పంచాంగం
తేదీ 07-02-2025, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:57 గంటలకు.
తిథి: శుక్ల దశమి రా. 11.09 వరకు, తదుపరి ఏకాదశి
నక్షత్రం: రోహిణి రా. 8.32 వరకు, తదుపరి మృగశిర
శుభ సమయం: ఉ 9.23 నుంచి 9.53 వరకు, తిరిగి 12.24 నుంచి 1.12 వరకు
దుర్ముహూర్తం: ఉ 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి మ. 12.24 నుంచి 1.12 వరకు
రాహుకాలం: ఉ 10.30 నుంచి 12.00 వరకు
యమగండం: మ. 3.00 నుంచి 4.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు రావడానికి తీవ్రంగా శ్రమించాలి. అనవసర విషయాల గురించి ఎక్కువ ఆలోచించకండి. మనసు చెడు ఆలోచనల వైపుకు మల్లుతుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.
వృషభ రాశి: మిశ్రమకాలం. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. రుణాలు చేయాల్సి రావచ్చు. రుణ దాతల ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆదాయం మార్గాలను అన్వేషించాలి. అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిధున రాశి: వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార భాగస్వామి ప్రవర్తనను గమనిస్తూ ఉండండి. నమ్మిన వారే మోసం చేసి ప్రమాదం ఉంది. పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటప్పుడు కుటుంబ సభ్యులతో చర్చించండి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.
కర్కాటక రాశి: మనశ్శాంతిని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు పని ప్రదేశంలో అనుకూలంగా ఉంటుంది. పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. నూతన వస్తు, వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
సింహరాశి: అదృష్ట కాలం. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు తొలి అడుగు పడుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
కన్య రాశి: మిశ్రమ కాలం. ఆశించిన ఫలితాలు రావడానికి తీవ్రంగా శ్రమించాలి. ఉదర సంబంధిత అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఆహార నియమాలు పాటించాలి. పని ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆప్తుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
తులారాశి: ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్య మళ్ళీ తిరగబడుతుంది. మీది కానీ వ్యవహారంలో తలదూర్చడం వల్ల న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారు. ఆప్తులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య కొద్దిపాటి విభేదాలు తలెత్తవచ్చు. జాగ్రత్తగా ఉండండి.
వృశ్చిక రాశి: ముఖ్యమైన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. కీలక విషయాల్లో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. మొహమాటాన్ని దరి చేరనివ్వకండి. ఖర్చుల విషయంలో పొదుపు పాటించండి. ఆప్తులతో విలువైన సమయాన్ని గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.
ధనస్సు రాశి: మీ గౌరవ ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. రాజకీయ రంగాల వారికి నూతన పదవులు అందుతాయి. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం.
మకర రాశి: మనశ్శాంతిని దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండాలి. ముఖ్యమైన పనులను, ప్రయాణాలను వాయిదా వేయటం మంచిది. ప్రియ మిత్రుడ్ని కోల్పోవాల్సి రావచ్చు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి.
కుంభరాశి: చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. కీలక విషయాల్లో ధైర్యంగా ముందడుగు వేయండి. ఆప్తుల నుంచి అందిన వార్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొందరి ప్రవర్తన వల్ల కలత చెందుతారు. పని ప్రదేశంలో ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. భవిష్యత్తుకు మేలు చేసే ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు. కొద్దిపాటి అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.