెట్టొచ్చు. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అనుకూల సమయం.
కన్య రాశి: ఈ రాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. భవిష్యత్తుకు సంబంధించి కిలక నిర్ణయాలు తీసుకుంటారు. తీవ్రంగా శ్రమించి వ్యాపారులు స్వల్ప లాభాలను పొందుతారు.
తులా రాశి: మిశ్రమ కాలం. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనుల్లో మంచి విజయాలు సాధిస్తారు. ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోళ్లకు సరైన సమయం. వ్యాపారులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి చేపట్టే పనుల్లో అప్రమత్తత అవసరం. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి శ్రమించాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కొన్ని విషయాల్లో ఉదాసీనంగా ఉండాల్సి వస్తుంది. కీలక సమయాల్లో మౌనంగా ఉండటం మంచిది. బంధువుల ప్రవర్తన తో కొద్దిపాటి గందరగోళానికి గురవుతారు.
ధనస్సు రాశి: ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కలహాలకు దూరంగా ఉండటం మంచిది. పనిచేసే వాతావరణంలో సానుకూలత ఉంటుంది. ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది.
మకర రాశి: ఈ రాశి వారు వ్యాపారంలో లాభాలు గడిస్తారు. విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. చాలాకాలంగా వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. పిల్లలతో సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. కుటుంబ సమస్యలపై దృష్టి పెట్టాలి.
కుంభరాశి: ఆశాజనక వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కీలకమైన విషయాలు చర్చించే ముందు ఆచితూచి వ్యవహరించాలి. నూతన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.
మీన రాశి: ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభకాలం. న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.